For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు సమస్యలను తీర్చడంలో షాంపుల కంటే ఆయుర్వేద రెమెడీస్ ఉత్తమం..!!

టాక్సిక్ పదార్థాలు కలిపిన షాంపులను వాడటం కంటే, ఆయుర్వేద పరంగా నేచురల్ గా తయారుచేసిన షాంపులను ఎంపిక చేసుకోవడం ద్వారా జుట్టు ఎక్కువ రోజులు స్ట్రాంగ్ గా, హెల్తీగా, ఎలాంటి హాని జరగకుండా ఉంటుంది. ఆ ఆయుర్వే

|

గతంలో అమ్మమ్మల కాలం నుండి తలకు శీకాయ, కుంకుడుకయా, మందారం, వంటి నేచురల్ పదార్థాలతో తల స్నానం చేసే వారు అయితే ప్రస్తుతం ఈ ఆధునిక యుగంలో మార్కెట్లో అందంగా..సువాసనభరింతంగా ఉండే మోడ్రన్, కెమికల్ షాంపులకు ఆకర్షితులవుతూ వాటినే ఎక్కువగా వినియోగిస్తున్నారు.

యాంటీ షాంపులు మరియు నేచురల్ పదార్థాలను చాలా తక్కువగా ఉపయోగించన హెయిర్ క్లెన్సర్స్ ఎంపిక చేసుకుంటున్నారు.

కొనడానికి ముందు వాటిమీద లేముబుల్స్ చదివేవారు ఎంతమంది? చాలా తక్కువే, కానీ, ఇక ముందు ఏ షాంపు కొన్నా లేబుల్ చదవి టాక్సిక్స్ కెమికల్స్ కాకుండా, మన జుట్టుకు సహాయపడే హోం మేడ్ షాంపులను ఎంపిక చేసుకోవాలి.

ఇన్ స్టాంట్ గా మనకు అందుబాలటులో ఉండే షాంపులలో సల్ఫేట్ ఉంటుంది, అలాగే నురగ కూడా ఎక్కువగా ఉంటుంది, ఈ నురగరావడానికి సల్ఫేట్ కారణం. ఇది జుట్టులో నేచురల్ ఆయిల్స్ ను తగ్గించేస్తుంది. ప్రోటీన్స్ తగ్గిస్తుంది, దాంతో హెయిర్ ఫోలిసెల్స్ చాలా కాలం తర్వాత రీజనరేట్ అవుతాయి.

షాంపులలో ఉండే సోడియం క్లోరైడ్ క్రీమీగా ఉండటానిిక మిక్స్ చేస్తారు .ఇది జుట్టును దురదగా, డ్రైగా మార్చుతుంది!ఇవనీ వరస బెట్టి, జుట్టుకు నష్టం కలిగించేవే.అలాగే ప్యారాబీన్ అనే పదార్థం షాంపు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఉపయోగిస్తుంటారు, ఇది జుట్టు మీద ప్రభావం చూపుతుంది. జుట్టు రాలడానికి హార్మోనుల అసమతుల్యం చేయడానికి కారణమవుతుంది.

కాబట్టి, షాంపులల్లో ఇన్ని టాక్సిక్ పదార్థాలు కలిపిన షాంపులను వాడటం కంటే, ఆయుర్వేద పరంగా నేచురల్ గా తయారుచేసిన షాంపులను ఎంపిక చేసుకోవడం ద్వారా జుట్టు ఎక్కువ రోజులు స్ట్రాంగ్ గా, హెల్తీగా, ఎలాంటి హాని జరగకుండా ఉంటుంది. ఆ ఆయుర్వేదింక్ షాంపుల గురించి తెలుసుకుందాం...

కోకనట్ మిల్క్:

కోకనట్ మిల్క్:

ఈ హోం మేడ్ షాంపు జుట్టులో మాయిశ్చరైజింగ్ ను రీస్టోర్ చేస్తుంది. హెయిర్ ఎలాసిటి పెంచుతుంది. ఒక కప్పు కొబ్బరి పాలు, 3/4కప్పు కాస్టిల్ సోప్, 5చుక్కల బాదం ఆయిల్, 5చుక్కల ఆలివ్ ఆయిల్ అన్నీ మిక్స్ చేసి గాలిచొరవడానికి డబ్బాలో వేసి నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు ఉపయోగించాలి.

కుంకుడు కాయ:

కుంకుడు కాయ:

కుంకుడుకాయ పురాతన కాలంలో వీటిని ఎక్కువగా ఉపయోగించే వారు, ఇది జుట్టును శుభ్రం చేస్తుంది, జుట్టుకు కావల్సిన మాయిశ్చరైజింగ్ ను అందిస్తుంది, జుట్టుకు ఎలాసిటిని పెంచుతుంది. కుంకుడుకాయ నీటిలో ఒక గంట సేపు నానబెట్టి తర్వాత తలకు పోసుకుని మసాజ్ చేయాలి. తర్వాత తలస్నానం చేయాలి.

గుడ్డు:

గుడ్డు:

గుడ్డుతో హెయిర్ ప్యాక్ వేసుకుంటే , ఇందులో ఉండే బయోటిన్, విటమిన్ బి12 మరియు ప్రోటీన్స్ ఇవి జుట్టు పెరుగుదలను, వాల్యూమ్ ను, జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తాయి.ఒక బౌల్ తీసుకుని అందులో రెండు గుడ్డు పగలకొట్టి లోపలి మిశ్రామన్ని వేయాలి. తర్వాత 5చుక్కల పెప్పర్మెంట్ ఆయిల్, 6చుక్కల రోజ్మెర్రీ ఆయిల్ ను మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి, జుట్టులోపలి వరకూ అప్లై చేయాలి. ఇది షాంపులకు ప్రత్యామ్నాయ పదార్థం, దీన్ని జుట్టు పొడవును అప్లై చేసి తలస్నానం చేసుకోవాలి

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

యాపిల్ సైడర్ వెనిగర్ జుట్టును శుభ్రం చేస్తుంది, పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తూ పెరుగుతుంది. ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లో అరకప్పు కాస్టిల్ సోప్ మిక్స్ చేసి, స్పూన్ తో మిక్స్ చేసి, తర్వాత ఈ పదార్థాన్ని బాటిల్లో నింపి , రెగ్యులర్ షాంపు మాదిరిగా ఉపయోగించాలి.

అలోవెర:

అలోవెర:

ఆలోవెరలో అల్లోసిన్, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, అలోవెర జుట్టుకు ఇన్ స్టాంట్ గా రిలీప్ ఇస్తుంది. దురదను నివారిస్తుంది, జుట్టు రాలడం అరికడుతుంది, డ్రై హెయిర్ ను స్మూత్ గా మార్చుతుంది.అరకప్పు ఫ్రెష్ గా ఉన్న అలోవెర జ్యూస్ ను తీసుకోవాలి.జుట్టుకు అప్లై చేసి, స్నానం చేయాలి.

హెర్బల్ టీ క్లెన్సర్ :

హెర్బల్ టీ క్లెన్సర్ :

మరో సింపుల్ క్లెన్సర్ హెర్బల్ టీ క్లెన్సర్, ఒక కప్పు రోజ్మెర్రీ టీ తీసుకుని, చల్లార్చాలి, తర్వత అందులో 6 చుక్కల పెప్పర్మింట్ ఆయిల్ మిక్స్ చేసి, అరటేబుల్ స్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేయాలి. బాగా షేక్ చేసి, తలకు, జుట్టు పొడవునా అప్లై చేసి, మసాజ్ చేసి 15నిముసాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ప్లెయిన్ వాటర్ తో శుభ్రంగా తలస్నానం చేయాలి.

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడా ఎక్సలెంట్ హెయిర్ క్లెన్సర్, ఇది జుట్టలో నేచురల్ ఆయిల్స్ ను తగ్గిస్తుంది. కాబట్టి, ఎక్కువగా వాడకుండా, అందులో ఇతర మాయిశ్చరైజింగ్ పదార్థాలతో మిక్స్ చేసి ఉపయోగిస్తే బ్యాలెన్స్ అవుతుంది.

బాగా పండిన అవొకాడో, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడ, వాటర్ తో మిక్స్ చేసి, స్మూత్ గా పేస్ట్ చేయాలి. దీన్ని తలకుఅప్లైచేసి,తలస్నానం చేయాలి.

రైస్ వాటర్:

రైస్ వాటర్:

రైస్ వాటర్ లో ఇనోసిటోల్ ఉంటుంది. ఇడి డ్యామేజ్ అయిన హెయిర్ సెల్స్ ను రిపేర్ చేసి, కొత్త హెయిర్ ఫోలిసెల్స్ ను పెంచుతుంది. దీన్ని జుట్టుకు అప్లై చేసి, అరగంట తర్వతా తలస్నానం చేయాలి.

కీరదోసకాయ:

కీరదోసకాయ:

కీరదోసకాయను జుట్టును శుభ్రపరచడంలో గొప్పగా సహాయపడుతుంది, జుట్టుకు తగినంత హైడ్రేషన్ ను అందిస్తుంది,. జుట్టును స్మూత్ గామార్చుతుంది, ఒక నిమ్మతొక్కలో, కీరదోసకాయ ముక్కలను వేసి, మెత్తగా పేస్ట్చేయాలి. ఈ పేస్ట్నుజుట్టుకు అప్లై చేసి కండీషనర్ గా ఉపయోగించివచ్చు. బాగా మర్దన చేసి తలస్నానం చేసుకోవాలి.

కార్న్ స్ట్రార్చ్:

కార్న్ స్ట్రార్చ్:

ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడలో , ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళు పోసి, కార్న్ స్ట్రార్చ్ పొడి మిక్స్ చేసి బాగా మిక్స్ అయిన తర్వాతతలకు అప్లై చేసి తలస్నానం చేయాలి. ఇది జుట్టును నేచురల్ గా శుభ్రం చేస్తుంది.

English summary

Ditch Shampoo - Here Are 10 Cleansing Ayurvedic Ingredients That Work Even Better!

10 deeply therapeutic Ayurvedic hair-cleansing ubtans that will make your hair twice as longer and stronger in no time minus the harshness!
Story first published: Saturday, November 19, 2016, 15:06 [IST]
Desktop Bottom Promotion