Latest Updates
-
సెలవు రోజున ఆఫీస్ కు రమ్మన్న మేనేజర్..దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మహిళా ఉద్యోగిని..వీడియో చూడండి -
గుడ్డు లేకుండా బేకరీ స్టైల్ ఫ్రూట్ కేక్... ఇంట్లోనే ఇంత ఈజీగా చేయొచ్చని మీకు తెలుసా? -
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల భయం.. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన హెల్త్ కిట్స్ ఇవే.! -
ఫ్యాటీ లివర్ ను ఇట్టే కరిగించే 3 అద్భుతమైన డ్రింక్స్.. హార్వర్డ్ డాక్టర్ సలహా! -
పెళ్లి తర్వాత జంటలకి ఎదురయ్యే సవాళ్లు.. ఎదుర్కొంటే ఆదర్శ దాంపత్యమే.! -
నిజమైన ప్రేమనా ? లేక ఎమోషనల్ అటాచ్మెంటా? ఈ ఒక్క ప్రశ్నతో తేలిపోతుంది! -
కేలరీలు తక్కువ, పోషకాలు పుష్కలం.. సలాడ్లో తప్పనిసరిగా ఉండే బ్రోకలీతో హెల్తీ వెరైటీలు.! -
ఒక్క ముక్కతో ఆగరు,అద్భుతం అంటే ఇదేనేమో..పచ్చిమిర్చి కోడివేపుడు చేసుకోండిలా -
హై బీపీ కంటే లో బీపీనే డేంజర్? ఇంట్లోనే రక్తపోటును నార్మల్ చేసే 5 హోమ్ రెమెడీస్! -
ఆఫీసు కుర్చీలతో ఆరోగ్య సమస్యలు.. గుండెతో పాటు వీటికి ఎనలేని రిస్క్.!
స్ట్రాంగ్ జుట్టు సొంతం చేసుకోవడానికి ఆలివ్ ఆయిల్, ఎగ్ మాస్క్
ప్రతి ఒక్క మహిళ పొడువాటి, ఒత్తైన బలమైన జుట్టు ఉండాలని కోరుకుటుంది. ఒత్తైన జుట్టు తమ అందాన్ని రెట్టింపు చేస్తుందని భావిస్తారు. కానీ ఈ క్రమంలో జుట్టు పెరుగుదల అనేది ఆలస్యం అవుతుంది. ఒక ఇంచ్ జుట్టు పెరుగుదలకు ఎన్నో రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది.
పొడవాటి జుట్టు పొందాలన్నా, వాటిని మెయింటైన్ చేయాలన్నా మొత్తం బ్యూటీ మీద అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ పెన్సీవ్ ట్రీట్మెంట్స్ తో లేదా కెమికల్స్ తో తయారుచేసిన ఖరీదైన ప్రొడక్ట్స్ ను ఉపయోగించి ఎలాంటి ఫలితాలను పొందక విసిగి పోయి ఉంటారు.
ఇవి కూడా జుట్టును మరింత ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. దాంతో జుట్టు పెరుగుదల మీద ప్రభావం చూపుతుంది. వీటికి ప్రత్యామ్నాయంగా ఒత్తైన జుట్టు పెంచుకోవడానికి ఇంట్లోనే సొంతగా ఒక హోం రెమెడీని తయారుచేసుకోవచ్చు. గుడ్డు, ఆలివ్ ఆయిల్ జుట్టు పెరుగుదలకు గ్రేట్ గా సహాయపడుతాయి.

గుడ్డులో ప్రోటీన్స్, జింక్, సల్ఫర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు గ్రేట్ గా సహాయపడుతాయి. అదే విధంగా ఆలివ్ ఆయిల్ కూడా వివిధ రకాల హెయిర్ బెనిఫిట్స్ ను కలిగి ఉంటుంది. ఇది నేచురల్ హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది. కాబట్టి రెగ్యులర్ హెయిర్ కేర్ లో దీన్ని చేర్చుకోవడం చాలా అవసరం.
ఈ రెండింటి కాంబినేషన్లో హోం రిసిపిని తయారుచేసుకోవడం వల్ల జుట్టు పొడవుగా మరియు షైనీగా పెరగుతుంది . అంతే కాదు జుట్టుకు నేచురల్ మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి, ఒత్తైన పొడవైన జుట్టును పొందడానికి ఒక అద్భుతమైన హోం రెమెడీని మీకు ఇంట్లోనే తయారుచేసుకొనే పద్దతిని ఈ క్రింది విధంగా అందిస్తున్నాము.
కావల్సిన పదార్థాలు: ఎగ్ వైట్, ఆలివ్ ఆయిల్, తేనె

తయారుచేయు విధానం:
1. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గుడ్డు మిశ్రమాన్ని వేయాలి. హనీ, ఆలివ్ ఆయిల్ , తేనె మూడింటిని సమంగా తీసుకోవాలి.
2. ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలి. పేస్ట్ అయ్యే వరకూ మిక్స్ చేస్తూనే ఉండాలి.
3. ఈ పేస్ట్ ను జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 20 నిముషాలు అలాగే ఉండనివ్వాలి.
4. 20నిమిషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. షాంపుతో తలస్నానం చేస్తే ఎగ్ స్మెల్ పోతుంది. జుట్టు వేగంగా పెంచుకోవడానికి ఈ పద్దతిని వారంలో రెండు మూడు సార్లు ప్రయత్నించవచ్చు. దీంతో పాటు హెల్తీ డైట్ ను అనుసరించాల్సి ఉంటుంది. అలాగే రెగ్యులర్ హెయిర్ ఆయిల్ తో జుట్టుకు మసాజ్ చేయాలి. డ్రై అండ్ స్ట్రెయిట్ హెయిర్ స్టైలింగ్ కు దూరంగా ఉండాలి.



Click it and Unblock the Notifications