Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అల్లం, నిమ్మ, నువ్వుల నూనెతో... వాలు జడ సొంతం..!!
పొడవాటి, అందమైన జుట్టు చూసి.. వాళ్లకు అంత పొడవు జుట్టు ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోతుంటాం. జుట్టు పెరుగుదల కంటే.. జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. రెండు నెలలకు జుట్టు 2 ఇంచులు మాత్రమే పెరుగుతుంది. అయితే.. లాంగ్ హెయిర్ పొందాలనేది మాత్రమే.. ఎప్పటికీ.. కుదరని కలలా భావిస్తుంటారు.
జుట్టు పెరుగుదల సమస్యతో పాటు ఇతర సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. చివర్లు చిట్లిపోవడం, డ్యామేజ్ అవడం వంటి సమస్యలు జుట్టు పెరుగుదలను అడ్డుకుంటాయి. ఒకవేళ మీకు చాలా చిట్లిపోయి ఉంటే.. అది జుట్టు పెరుగుదలపై చాలా దుష్ర్పభావం చూపుతుంది. కాబట్టి ముందుగా దాన్ని ట్రీట్ చేయడం మంచిది.

జుట్టు పొడవుగా పెరగాలని మీరు కోరుకుంటే.. ముందుగా.. అన్ హెల్తీ జుట్టుని తీసేయాలి. జుట్టు వేగంగా పెరగడానికి చాలా హోం రెమిడీస్ ఉన్నాయి. న్యాచురల్ రెమిడీస్ ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు ఇస్తాయి. అయితే అల్లం, నిమ్మరసం, నువ్వుల నూనె జుట్టు వేగంగా పెరగడానికి ఎలా సహాయపడతాయో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు
అల్లం
ఒక నిమ్మకాయ
జుట్టుని బట్టి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె

తయారు చేసే విధానం
నిమ్మరసం తీసి.. ఒక గిన్నెలో వేసుకోవాలి. అల్లం తురిమి.. అందులో కలపాలి. కాసేపు బాగా కలిపాలి. ఇప్పుడు నువ్వుల నూనె కలిపితే.. హెయిర్ గ్రోత్ కి సహాయపడే.. సొల్యూషన్ రెడీ అవుతుంది. మరీ ఎక్కువగా ఆయిల్ కలిపితే.. చాలా లిక్విడ్ గా మారుతుంది. కాబట్టి చెప్పిన పరిమాణంలో తీసుకోవాలి.
ఈ ఆయిల్ ని స్కాల్ప్ పై బాగా మసాజ్ చేయాలి. 10 నుంచి 15 నిమిషాలు బాగా మసాజ్ చేయాలి. అప్పుడే.. అల్లం, నిమ్మరసం.. స్కాల్ప్ కి పట్టుకుంటాయి. అలాగే మసాజ్ వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే.. బ్లడ్ సర్క్యులేషన్ స్కాల్ప్ కి పెరుగుతుంది. దీనివల్ల వేగంగా జుట్టు పెరుగుతుంది.

ఈ ఆయిల్ లో ఉపయోగించిన పదార్థాలు.. జుట్టుకి చాలా గొప్ప ప్రయోజనాలు అందిస్తాయి. నిమ్మరసం.. స్కాల్ప్ లో వచ్చే డాండ్రఫ్, ఇన్ఫెక్షన్ ని నివారిస్తాయి. స్కాల్ప్ ని హెల్తీగా మార్చి.. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అల్లం స్కాల్ప్ కి రక్త ప్రసరణను పెంచుతుంది. జుట్టు స్ట్రాంగ్ గా, హెల్తీగా మారడానికి సహాయపడుతుంది.
నువ్వుల నూనెలో విటమిన్స్, మినరల్స్, పోషకాలు.. ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా, షైనీగా మారుతుంది. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు.. వెంటనే ఈ టిప్ ఫాలో అయిపోయి.. పొడవాటి జుట్టుని సొంతం చేసుకోండి.



Click it and Unblock the Notifications