For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై హెయిర్ నివారించడానికి బెస్ట్ నేచురల్ లెమన్ -కుకుంబర్ షాంపు..

|

ఆరోగ్యం, ప్రకాశంతంగా కనిపించే కేశాలు మన అందాన్ని మరింత అందంగా చూపిస్తుంది. ఈ విషయం మనందరం అంగీకరిస్తాము. జుట్టు ఆరోగ్యంగా , సాప్ట్ గా మరియు సిల్కీగా ఉండాలని కోరుకుంటే తప్పనిసరిగా వాటిని మెయింటైన్ చేయడం , సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

మనలో చాలా మంది ముఖానికి ఇచ్చే ప్రాధాన్యాత కేశాలకు ఇవ్వరన్న విషయం మనకు తెలిసింది. మరికొందరైతే ఆయిల్ హెయిర్ , డ్రై హెయిర్ మరియు అసలు జుట్టును మ్యానేజ్ చేయడానికి కూడా వీలుపడిని విధంగా ఉన్న జుట్టుతో రోజులను గడుపుకొస్తుంటారు.

డ్రై హెయిర్, ఆయిలీ హెయిర్, చిక్కుబడిన జుట్టు ..ఇలాంటి జుట్టు సమస్యలున్నప్పుడు కొన్ని సందర్భాల్లో భయంకరంగా అనిపిస్తుంది . అంతే కాకుండా డ్రై హెయిర్ మరియు నిర్జీవమైన జుట్టును మెయింటైన్ చేయడానికి వీలు పడక ఉన్న అందం కాస్తా పాడుచేస్తూ అందవిహీనంగా కనబడేలా చేస్తుంది.

Lemon And Cucumber Shampoo For Dry Hair

ఇలాంటి జుట్టును మ్యానేజ్ చేయడానికి గంటలు గంటలు సమయాన్ని గడుపుతూ , ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ ను కొనడం, డ్రైగా ఉన్న జుట్టును నివారించుకోవడానికి వేలల్లో ఖర్చుపెడుతూ ...టైమ్ వేస్ట్ చేస్తూ సలూన్ల చుట్టూ తిరుగుతుంటారు . ఇంకా కాస్మోటిక్ ప్రొడక్ట్స్ లో కెమికల్స్ వినియోగం అధికంగా ఉండటం వల్ల ఇది వ్యతిరేక దుష్రభావాలను ఎక్కువగా కలిగి ఉంటుంది. దాంతో ఉన్న జుట్టు కాస్త మరింత డ్యామేజ్ కు గురి అవుతుంది.

హెయిర్ డ్రైనెస్ ను తగ్గించుకోవాలనుకుంటే , మీ జుట్టు సిల్కీగా మరియు సాప్ట్ హెయిర్ ను నేచురల్ గా మార్చుకోవాలనుకుంటే వివిధ రకాల నేచురల్ పదార్థాలు మనకు వరంగా అందుబాటులో ఉన్నాయి . ఇవి మన వంటగదిలోనే అనునిత్యం మనం ఉపయోగించే పదార్థాలే అయినా, జుట్టు కు చాలా గ్రేట్ గా సహాయపడుతాయి . జుట్టు డ్రై నెస్ ను నివారించుకోవడానికి .. కీరదోస మరియు నిమ్మరసం కాంబినేషన్ గొప్పగా సహాయపడుతుందని చాలా మందికి తెలియదు. ఈరెండింటి కాంబినేషన్ లో షాంపు తయారుచేసి తలకు పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Lemon And Cucumber Shampoo For Dry Hair

కీరదోసకాయలో యాంటీఆక్సిడెంట్స్ , వివిధ రకాల న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి . హెయిర్ ఫోలీ సెల్స్ కు తగిన పోషణను అందిస్తుంది. అంతే కాదు జుట్టుకు తగినంత తేమను కూడా అందిస్తుంది. అలాగే జుట్టు యొక్క పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది . ఇలా బ్యాలెన్స్ చేయడం వల్ల డ్రైజుట్టు నివారించబడుతుంది. అంతే కాదు, కీరదోసకాయలోని కూలింగ్ ఎఫెక్ట్ జుట్టుకు కూడా అందిస్తుంది . దాంతో జుట్టు డ్రైగా మారడం నివారిస్తుంది.

నిమ్మరసం, ఇందులో అసిడిక్ గుణాలు అధికంగా ఉంటాయి . ఇది జుట్టు మరియు తలను ఎఫెక్టివ్ గా శుభ్రం చేస్తుంది . ఇది ఆయిల్, మురికిని మరియు జుట్టులోని మైక్రోబ్స్ ను తొలగించి జుట్టును క్లీన్ గా మరియు రిఫ్రెష్ చేస్తుంది . ఇంకా నిమ్మరసం చుండ్రును నివారిస్తుంది. కీరదోస మరియు నిమ్మరసం కాంబినేషన్ లో షాంపు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

Lemon And Cucumber Shampoo For Dry Hair

1. కీరదోసకాయకు తొక్కను తొలగించి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే నిమ్మకాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2తర్వాత మిక్సీ జార్ లో ఈ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. ఈ పేస్ట్ ను వడగంటి జ్యూస్ వేరుగా తీసుకోవాలి.
4. ఈ జ్యూస్ ను బాటిల్లో పోసి బాగా షేక్ చేయాలి. . అంతే మీరు ఉపయోగించడానికి షాంపు రెడీ .
5. జుట్టును తడి చేసి ఈ నేచురల్ షాంపును తడి జుట్టుకు అప్లై చేసి తల మొత్తానికి స్ప్రెడ్ చేస్తూ చేతి వేళ్లతో రుద్దాలి.
6. ఇలా తలలో కొన్ని నిముషాలు మసాజ్ చేసి, తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ పద్దతిని వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

DIY: Lemon And Cucumber Shampoo For Dry Hair

Healthy, lustrous hair adds a certain charm to our looks, we can all agree on that. Some lucky folks are born with hair that is as soft as silk and easily manageable.
Story first published:Wednesday, April 27, 2016, 16:03 [IST]
Desktop Bottom Promotion