Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
హెయిర్ సాప్ట్ గా...షైనీగా మార్చుకోవడానికి బొప్పాయి హెయిర్ మాస్క్..!!
డల్ అండ్ డ్రై హెయిర్ ఉన్నట్లైతే ఎవరికైనా సరే చీరకు కలుగుతుంది. ఈ సమస్యను నివారించుకోవడం కోసం, మార్కెట్లో అందుబాటులో ఉండే కమర్షియల్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల వీటిలో ఉండే కెమికల్ ప్రొడక్ట్స్, జుట్టును మరింత డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి, వీటికి ప్రత్యామ్నాయంగా కొన్ని నేచురల్ పదార్థాలు ఉపయోగించడం వల్ల జుట్టు పెరగడాన్ని సపోర్ట్ చేస్తాయి . కెమికల్ ప్రొడక్ట్స్ జుట్టుకు డ్యామేజ్ కలిగించడం మాత్రమే కాదు, వీటి ఖరీదు కూడా ఎక్కువే..
కాబట్టి, నేచురల్ పదార్థాలలో ఒకటైన బొప్పాయి పండును బ్యూటిఫుల్ హెయిర్ మాస్క్ గా ఉపయోగించుకోవచ్చు. బాగా పండిన బొప్పాయి హోం మేడ్ హెయిర్ మాస్క్ గా ఉూపయోగించుకోవచ్చు . బొప్పాయితో పాటు, కోకనట్ మిల్క్ మరియు తేనె ఉపయోగించడం వల్ల జుట్టుకు తగిన హైడ్రేషన్ అందిస్తుంది. ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు ఆరోగ్యంగా...అందంగా పెరుగుతుంది. అదెలాగో చూద్దాం...
హెయిర్ మాస్క్ కోసం ఉపయోగించే ఈ మూడు పదార్థాల్లో ఒక్కో దానికి ఒక్కో విధమైన ప్రయోజనాలున్నాయి.. అవేంటంటే..

పండిన బొప్పాయి:
బాగా పండిన బొప్పాయిలో విటమిన్ ఎ, సి , బీటా కెరోటిన్, మెగ్నీషియం, పొటాషియం మరియు కాపర్ వంటి వివిధ రకాల న్యూట్రీషియన్స్ ఉన్నాయి . ఇవి హెల్తీ హెయిర్ గ్రోత్ కు సపోర్ట్ చేస్తాయి . ఇంకా జుట్టు స్మూత్ గా మరియు షైనీగా మార్చుతాయి. ఇంకా బొప్పాయిలోని పెపైన్ అనే ఎంజైమ్ తలలో మలినాలను నివారిస్తాయి. ఇది గ్రేట్ హెయిర్ కండీషనర్ గా ఉపయోగించడం వల్ల నిర్జీవమైన జుట్టు తిరిగి పునరుత్తేజమవుతుంది.

కోకనట్ మిల్క్ :
హెయిర్ కేర్ విషయంలో కొబ్బరి పాలు గ్రేట్ హోం రెమెడీ. ఇందులో ఉండే విటమిన్ ఇ మరియు ఫ్యాట్ కంటెంట్ హెయిర్ రూట్స్ నుండి స్ట్రాంగ్ చేస్తాయి. ఇవి డ్రై హెయిర్ ను సాప్ట్ గా మార్చుతాయి. ఇది జుట్టులోపలికి చాలా సులభంగా చొచ్చుకుపోతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

తేనె:
జుట్టుకు తేనె ఒక అద్భుతమైన పదార్థం. ఈ నేచురల్ ఎమోలియంట్ , హెయిర్ సాప్ట్నర్ గా పనిచేస్తుంది. జుట్టును సాప్ట్ గా మార్చుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ జుట్టును హెల్తీగా మార్చి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

బొప్పాయి హెయిర్ మాస్క్ ను ఎలా తయారుచేయాలి?
కావల్సిన పదార్థాలు:
బొప్పాయి : 1/2cup
కోకనట్ మిల్క్: 1/4cup
తేనె: 1tsp

తయారుచేయు విధానం:
బాగా పండిన బొప్పామి ముక్కలను మిక్సర్ లో వేయాలి.

కి కోకనట్ మిల్క్, తేనె మిక్స్
దీనికి కోకనట్ మిల్క్, తేనె మిక్స్ చేయాలి.

మొత్తం మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్ చేయాలి.
3. ఈ మొత్తం మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్ చేయాలి.
4. ఈ పేస్ట్ ను ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే బొప్పాయి హెయిర్ మాస్క్ రెడీ.

తలస్నానం చేయాలి.
తలకు షాంపుతో తలస్నానం చేయాలి.

తర్వాత బొప్పాయి, హనీ , కోకనట్ మిల్క్ హెయిర్ మాస్క్ అప్లై చేయాలి
తర్వాత ఈ మాస్క్ ను జుట్టు మొత్తానికి అప్లై చేయాలి.

హెడ్ బాత్
షవర్ క్యాప్ ను పెట్టుకుని , అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి,

హెయిర్ మాస్క్ ను వారంలో రెండు సార్లు వేసుకుంటే,
ఈ హెయిర్ మాస్క్ ను వారంలో రెండు సార్లు వేసుకుంటే, మంచి ఫలితం ఉంటుంది. డ్రైగా, డల్ గా ఉన్న జుట్టు సాప్ట్ గా షైనీగా మారుతుంది. ఈ హెయిర్ మాస్క్ హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది, దీన్ని అప్లై చేసిన తర్వాత షాంపు చేయాల్సిన అవసరం లేదు .



Click it and Unblock the Notifications