Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
జుట్టు పొడవుగా స్ట్రాంగ్ గా పెరగడానికి బొప్పాయి హెయిర్ మాస్క్ ...!
ప్రస్తుత రోజుల్లో జుట్టు సమస్యలు ఎదుర్కొనే వారి సంఖ్యం రోజు రోజుకి పెరిగిపోతున్నది. జుట్టు రాలడం, జుట్టు పల్చగా మారడం, హెయిర్ బ్రేకేజ్, జుట్టు చిట్లడం, చుండ్రు, మొదలగు సమస్యల వల్ల జుట్టు రాలడం అధికమౌతుంది. ఇంకా కొన్ని హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల, పౌష్టికాహారం లోపం వల్ల కూడా జుట్టు రాలడం ప్రారంభమౌతుంది. జుట్టు రాలడం నివారించుకోవడానికి ఇంట్లోనే స్వయంగా కొన్ని హెయిర్ మాస్క్ లను తయారుచేసుకోవచ్చు .
బయట మార్కెట్లో అందుబాటులో ఉండే కెమికల్ హెయిర్ ప్రొడక్ట్స్ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి, కాబట్టి, వీటిలో ఉండే కెమికల్స్ జుట్టును మరింత బలహీనపరిచి, జుట్టు రాలడానికి కారణమవుతాయి. కాబట్టి సహజ పద్దతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.
సహజపద్దతులను ఉపయోగించడానికి మనకు ప్రక్రుతి ప్రసాధించిన పదార్థాలు చాలానే ఉన్నాయి. ఇవి నేచురల్ గా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అటువంటి సహజ పదార్థాల్లో పండ్లు. పండ్లలో బొప్పాయి సౌందర్యాన్ని పెంచడంలో గొప్పగా పనిచేస్తుంది. దీన్ని చర్మ, కేశ సంరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పొడవాటి, స్ట్రాంగ్ జుట్టును పొందడానికి అమ్మాయిలు వారి రెగ్యులర్ బ్యూటీ కిట్ లో బొప్పాయి చేర్చుకోవాలి.
బొప్పాయిను జుట్టుకు ప్యాక్ వేసుకోవడం, అనేక ప్రయోజనాలను పొందవచ్చు అదేలాగో తెలుసుకుందాం..

పండిన బొప్పాయి:
బాగా పండిన బొప్పాయిలో విటమిన్ ఎ, సి , బీటా కెరోటిన్, మెగ్నీషియం, పొటాషియం మరియు కాపర్ వంటి వివిధ రకాల న్యూట్రీషియన్స్ ఉన్నాయి . ఇవి హెల్తీ హెయిర్ గ్రోత్ కు సపోర్ట్ చేస్తాయి . ఇంకా జుట్టు స్మూత్ గా మరియు షైనీగా మార్చుతాయి. ఇంకా బొప్పాయిలోని పెపైన్ అనే ఎంజైమ్ తలలో మలినాలను నివారిస్తాయి. ఇది గ్రేట్ హెయిర్ కండీషనర్ గా ఉపయోగించడం వల్ల నిర్జీవమైన జుట్టు తిరిగి పునరుత్తేజమవుతుంది.

కోకనట్ మిల్క్ :
హెయిర్ కేర్ విషయంలో కొబ్బరి పాలు గ్రేట్ హోం రెమెడీ. ఇందులో ఉండే విటమిన్ ఇ మరియు ఫ్యాట్ కంటెంట్ హెయిర్ రూట్స్ నుండి స్ట్రాంగ్ చేస్తాయి. ఇవి డ్రై హెయిర్ ను సాప్ట్ గా మార్చుతాయి. ఇది జుట్టులోపలికి చాలా సులభంగా చొచ్చుకుపోతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

తేనె:
జుట్టుకు తేనె ఒక అద్భుతమైన పదార్థం. ఈ నేచురల్ ఎమోలియంట్ , హెయిర్ సాప్ట్నర్ గా పనిచేస్తుంది. జుట్టును సాప్ట్ గా మార్చుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ జుట్టును హెల్తీగా మార్చి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

బొప్పాయి , పెరుగు హెయిర్ మాస్క్
ఈ రెండింటి కాంబినేషన్లో హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల డ్రై హెయిర్ నివారించబడుతుంది. జుట్టు చిట్లకుండా రిలీఫ్ అవుతుంది బొప్పాయిని అరకప్పు తీసుకుని, మెత్తగా గుజ్జు చేసి 2 టేబుల్ స్పూన్ పెరుగు మిక్స్ చేసి, బాగా మిక్స్ చేయాలి. స్మూత్ గా పేస్ట్ లా అయిన తర్వాత తలకు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత క్లీన్ గా ఉండే క్లాత్ ను తలకు చుట్టాలి. ఒక గంట తర్వాత షాంపుతో మరియు కండీషనర్ ను తో తలస్నానం చేయాలి.

బొప్పాయి, కొబ్బరి పాలు మరియు తేనెతో హెయిర్ మాస్క్ :
ఈ మూడింటి కాబినేషన్ పదార్థాలు జుట్టు సమస్యలను నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తాయి. ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్ ను వారంలో ఒకసారి అప్లై చేస్తే జుట్టు స్ట్రాంగ్, షైనీగా పెరుతుంది. హెయిర్ బ్రేక్ కాకుండా ఉంటుంది

కొబ్బరి పాలు
టూబేల్ స్పూన్ల బొప్పాయి తీసుకుని అందులో కొబ్బరిపాలు, తేనె మిక్స్ చేయాలి. మూడింటిని బాగా కలిసేలా మిక్స్ చేయాలి. తర్వాత లకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత షాంపును , కండీషనర్ తో శుభ్రం చేసుకోవాలి.
3. బొప్పాయి, ఆలివ్ ఆయిల్, తేనె హెయిర్ మాస్క్ : బొప్పాయి, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, తలకు అప్లై చేయడం వల్ల జుట్టు స్ట్రాంగ్ గా , షైనీగా, పొడవుగా పెరుగుతుంది.
ఒక బౌల్లో 3, 4 టేబుల్ స్పూన్ల బొప్పాయి తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను తలకు అప్లై చేసి, షవర్ క్యాప్ ను పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత షాంపు, కండీషనర్ తో తలస్నానం చేయాలి.

బొప్పాయి, అరటి, తేనె హెయిర్ మాస్క్
బొప్పాయి, అరటి, తేనె కాంబినేషన్ హెయిర్ మాస్క్ జుట్టుకు ఎక్స్ ట్రా షైనింగ్ ను ఇస్తుంది. ఇది జుట్టును నేచురల్ గానే స్ట్రెయిట్ గా మార్చుతుంది. బాగా పండిన బొప్పాయిని, మెత్తగా చేసి, అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేయాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి, దీన్ని జుట్టుకు అప్లై చేయాలి. 3 గంటల తర్వాత షాంపు, మరియు కండీషనర్ తో తలస్నానం చేయాలి.

బొప్పాయి, నిమ్మరసం, తేనె హెయిర్ మాస్క్
వారానికొకసారి, ఈ బొప్పాయి హెయిర్ మాస్క్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు. బొప్పాయి పొట్టు తొలగించి, మెత్తగా పేస్ట్ చేసి అందులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, తేనె మిక్స్ చేసి, తలకు మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. బొప్పాయితో ఇలాంటి టిప్స్ ఫాలో అవుతుంటే తప్పనిసరిగా జుట్టు స్ట్రాంగ్ గా మరియు పొడవుగా పెరుగుతాయి.



Click it and Unblock the Notifications