Latest Updates
-
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
వెనిగర్ తో చుండ్రు వదిలించే సింపుల్ సొల్యూషన్స్
టీనేజర్స్ ను ఎక్కువగా వేధించే సమస్య చుండ్రు. జుట్టు రాలడం ఒక సమస్య అయితే.. చుండ్రు మరింత ఇబ్బంది పెట్టే సమస్య. దీనివల్ల స్కాల్ఫ్ పై దుష్ర్పభావం చూపుతుంది. సాధారణంగా స్కాల్ఫ్ పొడిబారి, దురగా ఉంది అంటే.. చుండ్రు సమస్య మొదలైనట్టే. ఈ సమస్య ఎక్కువగా వింటర్, సమ్మర్ లో కనిపిస్తూ ఉంటుంది.
చుండ్రును నివారించే 11 నేచురల్ హోం రెమెడీస్ ....
చలికాలంలో స్కాల్ఫ్ లో ఎక్స్ ట్రా మాయిశ్చరైజర్ విడుదలైతే.. సమ్మర్ లో స్కాల్ఫ్ పొడిబారుతుంది. దీనివల్ల చుండ్రు మొదలై.. దురద ఎక్కువగా ఉంటుంది. చుండ్రు ఒక్కసారి మొదలైంటి దాన్ని వదిలించడం చాలా కష్టమైన పని. షాంపూలు, కండిషనర్స్, ఆయిల్స్ వాడినా.. తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. కానీ.. మళ్లీ రెండ్రోజులకే.. డాండ్రఫ్ మొదలవుతుంది.
తెల్ల జుట్టు నివారించుకోవడానికి 10 నేచురల్ మార్గాలు
అయితే చుండ్రు వదిలించడానికి యాపిల్ సైడర్ వెనిగర్ చక్కటి పరిష్కారం. ఇందులో ఉండే న్యాచురల్ ఎసిడిక్ ప్రాపర్టీస్.. తలలో చుండ్రు ఏర్పడకుండా నివారిస్తుంది. అలాగే ఇప్పటివరకు ఉన్న చుండ్రుని కూడా తగ్గిస్తుంది. అయితే చుండ్రు నివారించడానికి వెనిగర్ ఉపయోగించడం కూడా చాలా సింపుల్. చుండ్రు వదిలించడానికి వెనిగర్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..

వెనిగర్, పుదినా
కొన్ని పుదినా ఆకులను పేస్ట్ లా చేసి.. రసం తీయాలి. ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు, మాడుకి పట్టించి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చుండ్రు తొలగిపోయి.. జుట్టు మంచి సువాసన వస్తుంది.

వెనిగర్, ఎసెన్షియల్ ఆయిల్
ఎసెన్షియల్ ఆయిల్, వెనిగర్ మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల పొడిజుట్టు, సాఫ్ట్ గా తయారవుతుంది. ముందుగా వెనిగర్ తలకు పట్టించాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఎసెన్షియల్ ఆయిల్ రాసుకుని.. రాత్రంతా ఉంచుకోవాలి. ఉదయాన్నే.. శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

వెనిగర్, పెరుగు
ముందుగా తలకు వెనిగర్ పట్టించాలి. 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. అరగంట తర్వాత పెరుగుని తలకు మాస్క్ లా అప్లై చేయాలి. కాస్త ఆరిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుంటే.. చుండ్రు సమస్య తగ్గిపోతుంది.

వెనిగర్, టీ ట్రీ ఆయిల్
ముందుగా జుట్టుని యాపిల్ సైడర్ వెనిగర్ తో శుభ్రం చేసుకోవాలి. జుట్టు డ్రై అయ్యాక టీ ట్రీ ఆయిల్ ని తలకు, స్కాల్ఫ్ కి పట్టించాలి. జుట్టు కాస్త ఆరిన తర్వాత అంటే 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ఆయిల్ చుండ్రుని పోగొట్టడమే కాదు.. మీ జుట్టుకి షైనింగ్ ని, న్యాచురల్ లుక్ ని అందిస్తుంది.

వెనిగర్, ఆలివ్ ఆయిల్
కొబ్బరినూనెకు బదులుగా ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే చాలా మంచిది. ఇది జుట్టుకి మంచి పోషణను ఇస్తుంది. ఆయిల్ అప్లై చేశాక.. జుట్టుని గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఆరిన తర్వాత మళ్లీ వెనిగర్ అప్లై చేయాలి. నెలకు రెండుసార్లు ఇలా చేస్తే.. డాండ్రఫ్ తగ్గిపోతుంది. మళ్లీ రాదు.

వెనిగర్, మెంతి ఆకు
మెంతి ఆకులను మెల్తగా పేస్ట్ చేసి ఒక కప్పు వెనిగర్ లో కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా మర్దనా చేయాలి. 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి.

వెనిగర్, తేనె
తల మాడుకి తేనెను పలుచగా అప్లై చేయాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మరుసటి రోజు వెనిగర్ కలిపిన నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. ఈ రెండు పదార్థాల్లో బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి ఇవి తలలో చుండ్రుని నివారిస్తాయి.
చూశారుగా.. చక్కటి సింపుల్ టిప్స్. ఈ చిట్కాలు ప్రయత్నించి మీ తలలో చుండ్రుని వెంటనే నివారించుకోండి.



Click it and Unblock the Notifications