Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
బట్టతలను నివారించే వెరీ సింపుల్ మిరాకిల్ టిప్స్
బట్టతలను అలోపీసియా అని పిలుస్తారు . అంటే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. రాలిపోయిన జుట్టును రీప్లేస్ చేయలేం . అలాంటి ప్రదేశంలో చర్మం మాత్రమే కనడుతుంటుంది. దీన్ని బట్టతలగా పిలుస్తుంటారు. బట్టతల సమస్య స్త్రీల కంటే పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. బట్టతలకు అనేక కారణాలు ఉన్నాయి. స్ట్రెస్, హార్మోనల్ అసమతుల్యతలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మరియు న్యూట్రీసియన్ లోపం ఇవన్నీ బట్టతలకు కారణం అవుతాయి . బట్టతల హెరిడిటీ వల్ల కూడా రావచ్చు . వయస్సై పైబడటం క్యాన్సర్ ట్రీట్మెంట్ లో భాగంగా కీమో థెరఫీ వంటి ట్రీట్మెంట్ కూడా కారణం కావచ్చు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులైన టైఫాయిడ్, అనీమియా..వైరల్ సర్జరీ అన్నీ కారణమవుతాయి.
ఒక్క సారి బట్టతల ఏర్పడ్డ తర్వాత రాలిపోయిన జుట్టును తిరిగి పొందలేము అనుకునే వారు చాలా మంది ఉన్నారు. అయితే కోల్పోయిన జుట్టును తిరిగి పొందడానికి ప్రస్తుతం అనేక మార్గాలున్నాయి. బట్టతలను నివారించడానికి వివిధ రకాల హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి బట్టతల ఏర్పడకుండా రక్షణ కల్పిస్తాయి . పురుషుల్లో బట్టతల సాధారణంగా హెరిడిటి వల్లే వస్తుంది. అయితే మహిళల్లో చాలా రేర్ గా వస్తుంది. మహిళల్లో బట్టతలకు హార్మోనుల లోపం మరియు పౌష్టకాహార, న్యూట్రీషియన్ లోపం. కాబట్టి, బట్టతలకు కారణాలు ఏవైనా సమస్య మరింత ఎక్కువ కాకముందే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
అందుకు హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఒక వేళ వెంటనే స్పందించకుండా ఖరీదైన హెయిర్ ట్రీట్మెంట్ మరియు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ మరియు ఫ్లాప్ సర్జరీ వంటి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల బ్లీడింగ్, ఇన్ఫెక్షన్స్ లేదా స్కార్స్ ఫార్మేషన్ వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల నేచురల్ పద్దతులను ఎంపిక చేసుకోవడం మంచిది, ఈ నేచురల్ పద్దతిలో హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి...
బట్టతలను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ :

1. కాఫీ :
యూరోపియన్ హెయిర్ రీసెర్చ్ సొసైటీ జరిపిన పరిశోదనల్లో కాఫీలో ఉండే కెఫిన్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని కనుగొన్నారు. కాఫీ పౌడర్ ను బట్టతల ప్రాంతంలో అప్లై చేయడం వల్ల బట్టతలను నివారించుకోవచ్చు. రాలిపోయిన జుట్టు తిరిగి పెరడగానికి సహాయపడుతుంది

2. కోరియాండర్ జ్యూస్ :
కొత్తిమీరను మెత్తగా పేస్ట్ చేసి అందులో నుండి రసం తీసి బట్టతల ప్రదేశంలో అప్లై చేయాలి. దీన్ని రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

3. ఆవనూనె మరియు హెన్నా లీవ్స్ :
ఆవనూనెలో కొన్ని హెన్నా లీవ్స్ వేసి బాయిల్ చేయాలి. బట్టతల ఉన్న ప్రదేశంలో దీన్ని అప్లై చేయాలి. రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే కొత్తగా జుట్టు మొలవడం ప్రారంభమవుతుంది.

4. కోకోనట్ మిల్క్ :
కోకనట్ మిల్క్ లో ప్రోటీన్స్ అందివ్వడంతో పాటు కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కొబ్బరి బోండాంలోని నీరు నేరుగా తలకు అప్లై చేయడం వల్ల కొత్త జుట్టు మొలవడాన్ని ప్రోత్సహిస్తుంది.

5. ఆమ్లా శీకాయ మరియు కుంకుడు కాయ:
ఈ మూడు పదార్థాలు మిక్స్ చేసి వేడి నీటిలో వేసి బాయిల్ చేయాలి. ఇది షాంపులాగా తయారవుతుంది. ఈ నేచురల్ షాంపు వాటర్ ను రెగ్యులర్ అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బట్టతలను నివారించడంలో గ్రేట్ అండ్ ఎఫెక్టివ్ హోం రెమెడీ..

6. నిమ్మరసం మరియు బ్లాక్ పెప్పర్ సీడ్స్:
బ్లాక్ పెప్పర్ పౌడర్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి బట్టతల ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంతో పాటు, ఇక ముందు జుట్టు రాలిపోకుండా నివారిస్తుంది .

7. లికోరైస్, మిల్క్ మరియు కుంకుమపువ్వు:
కొద్దిగా కుంకుమపువ్వును పాలతో మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని బట్టతల ఏర్పడిన ప్రాంతంలో అప్లై చేయడం వల్ల సమస్య ఎఫెక్టివ్ గా నివారించబడుతుంది. రాలిపోయిన జుట్టు తిరిగి పెరిగేలా చేస్తుంది.

8. మెంతులు:
మెంతులను నీటిలో నానెబట్టి మెత్తగా పేస్ట్ చేసి తలకు అప్లై చేయాలి. లేదా ఆ నీటిని తలకు అప్లై చేసినా బట్టతల సమస్యను ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు.

9. ఆలివ్ ఆయిల్, తేనె మరియు దాల్చిన చెక్క:
దాల్చిన చెక్క పౌడర్ గా చేసి అందులో ఆలివ్ ఆయిల్ మరియు తేనె మిక్స్ చేసి ఈ పేస్ట్ ను బట్టతల ఏర్పడి ప్రాంతంలో అప్లై చేయాలి.15 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

10. పెప్పర్ మరియు పెరుగు :
పెప్పర్ పౌడర్ ను పెరుగుతో మిక్స్ చేసి తర్వాత తలకు అప్లై చేయాలి. ఇలా వారానికొకసారి అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications