Latest Updates
-
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే
హెయిర్ ను డీప్ గా ...రిచ్ గా.. కనబడేలా చేసే హెయిర్ మాస్క్స్
ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో చాలా మంది గ్రేట్ అండ్ వైట్ హెయిర్ సమస్యతో బాధపడుతున్నారు . వాతావరణ కాలుష్యం, స్ట్రెస్, ప్రొసెస్డ్ మరియు జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడమే ఇందుకు ముఖ్య కారణంగా చెబుతున్నారు.
చిన్న వయస్సులోనే గ్రే హెయిర్ లేదా తెల్ల జుట్టును తక్కువగా ఉన్నప్పుడే గమనించినట్లైతే వెంటనే నేచురల్ రెమెడీస్ తో నివారించుకోవచ్చు. మీరు గ్రే హెయిర్ ను పర్మనెంట్ గా నివారించుకోవాలంటే, హెయిర్ డైస్ ఉపయోగిస్తే సరిపోదు. ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం కలిగించేవి మాత్రమే . హెయిర్ డైస్ లో ఉండే కెమికల్స్ జుట్టును మరింత తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది. మరింత ఎక్కువగా తెల్ల జుట్టుకు మరియు హెయిర్ లాస్ కు కారణం అవుతుంది.
గ్రే హెయిర్ నివారించడానికి అవసరం అయ్యే ఉత్తమ హో రెమెడీస్
ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన హెయిర్ మాస్క్ లు కేశాలకు పోషణను అందివ్వడం మాత్రమే కాదు జుట్టును బలోపేతం చేస్తాయి. అలాగే తెల్లజుట్టును కూడా నివారిస్తాయి . ఈ హెయిర్ మాస్క్ ను హై క్వాలిటీ ఆయిల్స్ మరియు బట్టర్ తో తయారుచేయడం జరిగింది. ఈ నేచురల్ ఆయిల్స్ ను హెయిర్ మాస్క్ మసాజ్ వల్ల గ్రేహెయిర్ నివారించడంతో పాటు జుట్టు రాలడాన్ని అరికడతుంది . హెయిర్ మాస్క్ ను నేచురల్ ఆయిల్ మరియు నేచురల్ పదార్థాలతో పాటు తయారుచేయవచ్చు. ఇవి హెయిర్ కు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
చిన్న వయసులోని తెల్లజుట్టు సమస్యా ? ఇవిగో సింపుల్ టిప్స్
మరి గ్రేహెయిర్ నివారించి..జుట్టు రాలడం అరికట్టే నేచురల్ హెయిర్ మాస్క్ లు ఏంటో ఒకసారి చూద్దాం...

కోకపౌడర్ మరియు తేనె:
షైనీ మరియు డార్క్ హెయిర్ మాస్క్ లు తేనె మరియు కోకపౌడర్ తో ఉపయోగిస్తారు. 1కప్పు పెరుగు, రెండు చెంచాలా కోకపౌడర్ మరియు 2 చెంచాల తేనె మిక్స్ చేయాలి. దీన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత షాంపుతో శుభ్రం చేసుకోవాలి. ఇది జుట్టుకు కండీషనర్ గా మరియు జుట్టు మంచి షైనింగ్ తో మెరుస్తూ సాఫ్ట్ గా ఉంటాయి.

మస్టర్డ్ ఆయిల్ మరియు బ్లాక్ టీ:
ఇది ఒక బెస్ట్ హెయిర్ మాస్క్ రిసి. జుట్టుకు గోరువెచ్చని మస్టర్డ్ ఆియల్ ను అప్లై చేసి సున్నితమైన మసాజ్ ను అందివ్వాలి. తర్వాత రోజు ఉదయం నార్మల్ షాంపుతో తలస్నానం చేసుకోవాలి. చివరగా బ్లాక్ టీని కండీషనర్ గా తలారా పోసుకోవాలి.

నిమ్మరసం:
నిమ్మరసంలో కొబ్బరిన నూనె మిక్స్ చేసి తలకు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం మరియు గ్రేహెయిర్ రెండింటిని నివారిస్తుంది.

క్యారెట్ అండ్ బీట్ రూట్ మాస్క్:
క్యారెట్ మరియు బీట్ రూట్ ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి ఇందులో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అరగంట తర్వాత దీన్ని షాంపుతో తలస్నానం చేయాలి.చివరగా కాఫీ వాటర్ తలరాపోసుకోవడం వల్ల జుట్టకు మంచి కండీషనర్ మరియు కలర్ ఫుల్ గా ఉంటుంది.

ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్:
డార్క్ హెయిర్ మరియు గ్రేహెయిర్ నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. 3 చెంచాల ఆలివ్ ఆయిల్, 1 చెంచా తేనె, ఒక చెంచ బట్టర్ వేసి మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

బ్లాక్ పెప్పర్ హెయిర్ మాస్క్:
బ్లాక్ పెప్పర్ కు కొద్దిగా పెరుగు , నిమ్మరసం జోడించి మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

పెరుగు మరియు కోకబట్టర్ హెయిర్ మాస్క్:
1 కప్పు పెరుగు మరియు 3 చెంచాల కొబ్బరి నూనె, 1/4కప్పు కోకబట్టర్ , 5చుక్కల ల్యావెండర్ ఆయిల్ వేసి మొత్తం మిశ్రామాన్ని మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

బెస్ట్ ఆయిల్స్:
గ్రేహెయిర్ నివారించడానికి బెస్ట్ ఆయిల్స్ కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, బాదం, ఆముదం, రోజ్మెర్రీ ఆయిల్ మరియు జోజోబా ఆయిల్ ను తలకు పట్టించి మసాజ్ చేసుకోవాలి . వీటిని వేడి చేసి తలకు రెగ్యులర్ గా పెట్టుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది. గ్రేహెయిర్ తగ్గి, జుట్టు రాలడం అరికడతుంది.



Click it and Unblock the Notifications











