For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు డ్యామేజ్ అవడానికి మీకు తెలియకుండా చేసే పొరపాట్లు.. !

By Swathi
|

మనందరం మన జుట్టు సంరక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకంటే.. జుట్టు అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయితే ఏ చిన్న సమస్య కనిపించినా.. చాలా బాధపడిపోతాం. జుట్టు రాలినా, డ్రైగా మారినా, డాండ్రఫ్ వంటి సమస్యలు ఎదురైనా.. వెంటనే ఖరీదైన షాంపూలు, కండిషనర్లు వాడి.. జుట్టు డ్యామేజ్ నివారించే ప్రయత్నం చేస్తాం.

జుట్టు ఆరోగ్యానికి కొబ్బరినూనె ? ఆల్మండ్ ఆయిల్ ? ఏది మంచిది ?

కానీ మీకు తెలుసా ? చాలా వరకు జుట్టు సమస్యలు, డ్యామేజ్ కి ప్రధాన కారణం.. మన నిర్లక్ష్యం, కేర్ లెస్ గా ఉండటమే. మనం మన జుట్టు గురించి కేర్ తీసుకుంటున్నామని, జాగ్రత్త వహిస్తున్నామని అనుకుంటాం. కానీ.. కొన్ని విషయాలు జుట్టు డ్యామేజ్ కి కారణమవుతాయి. మరి అలాంటి పొరపాట్లేంటో చూసేద్దామా..

తడి జుట్టుతో నిద్రపోవడం

తడి జుట్టుతో నిద్రపోవడం

రాత్రి నిద్రకు ముందు తలస్నానం చేస్తారు కొంతమంది. ఉదయం ఎక్కువసేపు నిద్రపోవచ్చని రాత్రే తలస్నానం చేసే అలవాటు ఉంటుంది. కానీ.. చల్లగా ఉన్న జుట్టుతో నిద్రపోవడం వల్ల జుట్టు బలహీనమై.. రాలిపోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.

తడి జుట్టు దువ్వడం

తడి జుట్టు దువ్వడం

ఇది చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు. తడి జుట్టుని ఈజీగా దువ్వవచ్చు, చిక్కుతీయడం తేలిక, నొప్పి తక్కువగా ఉంటుందని చాలామంది ఫీలవుతారు. కానీ తడి జుట్టు దువ్వడం వల్ల..కుదుళ్ల నుంచి అవి బలహీనం అయి.. డ్యామేజ్ అవుతాయి.

ఎప్పుడూ జుట్టుని కట్టుకోవడం

ఎప్పుడూ జుట్టుని కట్టుకోవడం

చిరాకు, చెమట వంటి రకరకాల సమస్యలకు దూరంగా ఉండటానికి చాలామంది జుట్టుని ఎప్పుడూ.. పైకి కట్టడమో లేదా జుట్టుకి బ్యాండ్ వేయడమో చేస్తారు. కానీ జుట్టుని పైకి కట్టుకోవడం వల్ల జుట్టు బలహీనమవుతుంది. సమ్మర్ లో అయితే జుట్టులో ఉండే చెమట సరిగా ఆరదు. దీనివల్ల జుట్టు రాలడానికి, చుండ్రు వంటి సమస్యలు ఎదురవుతాయి.

కండిషనర్

కండిషనర్

షాంపూ చేసుకున్న ప్రతిసారి కండిషనర్ చేసుకోవడానికి చాలామందికి బద్ధకంగా ఉంటుంది. షాంపూ ఉపయోగించిన తర్వాత కండిషనర్ వాడకపోతే.. జుట్టు డ్రైగా, రఫ్ గా మారుతుంది. కాబట్టి కండిషనర్ చేయడం నిర్లక్ష్యం చేయకండి.

ప్రతిరోజూ షాంపూ చేయడం

ప్రతిరోజూ షాంపూ చేయడం

ప్రతి రోజూ షాంపూ చేసుకోవడం వల్ల.. జుట్టు న్యాచురల్ ఆయిల్స్ ని కోల్పోతుంది. నార్మల్ లేదా డ్రై హెయిర్ ఉన్నవాళ్లు వారానికి రెండు సార్లు షాంపూ చేస్తే సరిపోతుంది. ఆయిలీ హెయిర్ ఉన్నవాళ్లు వారానికి మూడుసార్లు సరిపోతుంది.

హెయిర్ స్ట్రెయిట్ నర్స్

హెయిర్ స్ట్రెయిట్ నర్స్

చాలామంది హెయిర్ స్ట్రెయిట్నర్స్ ని రోజూ ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువ హీట్ కి జుట్టు ప్రతిరోజూ ఎక్స్ పోజ్ అవడం ఏమాత్రం మంచిది కాదు. అది షైనింగ్ ని కోల్పోయేలా చేస్తుంది.

ప్రొటీన్ ఫుడ్

ప్రొటీన్ ఫుడ్

సరైన పోషకాలు అందకపోతే.. ఫ్యూచర్ లో జుట్టు డ్యామేజ్ అవుతుంది. పోషకాహారం తీసుకోకుండా, ఖర్చుతో కూడిన హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. షైనీ, హెల్తీ జుట్టు పొందాలంటే.. డైలీ డైట్ లో ప్రొటీన్ ఫుడ్ చేర్చుకోవడం చాలా అవసరం.

English summary

Hair Sins That Are Killing Your Hair and You Didn’t Know

Hair Sins That Are Killing Your Hair and You Didn’t Know. We all love our hair a lot and go to great extent to care for it. We get stressed at the slightest signs of hair fall, dryness or frizziness, and stock up on expensive shampoos and conditioners.
Story first published:Wednesday, June 8, 2016, 11:30 [IST]
Desktop Bottom Promotion