For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రు మరియు హెయిర్ ఫాల్ ను తగ్గించే హెన్నా హెయిర్ ప్యాక్స్ ...

|

ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది చుండ్రు మరియు హెయిర్ లాస్ సమస్యలతో బాధపడుతున్నారు. చుండ్రు సమస్య వల్ల తలలో దురద మరియు నలుగురిలో ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల, ఈ సమస్యను ఎప్పటికప్పుడు నివారించుకోవడం ఉత్తమం.

ఈసమస్యను నివారించుకోవడానికి అన్ని రకాల ట్రీట్మెంట్స్ మరియు చిట్కాలు అనుసరించినా ఎలాంటి ఫలితం లేకపోతే, నేచురల్ రెమెడీస్ ను ఉపయోగించి చుండ్రు మరియు జుట్టు రాలడాన్ని నివారించుకోవచ్చు.

జుట్టు రంగు మార్చుకోవడానికి హెన్నాను ఉపయోగిస్తుంటారు. కానీ హెన్నా వల్ల చుండ్రును మరియు హెయిర్ ఫాల్ కూడా నివారించుకోవచ్చన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.

అవును!హెన్నాలో ఉండే నేచురల్ ప్రొపర్టీస్ జుట్టును మరింత షైనింగ్ తో , చుండ్రు నివారించి హెయిర్ ఫాలీ సెల్స్ ను మరింత స్ట్రాంగ్ గా మార్చుతుంది. హెన్నా.. ప్రతి ఒక్కరికి తెలిసిన.. న్యాచురల్ రెమిడీ. ఇది జుట్టు సమస్యలన్నింటితో.. పోరాడే సహజ పరిష్కారం. పొడి జుట్టు, చిట్లిపోయిన జుట్టు, చుండ్రు వంటి రకరకాల జుట్టు సమస్యలతో పోరాడుతుంది హెన్నా. జుట్టు ఆరోగ్యానికి, కుదుళ్ల బలానికి హెన్నా బాగా సహాయపడతుంది.

పురుషు కొరకు 10 ఉత్తమ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్

హెన్నా ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు హెల్తీగా మరియు పూర్తిగా పోషణను అందిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఆస్ట్రిజెంట్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల , హెయిర్ హెయిర్ ప్యాక్ వల్ల తలలోని ఇన్ఫెక్షన్స్ ను క్లియర్ చేస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్స్ జుట్టు చిట్లిపోవడాన్ని అరికడుతుంది.. జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. తరచుగా హెన్నా హెయిర్ ప్యాక్ వాడటం వల్ల జుట్టు మెరుస్తూ.. అందంగా కనిపిస్తుంది.

మీ అన్నిరకాల జుట్టు సమస్యలకు బెస్ట్ హోం రెమడీస్

హెన్నా, హెయిర్ ప్యాక్ ను వారంలో ఒకటి రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టుకు హెన్నా హెయిర్ ప్యాక్ ను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు . మరియు చుండ్రును మరియు హెయిర్ ఫాల్ ను నివారించుకోవడానికి హెన్నాను ఏవిధంగా ఉపయోగించాలో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం...

గుడ్డు, ఆలివ్ ఆయిల్ మరియు హెన్నా:

గుడ్డు, ఆలివ్ ఆయిల్ మరియు హెన్నా:

3 చెంచాలా హెన్నా పౌడర్లో 1చెంచా ఆలివ్ ఆయిల్ మరియు 2 చెంచాలా ఎగ్ వైట్ మిక్స్ చేయాలి. స్మూత్ గా పేస్ట్ చేసి తలకు అప్లై చేయాలి. 30 నిముషాలు అలాగే

ఉంచి తర్వాత మన్నికైన షాంపుతో శుభ్రం చేసుకోవాలి.

హెన్నా, నిమ్మరసం మరియు పెరుగు:

హెన్నా, నిమ్మరసం మరియు పెరుగు:

హెన్నా ను నిమ్మరసం మరియు పెరుగుతో కూడా మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవడం వల్ల హెయిర్ లాస్ ను మరియు చుండ్రును నివారిస్తుంది . నిమ్మరసం మరియు పెరుగు సమయంగా తీసుకొని అందులో 2 చెంచాలా హెన్నా మిక్స్ చేయాలి. దీన్ని తలకు పూర్తిగా పట్టించి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

 హెన్నా, పెరుగు మరియు అరిత:

హెన్నా, పెరుగు మరియు అరిత:

హెన్నా, పెరుగు మరియు అరిత కాంబినేషన్ వండర్ ఫుల్ గా వర్క్ చేస్తుంది. చుండ్రు నివారణకు 3 చెంచాలా హెన్నాలో పెరుగు, అరిత పౌడర్ మిక్స్ చేయాలి. బాగా మిక్స్

చేసి తలకు పూర్తిగా అప్లై చేయాలి. కొద్ది సేపటి వరకూ ఉంచి తర్వాత తలస్నానం చేసుకోవాలి.

హెన్నా, ఆలివ్ ఆయిల్ మరియు పెరుగు:

హెన్నా, ఆలివ్ ఆయిల్ మరియు పెరుగు:

4 చెంచాల హెన్నాలో 1 చెంచా వెనిగర్ మరియు ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. స్మూత్ గా పేస్ట్ చేసి తలకు అప్లై చేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి . ఇది చాలా ఎపెక్టివ్ గా తలను శుభ్రం చేస్తుంది.

ఆవనూనె మరియు హెన్నా ప్యాక్:

ఆవనూనె మరియు హెన్నా ప్యాక్:

ఆవనూనెను హీట్ చేసి అందులో 2 చెంచాలా హెన్నా లీవ్స్ వేసి మరిగించాలి. తర్వాత ఈ నూనెను చల్లార్చి తర్వాత రోజు ఉదయం ఈ నూనెను తలకు పట్టించాలి. కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేసుకోవాలి . ఈ పద్దతిలో చుండ్రును నివారించడంలో చాలా సులభం. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

మెంతులు, వెనిగర్, హెన్నా

మెంతులు, వెనిగర్, హెన్నా

రాత్రంతా మెంతులను నానబెట్టాలి. ఉదయాన్నే మెత్తగా పేస్ట్ చేయాలి. ఒక టేబుల్ స్పూన్ వెనిగర్, 4 టేబుల్ స్పూన్ల హెన్నా, మెంతుల పేస్ట్ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.. గంట తర్వాత మైల్డ్ హెర్బల్ షాంపూతో కడిగేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది. జుట్టు సిల్కీగా, స్ర్టాంగ్ గా మారుతుంది.

 హెన్నా, గ్రీన్ టీ, నిమ్మ

హెన్నా, గ్రీన్ టీ, నిమ్మ

జుట్టుకి గ్రీన్ టీ కండిషనర్ లా పనిచేస్తుంది. గ్రీన్ టీ, హెన్నా, నిమ్మరసం కాంబినేషన్ లో జుట్టుకి ప్యాక్ వసుకోవడం వల్ల జుట్టు సమస్యలు తగ్గిపోయి.. ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాగే జుట్టు స్మూత్ గా తయారై.. చిట్లిపోవడాన్ని అరికడతుంది. 4 టేబుల్ స్పూన్ల హెన్నాని గ్రీన్ టీలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం అందులోకి నిమ్మరసం కలిపి.. తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేసుకోవాలి.

హెన్నా, కరివేపాకు గోరింట ఆకులు,

హెన్నా, కరివేపాకు గోరింట ఆకులు,

కరివేపాకు, మందారం ఆకులు, మెంతుల మిశ్రమం కూడా జుట్టు పెరుగుదలకు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వీటన్నింటిని మిశ్రమంలా తయారు చేసి.. పెరుగు కలిపి తలకు పట్టించాలి. 40 నుంచి 45 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేసుకుంటే.. జుట్టు స్ర్టాంగ్ గా పెరుగుతుంది. న్యాచురల్ లుక్ అందిస్తుంది.

Story first published: Monday, February 8, 2016, 13:08 [IST]
Desktop Bottom Promotion