Latest Updates
-
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే!
ఫోర్ హెడ్ (నుదిటి) బట్టతలను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!
సౌందర్యంతో పాటు కురులకు కాపాడుకోలేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. జుట్టు రాలిపోయి అసౌకర్యంగా..
అందవిహీనంగా కనబడుతారు. కాబట్టి ఉన్న జుట్టు ఊడిపోకుండా, చుండ్రు లేకుండా కురులను ఆరోగ్యంగా
కాపాడుకొన్నట్లైతే అందమైన కేశ సౌందర్యం మీ సొంతమౌతుంది. ముఖ్యంగా ఫోర్ హెడ్(తల నుదిటి బాగంలో చాలా మంది
అతి త్వరగా జుట్టు రాలిపోతుంటుంది. లేదా ఫోర్ హెడ్ దగ్గర కురులు పెరగకుండా అలాగే ఉండిపోయి నుదిటి
బాగం ఎక్కుగా కనబడేలా చేస్తుంది.
అంతే కాదు క్రమంగా అది అలాగే పెరుగుతుంటే, అది కాస్త బట్టతలగా మార్పు చెందుతుంది. అందుకు ప్రధాన
కారణం జీన్స్, న్యూట్రీషియన్ లోపం వల్ల నుదిటి భాగంలో జుట్టు రాలవచ్చు. కాబట్టి జుట్టు రాలిపోకుండా
కాపాడి, జుట్టుపెరిగేలా చేసే కొన్ని హోంమేడ్ హెయిర్ ప్యాక్ లను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే
జుట్టును లాగడం చేయకూడదు, కెమికల్ బేస్డ్ హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించకపోవడం మంచిది. వదులైన హెయిర్
స్టైల్ ను మెయింటైన్ చేయాలి.
కొంతమంది జుట్టు రాలిపోతుందని గాభరా పడి హెయిర్ ట్రీట్మెంట్ లకు అనవసరమైన డబ్బును వృధా చేస్తుంటారు.
అటువంటి అవసరం లేకుండానే సహజపద్దతులను ఉపయోగించి ఇంట్లో కురుల పెరుగుదలకు చక్కటి జాగ్రత్తలు
తీసుకొన్నట్లైతే అందమైన, దట్టమైన మీ కేశ సౌందర్యం మీ సొంతం అవుతుంది. ఆయిల్ మసాజ్ నుండి హెయిర్ ప్యాక్
ల వరకూ జుట్టు పెరుగుదలకు వివిధ మార్గాలను ప్రయత్నించి, నుదిభాగంలో కప్పిఉంచేలా జుట్టును
పెంచుకోవచ్చు.
ఫోర్ హెడ్ లో జుట్టు రాలడం కేవలం స్త్రీలలో పురుషుల్లోనే కాదు, స్త్రీలలో కూడా ఇదే సమస్య ఉంటుంది.
ఫోర్ హెడ్ లో జుట్టు రాలడం, బట్టతల రావడానికి కారణాలు అనేకం. అందులో జెనటిక్స్, సరైన జాగ్రత్తలు
తీసుకోకపోవడం, అలోపిషియా వంటి మెడికల్ కండీషన్ కారణం కావచ్చు. ఇటువంటి పరిస్థితి వెంటనే రాదు, కొన్ని
రోజుల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి, కారణాలు తెలుసుకుని వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్
డైట్ లో లీన్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్స్ , ఐరన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫోర్ హెడ్ బట్టతలను నివారించుకోవచ్చు.వీటితో పాటు కొన్ని హెయిర్ మాస్క్ లు బట్టతలను నివారిస్తాయి. అవేంటో తెలుసుకుందాం..

ఉల్లిపాయ:
ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఉల్లిపాయ కొత్తగా హెయిర్ ఫాలీ సెల్స్ ను రీజనరేట్ చేస్తుంది. ఉల్లిపాయ పొట్టు తీసి, ముక్కలుగా చేసి పేస్ట్ చేసి రసం తియ్యాలి. ఈ రసాన్ని తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నుదటన హెయిర్ లైన్ తగ్గిస్తుంది. ఒక గంట అలాగే ఉండనిచ్చి తర్వాత మంచి షాంపుతో శుభ్రం చేసుకోవాలి.

ఆలివ్ ఆయిల్ :
ఆలివ్ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ , విటమిన్ ఇ ఎక్కువ, ఆలివ్ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకుని అందులో దాల్చిన చెక్క పౌడర్, తేనె మిక్స్ చేయాలి. తక్కువ మంట మీద వేడి చేసి, బట్టతల ఏర్పడే ప్రదేశంలో మసాజ్ చేయాలి. అరగంట తర్వాత స్నానం చేయాలి. ఈ ఆయుర్వేదిక్ రెమెడీ హెయిర్ లైన్ తగ్గిస్తుంది.

బ్లాక్ పెప్పర్:
బ్లాక్ పెప్పర్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, కొత్తగా హెయిర్ ఫాలి సెల్స్ ను పెరిగేలా చేస్తుంది.
కొన్ని మిరియాలను మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, బట్టతలకు అప్లై చేయాలి. డ్రైగా మారే వరకూ వెయిట్ చేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బీట్ రూట్ లీవ్స్ :
బీట్ రూట్ ఆకుల్లో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6 లు అధికంగా ఉన్నాయి. బీట్ రూట్ ఆకులు హెయిర్ రూట్స్ ను బలాన్ని అందిస్తాయి . జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. నీళ్ళలో గుప్పెడు బీట్ రూట్ ఆకులు వేసి మరిగించాలి. ఆకులు మెత్తగా అయిన తర్వాత పేస్ట్ చేయాలి. దీనికి హెన్నా పౌడర్ మిక్స్ చేయాలి . ఈ పేస్ట్ ను తలకు అప్లై చేయాలి. జుట్టు ఊడుతున్న ప్రదేశంలో కొద్దిగా ఎక్కువగా అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత షాంపు మరియు కండీషనర్ తో తలస్నానం చేయాలి.

కొత్తిమీర
కొత్తిమీరలో విటమిన్ సి , ఐరన్, ప్రోటీన్స్ ఎక్కువ, ఇది కోల్పోయిన జుట్టును తిరిగి తీసుకొస్తుంది . కొత్తగా జుట్టు ఏర్పడుటకు సహాయపడుతుంది. కొత్తిమీరను సన్నగా కట్ చేసి, స్మూత్ పేస్ట్ చేయాలి. జుట్టు తడి చేసి తర్వాత దీన్ని జుట్టుకు అప్లై చేయాలి. దీన్ని తలకు పట్టించి 5 నిముషాలు మసాజ్ చేయాలి. ఈ హెర్బల్ మాస్క్ అరగంట పాటు తలలో అరగంట పాటు ఉండాలి. తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

కర్పూరం
ఇది తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది. జుట్టుకు ఫాస్ట్ గా పెరగడానికి సహాయపడుతుంది. ఒక టీస్పూన్ కర్పూరం తీసుకుని , అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా నూనె మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

ఆకు కూరల రసంతో
మెంతి వంటి ఆకుకూరల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి, ఇది జుట్టుకు చాలా అవసరం. ఇది హెయిర్ రూట్స్ ను టైట్ గా మార్చుతుంది. ఆకు కూరలను మిక్సీలో వేసి పేస్ట్ చేసి, కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి, రసం తియ్యాలి. అందులో కాటన్ బాల్ డిప్ చేసి, దీన్ని తడి జుట్టుకు అప్లై చేసి, 10 నిముషాలు మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత అరగంట పాటు అలాగే ఉండనిచ్చి తర్వాత తలస్నానం చేయాలి. ఈ చిట్కాను వారానికొకసారి ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది.

పొట్లాకాయ
పొట్టకాయలో నేచురల్ యాంటీ బయోటిక్స్ ఉంటాయి, ఇది తలలో ప్యాచినెస్ ను నివారిస్తుంది. ఇది హెయిర్ ఫాలీసెల్స్ గ్రోత్ ను క్రమబద్దం చేస్తుంది.
పొట్లాకాయను జ్యూస్ గా తయారుచేసి, జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. ఎక్కడైతే జుట్టు ఎక్కువ రాలుతుందో అక్కడ కొద్దిగా ఎక్కువ రాయాలి. రాత్రి నిద్రించే మందు రాస్తే మరింత ఎఫెక్టినెస్ ఉంటుంది. ఉదయం నిద్రలేచి తలస్నానం చేయాలి.

కరివేపాకు
కరివేపాకులో అమినో యాసిడ్స్ అధికంగా ఉన్నాయి, కరివేపాకు జుట్టు రాలడం తగ్గిస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు డార్క్ గా మారేలా చేస్తుంది. ఎండలో కరివేపాకును ఎండ బెట్టాలి. దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ లో ఆముదం మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను తలకు పట్టించాలి. జుట్టు ఊడుతున్న ప్రదేశంలో కొద్దిగా ఎక్కువ అప్లై చేయాలి. ఒక గంట తర్వాత మైల్డ్ షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

జీలకర్ర
జీలకర్రలో 100న్యూట్రీషియన్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు చాలా అవసరం. బట్టతల, నుదిటి బాగంలో జుట్టు రీగ్రోత్ అవ్వడం క్రమంగా మీరు గమనిస్తారు. ఒక టీస్పూన్ జీలకర్రను ఒక కప్పు ఆలివ్ ఆయిల్లో మిక్స్ చేసి , రాత్రంతా అలాగే ఉండనివ్వాలి. ఉదయం ఈ నూనెతో మసాజ్ చేయాలి. 2 గంటల తర్వాత తలస్నానం చేయాలి.



Click it and Unblock the Notifications











