For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్లో కేశ సంరక్షణకు హోంమేడ్ హెయిర్ ప్యాక్స్..

|

వేసవి కాలంలో శరీరాన్ని మాత్రమే కాదు కేశాలను కూడా కూల్ ఉంచుకోవడం ఎంతైనా అవసరం. వేసవి కాలం మొదలైందంటే చాలు శరీరంలోని నీరంత ఇంకిపోవతుంది. దాంతో శరీరం పొడిబారుతుంది. రాషెష్ ఏర్పడుతాయి. చిరాకు కలిగిస్తాయి. ఒక్క శరీరానికి మాత్రమే కాదు..కేశాలకు కూడా వేసవి కాలంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతాయి. కాబట్టి మిగిలిన సీజన్ల కంటే ఈ వేసవి సీజన్ లో మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవడం కొంచం కష్టమైన పనే. అంతే కాదు మీరు వేసవి కాలంలో కేశ సంరక్షణకు తీసుకొనే కొన్ని జాగ్రత్తల్లో కరెక్టైన టెక్నిక్స్ తెలుసుకొని ఉండాలి. అప్పుడు కేశాలతో పాటు మీ స్లాప్ ను కూడా శుభ్రంగా..వేసవిలో చల్లగా ఉంచుకోగలుగుతారు.

శరీరం కూల్ గా ఉంచుకోవడానికి సీజన్ బట్టి పండ్లు కూరగాయలు, డ్రింక్స్ ఇలా ఎన్నో మార్పులు చేసుకుంటాం. అయితే కేశ సంరక్షణలో కూడా సరైన ఆహారపు అలవాట్లతో పాటు చల్లని హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం చాలా అవసరం. ఈ సమ్మర్ హెయిర్ ప్యాక్స్ ను తలకు వాడటం వల్ల మీ తల మాడును వేడి నుండి రక్షించి కూల్ గా ఉంచుతుంది. అందుకు కొన్ని హెయిర్ ప్యాక్స్ రిసిపిలున్నాయి. ఇవి సమ్మర్ హీట్ తో పోరాడుతాయి. మరి మీరో ఈ హెయిర్ ప్యాక్స్ ను ఉపయోగించి మీ తలను కూల్ కూల్ గా ఉంచుకోండి...

తేనె, గుడ్డు మరియు ఆలివ్ ఆయిల్:

తేనె, గుడ్డు మరియు ఆలివ్ ఆయిల్:

ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గుడ్డు పగులగొట్టి పసుపుగా ఉన్న సొన మాత్రమే వేయాలి . తర్వాత దానికి 2చెంచాల తేనె మరియు 2 చెంచాల ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తూ గిలకొట్టాలి. ఇప్పుడు ఈ సమ్మర్ హెయిర్ ప్యా క్ కు తలకు బాగా పట్టించి పది నిముషాలు అలాగే ఉంచేయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ మీ తలకు చల్లదన్నాన్ని ఇవ్వడంతో పాటు కేశాలు మెరిసేలా చేస్తాయి.

కొబ్బరి నూనె మరియు రెడ్ వైన్:

కొబ్బరి నూనె మరియు రెడ్ వైన్:

కొబ్బరి నూనె మరియు రెడ్ వైన్ రెండూ సమానంగా తీసుకొని బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఈ సమ్మర్ హెయిర్ ప్యాక్ చిక్కగా లేకపోయినా తలకు పట్టించడం వల్ల కారిపోతుంది. కాబట్టి ఒకటికి రెండు సార్లు హెయిర్ కు ప్యాక్ వేసి షవర్ క్యాప్ ను ధరించాలి . పది నిముషాల తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ వల్ల మీ తల చాలా కూల్ గా విశ్రాంతి పొందుతుంది.

పెరుగు మరియు నిమ్మరసం:

పెరుగు మరియు నిమ్మరసం:

వేసవిలో చాలా తరచుగా ఉపయోగించే హెయిర్ ప్యాక్ ఇది. వేసవిలో సరైన హెయిర్ కేర్ తీసుకోవాలనుకొనే వారి కోసం రెండు విషయాలు చాలా ముఖ్యం. ఒకటి కూలింగ్ రెండు మాయిశ్చరైజింగ్. పెరుగు మరియు నిమ్మరసం రెండింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి తలకు, కేశాల చివరి వరకూ బాగా పట్టించాలి. పది నిముషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో మీకేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎటువంటి చుండ్రు మరియు దురద సమస్యలుండవు మరియు స్లాప్ కు తగినంత హైడ్రేషన్ కలిగిస్తుంది.

కీర దోస మరియు సోర్ క్రీమ్:

కీర దోస మరియు సోర్ క్రీమ్:

వేసవి కాలంలో మీ చర్మాన్ని కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగిస్తారు. మరి కేశాల సంగతేంటి?మీ కేశాలు సూర్యరశ్మికి గురైతే వివిధ రకాల జుట్టు సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి వేసవిలో కేశ సంరక్షణ కోసం కీరదోసకాయను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. తర్వాత అందులో సోర్ క్రీమ్ వేసిబాగా మిక్స్ చేసి తలకు పట్టించి శుభ్రం చేసుకోవాలి. ఈ స్మూత్ సమ్మర్ కూల్ హెయిర్ ప్యాక్స్ చాలా ఉపయోగకరం మరియు ఆరోగ్యకరం మీరూ ఒకసారి ప్రయత్నించి చూడండి.

 షీకాకాయ, ఉసిరికాయ, పెరుగు మరియు సోప్ నట్

షీకాకాయ, ఉసిరికాయ, పెరుగు మరియు సోప్ నట్

షీకాకాయలో జుట్టుని స్మూత్‌గా మార్చే సత్తా ఉంది. షీకాకాయ, ఉసిరికాయ, పెరుగు మరియు సోప్ నట్ అన్నింటిని కలిపి జుట్టుకి ప్యాక్‌లా వేసుకుంటే చాలా చల్లటి అనుభూతి కలుగుతుంది. సమ్మర్‌లో ఈ ప్యాక్ మంచి ఫలితాన్నిస్తుంది. తలనొప్పి తగ్గించి, రిలాక్సేషన్ ఇస్తుంది.

 గ్రీన్ టీ

గ్రీన్ టీ

గోరువెచ్చని గ్రీన్ టీని మాడుకు, శిరోజాలకు పట్టించి ఆరనివ్వాలి. తర్వాత నీళ్లతో తలంతా శుభ్రపరుచుకోవాలి. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, కండిషనర్ ఎండ వల్ల కలిగే హానిని నివారించి, జుట్టు ఊడటాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ టీలోని పోషకాలు శిరోజాలను పెంచడానికి దోహదం చేస్తాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

మూడు కప్పుల మంటినీటిలో రెండు కప్పుల ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి... ఈ మిశ్రమాన్ని తలస్నానం పూర్తయ్యాక చివరగా జుట్టుకు పట్టించాలి. చుండ్రు సమస్య ఉన్నవారయితే... ఈ మిశ్రమాన్ని జట్టుకే కాకుండా, జుట్టు కుదుళ్లకు కూడా బాగా పట్టించాలి. ఇలా చేసినట్లయితే జట్టుకు మంచి కండీషనింగ్ లభించటమేగాకుండా, చుండ్రు నుంచి దూరం కావచ్చు.

క్యారెట్ లీవ్స్:

క్యారెట్ లీవ్స్:

క్యారెట్‌ వేసవిలో జుట్టు సంరక్షణకు చాలా దోహదపడుతుంది. వేసవిలో జుట్టు ఎండిపోయి చివరలు చీలుతుంటాయి. క్యారెట్‌ ఆకులు అటువంటి జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తాయి. ఆరు క్యారెట్‌ ఆకులకు ఒక టీ స్పూన్‌ నువ్వుల నూనె చేర్చి మిక్సీలో ముద్ద చేయాలి. ఈ నూనెను తలకు రాసుకుని పదినిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నిగారింపుగా పెరుగుతుంది.

English summary

Homemade Hair Packs For Summer Season

Our hair drives through a lot of misuses due to present unnatural lifestyle. Sometimes we use dryers, styling, straighteners and chemical treatments for hairs like coloring all the life leaving hairs all rough, dry, dull and lifeless. To give improvement to hair’s health and fill some of the lost life in them, homemade and natural hair packs are an excessive solution.
Story first published: Saturday, April 2, 2016, 16:32 [IST]
Desktop Bottom Promotion