For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అబ్బాయిలు వాళ్ల జుట్టు తత్వాని బట్టి ఎలాంటి షాంపూ ఎంచుకోవాలి ?

By Swathi
|

హ్యాండ్నమ్ గా ఉండే హీరోలయినా, స్పోర్ట్స్ స్టార్స్ అయినా.. వాళ్ల జుట్టు విషయంలో చాలా కేర్ చేసుకుంటారు. సినీస్టార్స్, క్రికెట్ స్టార్స్ ఎవరైనా సరే.. తమకు అందుబాటులో ఉన్న వస్తువుల ద్వారానే.. జుట్టు అందాన్ని కాపాడుకుంటారు. షైనీగా, హెల్తీగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకుంటారు.

ముందుగా మీ జుట్టు ఎలాంటిదో తెలుసుకోవాలి ? ఆ తర్వాతే జుట్టుకి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి హెయిర్ జెల్, షాంపూ మీ జుట్టు తత్వానికి సరిపోతుందని చెప్పలేం. కాబట్టి.. మీ జుట్టుని బట్టి హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం చాలా అవసరం. అప్పుడే.. మీ జుట్టు ఎల్లప్పుడూ హెల్తీగా ఉంటుంది. అయితే.. ఇప్పుడు మీ జుట్టుని బట్టి.. ఎలాంటి షాంపూ వాడాలో ఇప్పుడు చూద్దాం..

ఆయిలీ హెయిర్

ఆయిలీ హెయిర్

ఒకవేళ అబ్బాయిలకు ఆయిలీ హెయిర్ ఉంటే చాలా కష్టం. ఇలాంటప్పుడు కండిషనర్ ఉండే షాంపూలను వాడకూడదు. ఇవి జుట్టుకి మాయిశ్చరైజర్ అందించి.. మరింత అతుక్కుపోయేలా చేస్తాయి. చాలా ఆయిల్ కంట్రోల్ షాంపూలు.. ఒకటి లేదా రెండ్రోజులు మాత్రమే పనిచేస్తాయి.

షాంపూ

షాంపూ

కాబట్టి.. ఆయిల్ ప్రొడక్షన్ ని బ్యాలెన్స్ చేసి.. స్కాల్ప్ ని డ్రైగా ఉంచే షాంపూ ఎంచుకోవాలి. ఒకవేళ అబ్బాయిలు ఆయిల్ హెయిర్ తో బాధపడుతుంటే.. ప్రొటీన్ షాంపూ, లైవ్లీ షాంపూలు ఉపయోగించడం మంచిది.

కర్లీ హెయిర్

కర్లీ హెయిర్

జుట్టుకి మాయిశ్చరైజ్ అందించే షాంపూ ఎంచుకోవాలి. షీబట్టర్, నట్ ఆయిల్స్ ఎక్కువగా ఉన్న షాంపూలు కర్లీ హెయిర్ ఉన్న అబ్బాయిలకు మంచి పరిష్కారం. లేదా హై ప్రొటీన్, ఆల్మండ్ ఆయిల్ ఉన్న షాంపూలు కూడా ఎంచుకోవచ్చు.

డ్రై హెయిర్

డ్రై హెయిర్

ఒకవేళ మీకు డ్రై హెయిర్ ఉంటే.. అది డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి హై మాయిశ్చరైజర్ ఉండే షాంపూలు లేదా ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె ఉండే ఆయిల్ ఉపయోగించాలి. ఇవి డ్రైనెస్ తో పోరాడతాయి. అలాగే సల్ఫేట్ ఉండే షాంపూలు వాడినా.. జుట్టు పొడిబారకుండా అరికడతాయి.

కలర్ హెయిర్

కలర్ హెయిర్

హెయిర్ కలర్ వల్ల జుట్టు డ్యామేజ్ అయి ఉంటే.. అలాంటి అబ్బాయిలు.. క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ ఉండే షాంపూలు ఎంచుకోవాలి. అవి మీ జుట్టుని స్మూత్ గా మారుస్తాయి. అలాగే సల్ఫేట్ ఫ్రీ షాంపూలను కూడా వాడవచ్చు.

పలుచటి హెయిర్

పలుచటి హెయిర్

ఒకవేళ పలుచటి హెయిర్ కలిగి ఉంటే.. వాల్యుమినైజింగ్ ఫార్ములా ఉండే.. షాంపూలను ఎంచుకోవాలి. లెమన్ గ్రాస్, రోజ్ మేరీ, లావెండర్ ఆయిల్ వంటివి ఉన్న షాంపూలు ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

English summary

How to Choose a Men's Shampoo: The Best Shampoo for Your Hair Type

How to Choose a Men's Shampoo: The Best Shampoo for Your Hair Type. The first thing is to know what your hair type is, and then go about getting the right arsenal for it.
Story first published:Wednesday, August 3, 2016, 17:29 [IST]
Desktop Bottom Promotion