Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
చిట్లిపోయిన జుట్టుకి చీప్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్
జుట్టు చివర్ల చిట్లిపోతే..చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. జుట్టు చాలా పొడవుగా ఉన్నా చివర్లు చిట్లిపోయి ఉంటే.. ఆ జుట్టు అందవిహీనంగా ఉంటుంది. అలాగే పొట్టి జుట్టు ఉన్నా..చివర్లు పొరలుపొరలుగా చిట్లిపోతే.. ఏ మాత్రం అందంగా ఉండదు. కాబట్టి సాధారణంగా చివర్లను కట్ చేస్తూ ఉంటాం. మళ్లీ కొన్ని రోజులకే చిట్లిపోతూ ఉంటాయి. లేదా పార్లర్ లో స్ల్పిట్ ఎండ్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఇలా కాకుండా.. న్యాచురల్ క్యూర్ లేదా ? అని ఆలోచిస్తున్నారా.. ఎందుకు లేదు.. కాస్త ఓపిగ్గా ట్రై చేస్తే.. కట్ చేయకుండా, పార్లర్ కి వెళ్లకుండా జుట్టు చివర్లు చిట్లిపోవడానికి నివారించవచ్చు.
మ్యాజిక్..!! ఊడిపోయిన జుట్టు పొందడానికి టెస్టెడ్ టెక్నిక్స్

మసాజ్
తలకు, మాడుగా బాగా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి.. జుట్టు మెరుస్తూ, బలంగా ఉండటమే కాదు, జుట్టు చివర్ల చిట్లిపోవడాన్ని అరికడుతుంది. కొబ్బరినూనె, ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ని సమానంగా తీసుకోవాలి. మూడింటిని కలిపి.. తలకు పట్టించుకోవడానికి ముందు గోరువెచ్చగా చేయాలి. తర్వాత తల మాడుకి బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల చివర్లు చిట్లిపోవడాన్ని అరికట్టవచ్చు.

హెయిర్ ప్యాక్
ఒక అరటిపండుని బాగా పేస్ట్ చేయాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా రోజ్ వాటర్, కొంచెం నిమ్మరసం కలపాలి. ఈ ప్యాక్ ని తలకు మొదల్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితాలుంటాయి.
జుట్టురాలడం తగ్గించి, వేగంగా జుట్టు పెంచు ఉత్తమ హోం రెమెడీలు

ఎగ్ ప్యాక్
మరో హోం మేడ్ హెయిర్ ప్యాక్ ద్వారా మీ జుట్టు చివర్లు చిట్లడాన్ని న్యాచురల్ గా అరికట్టవచ్చు. ఒక కోడిగుడ్డు తీసుకుని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ తేనె, అరకప్పు పాలు కలపాలి. ఈ ప్యాక్ ని తలకు మొదళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. చివర్లు చిట్లిపోవడాన్ని అరికట్టవచ్చు.
జుట్టు రాలే సమస్యలకు త్వరిత పరిష్కార మార్గం:ఎఫెక్టివ్ యోగాసనాలు
జుట్టు చిట్లి పోకుండా జాగ్రత్తలు
జుట్టు చివర్లు చిట్లిపోవడానికి మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా కారణమే. జుట్టుని టవర్ తో ఎక్కువగా రుద్ద కూడదు. తడి జుట్టుని దువ్వకూడదు. చిక్కు తీయడానికి పెద్ద పళ్లు ఉన్న దువ్వెన ఉపయోగించాలి. అలాగే జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రొటీన్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్, విటమిన్ ఏ, సి, సెలీనియం వంటివి ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఈ చిన్న చిట్కాలు మీ జుట్టు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.



Click it and Unblock the Notifications