For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుకి ఆయిల్ రాత్రంతా ఉండాలా ? గంటసేపు సరిపోతుందా ?

జుట్టుకి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఎంతసేపు పెట్టుకోవాలి ? రాత్రంతా లేదా గంట సేపా ? ఎంత ఎక్కువ సేపు జుట్టుకి ఆయిల్ ఉంటే.. అంత మంచిదని చాలా కాలం నుంచి ఒక నమ్మకం ఉంది. ఇది నిజమేనా ?

By Swathi
|

జుట్టుకి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఎంతసేపు పెట్టుకోవాలి ? రాత్రంతా లేదా గంట సేపా ? ఎంత ఎక్కువ సేపు జుట్టుకి ఆయిల్ ఉంటే.. అంత మంచిదని చాలా కాలం నుంచి ఒక నమ్మకం ఉంది. ఇది నిజమేనా ? రాత్రంతా ఉంటే జుట్టు హెల్తీగా మారుతుందా ?

hair oil

జుట్టుకి ఆయిల్ అవసరమే కానీ.. ఎక్కువ మొత్తంలో ఆయిల్ పట్టించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అంటున్నారు బ్యూటీ ఎక్స్ పర్ట్స్. కాకపోతే ఆయిల్ ని జుట్టు కుదుళ్ల వరకు చేరేలా మసాజ్ చేయాలి. స్కాల్ప్ ని బాగా మర్దనా చేయడం అవసరం.

మీ జుట్టు తత్వాన్ని బట్టి జుట్టుకి ఆయిల్ పట్టించే విధానం ఉంటుంది. ఒకవేళ మీ జుట్టు పోషణతో నిండి ఉంటే.. స్కాల్ప్ లో పీహెచ్ బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి గంటసేపు ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ జుట్టు డ్యామేజ్ అయి, డ్రైగా మారి ఉంటే.. మీరు రాత్రంతా ఆయిల్ పెట్టుకోవాలి.

ఒకవేళ మీరు జుట్టుకి ఎక్కువ ఆయిల్ రాసుకుంటే.. దాన్ని వదిలించడానికి ఎక్కువ షాంపూ ఉపయోగించాలి. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అలాగే జుట్టు కూడా డ్రైగా మారుతుంది. కాబట్టి వారానికి ఒకసారి లేదా రెండు సార్లు ఆయిల్ పెట్టుకుంటే చాలు. అలాగే ఆయిల్ పెట్టుకున్న తర్వాత గంటసేపటికి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ని జుట్టుకి సరైన పద్ధతిలో ఎలా పెట్టుకోవాలో చూద్దాం..

స్టెప్ 1

స్టెప్ 1

వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెన తీసుకుని ముందుగా జుట్టుని చిక్కులు లేకుండా.. దువ్వుకోవాలి.

స్టెప్ 2

స్టెప్ 2

మీకు నచ్చిన హెయిర్ ఆయిల్ తీసుకుని.. 2 నిమిషాలు సన్నని మంటపై వేడి చేయాలి. రూం టెంపరేచర్ లో చల్లారనివ్వాలి.

స్టెప్ 3

స్టెప్ 3

ఆయిల్ ని డైరెక్ట్ గా స్కాల్ప్ పై పోయకూడదు. ఇది జుట్టుని మరింత జిడ్డుగా మార్చి ఎక్కువ షాంపూ ఉపయోగించేలా చేస్తుంది.

స్టెప్ 4

స్టెప్ 4

జుట్టుని చిన్న చిన్న పాయలుగా విడదీసుకోవాలి. గోరువెచ్చని ఆయిల్ లో వేళ్లను ముంచి తీసి.. జుట్టుకి పట్టించాలి.

స్టెప్ 5

స్టెప్ 5

ఆయిల్ ని అరచేతితో రుద్దకూడదు. ఇలా చేస్తే జుట్టు చిట్లిపోతుంది. కాబట్టి.. జుట్టుని వేళ్లతో.. గుండ్రంగా మసాజ్ చేయాలి. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇలా 10 నుంచి 15 నిమిషాలు చేయాలి.

స్టెప్ 6

స్టెప్ 6

జుట్టుకి ఆయిల్ బాగా పట్టాలి అంటే.. స్కాల్ప్ కి స్టీమ్ పెట్టాలి. దానికి పలుచటి టవల్ ని వేడినీటిలో ముంచి.. నీటిని పిండేసి.. తలకు చుట్టుకోవాలి.

స్టెప్ 7

స్టెప్ 7

జుట్టుకి ఆయిల్ మరీ ఎక్కువ సమయం ఉండకూదు. దీనివల్ల ఎక్కువ దుమ్ముని ఎట్రాక్ట్ చేస్తుంది. చుండ్రుకి కారణమవుతుంది. కాబట్టి జుట్టుకి ఆయిల్ ని 12గంటల కంటే ఎక్కువ సమయం పెట్టుకోకూడదు.

English summary

How Long Should You Leave Hair Oil On?

How Long Should You Leave Hair Oil On? Overnight or an hour? How long should you actually leave the hair oil on? Take a look here to find out more.
Story first published: Thursday, November 3, 2016, 16:16 [IST]
Desktop Bottom Promotion