For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న్యాచురల్ బ్లాక్ హెయిర్ కలర్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి ?

By Swathi
|

జుట్టుకి రంగు వేసుకోవడానికి కెమికల్స్ ఉపయోగిస్తారా ? వీటి ద్వారా వెంటనే ఫలితాన్ని పొందినప్పటికీ.. మీ జుట్టుని మరింత ఎక్కువగా డ్రై అవడానికి, డల్ గా మారడానికి కారణమవుతాయి. కానీ ఆ ఫలితం కూడా ఎక్కువ కాలం ఉండదు. అవి మీ జుట్టు రాలడానికి, జుట్టు సంబంధిత సమస్యలు రావడానికి కారణమవుతాయి.

కెమికల్స్ డై కారణంగా.. స్కాల్ప్ కి కూడా మంచిది కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కి దూరంగా ఉండాలంటే.. న్యాచురల్ పద్ధతులు పాటించండి. జుట్టుకి న్యాచురల్ కలర్ అందించే హోం రెమిడీస్ చాలానే ఉన్నాయి. కాకపోతే.. కాస్త ఓపిగ్గా ప్రయత్నిస్తే.. హెల్తీగా, న్యాచురల్ హెయిర్ కలర్ చేసుకోవచ్చు.

ఇంట్లోనే హెయిర్ కలర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు.. జుట్టుకి న్యాచురల్ షైనింగ్ తోపాటు, జుట్టుని హెల్తీగా, న్యాచురల్ కలర్ ని అందిస్తాయి. మరి ఈ హోం మేడ్ హెయిర్ కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకుని, వాడాలో ఇప్పుడు చూద్దాం..

బ్లాక్ కాఫీ

బ్లాక్ కాఫీ

బ్లాక్ కాఫీ పౌడర్ ని నీటిలో కలిపి ఉడికించాలి. బాగా స్ట్రాంగ్ గా తయారయిన తర్వాత చల్లార్చాలి. ఇప్పుడు జుట్టుని శుభ్రపరుచుకుని, ఈ కాఫీ డికాషన్ ని పట్టించాలి. తర్వాత షవర్ క్యాప్ తో కవర్ చేసుకుని అరగంట ఉండాలి. ఇలా.. వారానికి రెండు సార్లు చేస్తే.. వేగంగా జుట్టు నల్లబడుతుంది.

హెన్నా డై

హెన్నా డై

పాతకాలం నుంచి ఉపయోగిస్తున్న ఈ పద్ధతి ద్వారా జుట్టుని నల్లగా మార్చుకుంటున్నారు. కలర్ ఫుల్ వర్షన్స్ లో హెన్నా అందుబాటులో ఉంటుంది. బర్గండీ, వుడ్ బ్రౌన్ కలర్ లో ఇవి ఉంటాయి. కానీ.. కలర్ లెస్ వర్షన్ లో కూడా.. హెన్నా అందుబాటులో ఉంటుంది. ఇది.. జుట్టుకి కండిషనింగ్ అందిస్తుంది. అలాగే జుట్టుకి మాయిశ్చరైజర్ ని కూడా అందిస్తుంది.

మందారం పువ్వు డై

మందారం పువ్వు డై

న్యాచురల్ బ్లాక్ హెయిర్ డై తయారు చేసుకునే న్యాచురల్ పద్ధతుల్లో ఇది ఒక ఎఫెక్టివ్ రెమిడీ. మందారం పువ్వుల రెక్కలు తీసి.. మరుగుతున్న నీటిలో వేయాలి. తర్వాత వడకట్టి.. చల్లార్చాలి. ఇప్పుడు.. దీన్ని జుట్టుకి మసాజ్ చేయాలి. ఇది జుట్టుకి న్యాచురల్ కలర్ ని తీసుకొస్తుంది. అలాగే జుట్టుకి, మాడుకు పోషకాలను అందిస్తుంది.

బ్లాక్ టీ సొల్యూషన్

బ్లాక్ టీ సొల్యూషన్

న్యాచురల్ గా జుట్టుకి బ్లాక్ డై వేసుకోవడానికి ఇది చాలా ఎఫెక్టివ్ టిప్. బ్లాక్ టీ తీసుకుని ఉడికించాలి. అది నల్లగా మారేంతవరకు ఉడికించాలి. ఇప్పుడు జుట్టుని పోర్షన్లుగా విడదీసి.. జుట్టుకి పట్టించాలి. దాన్ని వాష్ చేసుకోకుండా.. జుట్టు నల్లగా అయ్యేంతవరకు.. తరచుగా అప్లై చేస్తూ ఉండాలి.

రబ్బర్ వేరు

రబ్బర్ వేరు

రబ్బరు కాండాన్ని నీటిలో ఉడికించి.. వడకట్టాలి. రాత్రంతా చల్లారిన తర్వాత మరుసటి రోజు జుట్టుని ఆ నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే.. జుట్టు న్యాచురల్ బ్లాక్ కలర్ ని పొందుతుంది.

రెడ్ షేడ్ పొందడానికి

రెడ్ షేడ్ పొందడానికి

జుట్టుకి రెడ్ కలర్ తీసుకురావడానికి ఇంట్లోనే ప్యాక్ ప్రయత్నించవచ్చు. బీట్ రూట్, క్యారట్ రెండింటినీ మిక్స్ చేసి రసం తీసి.. జుట్టుకి పట్టించడం వల్ల రెడ్ షేడ్ పొందవచ్చు. ఈ రసాన్ని జుట్టు మొత్తానికి పట్టించి.. షవర్ క్యాప్ వేసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

English summary

How To Make Natural Black Hair Dye At Home?

How To Make Natural Black Hair Dye At Home? Do you use chemicals to dye your hair? They only make your hair more dry and dull.
Story first published: Saturday, July 23, 2016, 13:34 [IST]
Desktop Bottom Promotion