For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యూటిఫుల్ గా ఉండే లాంగ్ అండ్ షైనీ హెయిర్ పొందాలనుకుంటున్నారా?

|

పొడవాటి జుట్టు , ఒత్తైన జుట్టు ఉండటం మహిళ బ్యూటిని మరింత అదనంగా చూపుతుంది,. అలాంటి హెయిర్ కలిగి ఉండటాన్ని ఎంత మంది కోరుకోరూ..? ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ మద్యకాలంలో లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, పొల్యూషన్, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలా మంది హెయిర్ ఫాల్, జుట్టు పల్చబడటం, తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. .

ఈ సమస్యను నివారించుకోవాలంటే, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, జుట్టు పోషణకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, హీటింగ్ టూల్స్, కెమికల్ హెయిర్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండటం వల్ల తిరిగి పునర్వైభవాన్ని తీసుకురావచ్చు. జుట్టు పొడవుగా అందంగా పెరిగేలా చేసుకోవచ్చు.

అంతే కాదు, జుట్టు పెరుగుదలకు రసాయనిక ఉత్పత్తుల కన్నా, నేచురల్ హోం రెమెడీస్ చాలా ఉత్తమమైనవి. నేచురల్ హోం రెమెడీస్, హెయిర్ నేచురల్ గా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు రాలడం, బ్రేకేజ్ వంటి సమస్యలను నివారిస్తుంది.

జుట్టు రాలే సమస్యలను నివారించడంతో పాటు, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే కొన్ని ఎఫెక్టివ్ హోం మేడ్ హెయిర్ మాస్క్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇవి పొడవైన జుట్టును అందిస్తాయి.

ప్రయోగాత్మకంగా ఉపయోగించి, టెస్ట్ చేసిన హెయిర్ మాస్క్ జుట్టు ఆరోగ్యం మరియు అందానికి మెరుగుపరచడంలో గ్రేట్ గా నిరూపించుకున్నాయి, ముఖ్యంగా ఈ హోం రెమెడీస్ 100శాతం సురక్షితమైనవి మరియు చాలా ఎఫెక్టివ్ రెమెడీస్ ..

ఈ హోంరెమెడీస్ ను జుట్టుకు అప్లై చేయడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం వల్ల తర్వాత జుట్టుకు అప్లై చేయడం వల్ల ఎలాంటి సమస్యలుండవు.

గుడ్డులోని పచ్చసొన మరియు గ్రీన్ టీ:

గుడ్డులోని పచ్చసొన మరియు గ్రీన్ టీ:

ఒక గుడ్డులోని పచ్చసొన మరియు రెండు చెంచాల గ్రీన్ టీ మిక్స్ చేసి తలలో జుట్టు మొదల్ల నుండి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. మీకు కనుక డ్రై హెయిర్ ఉన్నట్లైతే దీనికి ఎగ్ వైట్ ను ఉపయోగించుకోవాలి . ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరి పాలు -తేనెతో మాస్క్ :

కొబ్బరి పాలు -తేనెతో మాస్క్ :

ఒక టేబుల్ స్పూన్ తేనె ను అరకప్పు పాలలో మిక్స్ చేసి బాగా బ్లెడ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి . తలకు పట్టించి 20 నిముషాల తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి. ఈ హెయిర్ మాస్క్ వల్ల చిక్కుత తక్కువగా ఉంటుంది . మరియు జుట్టుకు షైనింగ్ ను అధికంగా ఇస్తుంది.

గుడ్డు, నిమ్మ మరియు పెరుగు:

గుడ్డు, నిమ్మ మరియు పెరుగు:

ఇది ప్రోటీన్ రిచ్ హెయిర్ మాస్క్ . దీని వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది . నిమ్మరసం చుండ్రును నివారిస్తుంది . గుడ్డు మీ జుట్టుకు అవసరం అయ్యేషైనింగ్ ను అందిస్తుంది . పెరుగు జుట్టుకు అవసరంఅయ్యే తేమను అందిస్తుంది. ఈ హెయిర్ మాస్క్ ను 15రోజులకొక్కసారి ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

కరివేపాకు మరియు కొబ్బరి నూనె:

కరివేపాకు మరియు కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో ఫ్రెష్ గా ఉండే కరివేపాకు వేసి మరిగించి, చల్లారిన తర్వాత మీ తలకు పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఉల్లిపాయ మరియు ఆలమ్ మాస్క్:

ఉల్లిపాయ మరియు ఆలమ్ మాస్క్:

ఆనియన్ మిక్సీలో వేసి మొత్తగా చేసి, జ్యూస్ పిండుకోవాలి. దానికి కొద్దిగా ఆలమ్ ను మిక్స్ చేసి తకలు మరియు కేశాలకు పట్టించాలి.వారంలో రెండు సార్లు రాత్రుత్లో మాస్క్ ను వేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

నిమ్మరసం మరియు కొబ్బరి నూనె

నిమ్మరసం మరియు కొబ్బరి నూనె

కొబ్బరి నూనెకు కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 10 నిముషాలు మసాజ్ చేయాలి . దీన్ని రెండు మూడు గంటలు అలాగే వదిలేసి, తర్వాత షాంపు, కండీషనర్ ఉపయోగించి తలస్నానం చేసుకోవాలి.

గుడ్డులోని తెల్లసొన మరియు ఆలివ్ ఆయిల్ :

గుడ్డులోని తెల్లసొన మరియు ఆలివ్ ఆయిల్ :

ఒక గుడ్డు తెల్లసొనలో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి అర టీస్పూన్ స్వచ్చమైన తేనె మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. జుట్టు పొడవునా అప్లై చేసిసి, ఒక గంట తర్వాత కండీనషన్ మరియు షాంపుతో తలస్నానం చేసుకోవాలి. .

హెన్న పౌడర్, పెరుగు, నిమ్మరసం:

హెన్న పౌడర్, పెరుగు, నిమ్మరసం:

3 టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్, రెండు మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, రెండు టీస్పూన్ల నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పూర్తిగా అప్లై చేసి, ఒక గంట సేపు అలాగే ఉంచాలి. డ్రై అయిన తర్వాత షాంపు మరియు కండీషనర్ తో తలస్నానం చేయాలి. .

ఆమ్లా జ్యూస్ నిమ్మరసం:

ఆమ్లా జ్యూస్ నిమ్మరసం:

ఆమ్లా మరియు నిమ్మరసం రెండూ సమంగా తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి. కేశాలకు మొత్తానికి అప్లైచేయాలి. ఈ హెయిర్ మాస్క్ ను 2,3 గంటల సేపు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసుకోవాలి.

కొబ్బరి నూనె మరియు అవొకాడో :

కొబ్బరి నూనె మరియు అవొకాడో :

రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో రెండు టేబుల్ స్పూన్ల అవొకాడో పేస్ట్ మిక్స్ చేయాలి. ఈ మాస్క్ ను తలకు పూర్తిగా పట్టించి , 30 మరియు 35 నిముషాలు అలాగే వదిలేసి, తర్వాత షాంపు మరియు కండీషనర్ తో తలస్నానం చేసుకోవాలి.

ఓట్ మీల్ మరియు బాదం ఆయిల్ :

ఓట్ మీల్ మరియు బాదం ఆయిల్ :

అరకప్పు ఓట్స్ తీసుకుని అందులో రెండు మూడు స్పూన్ల బాదం ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని తలకు మొత్తానికి అప్లై చేయాలి. ఒక గట్ట తర్వాత షాంపు మరియు కండీషనర్ తో తలస్నానం చేయాలి. .

కొబ్బరి నూనె , తేనె మిక్స్:

కొబ్బరి నూనె , తేనె మిక్స్:

కొబ్బరి నూనెలో కొద్దిగా తేనె మిక్స్ చేయాలి. 2:1 నిష్పత్తిలో మిక్స్ చేసి నిధానంగా మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత షాంపు మరియు కండీషర్ తో తలస్నానం చేసుకోవాలి.

అరటి, గుడ్డు మరియు ఆలివ్ ఆయిల్ మాస్క్:

అరటి, గుడ్డు మరియు ఆలివ్ ఆయిల్ మాస్క్:

ఈ మాస్క్ తలకు పోషణను అందిస్తుంది . జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది. అరటిపండును మొత్తగా మ్యాష్ చేసి అందులో ఒక గుడ్డు వేయాలి (ముఖ్యంగా ఎగ్ వైట్ మాత్రమే వేయాలి). అందులో రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేసి, తలకు పట్టించి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఈ మాస్క్ ను నెలకొకసారి అప్లై చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

స్ట్రాబెర్రీ మరియు పెరుగు హెయిర్ మాస్క్:

స్ట్రాబెర్రీ మరియు పెరుగు హెయిర్ మాస్క్:

జ్యూసీ స్ట్రాబెర్రీ జుట్టుకు గ్లాసీ షైన్ అందిస్తుంది . ఆయిల్ హెయిర్ కు ఇది ఒక బెస్ట్ ట్రీట్మెంట్ వంటిది. రెండు మూడు స్ట్రాబెర్రీస్ ను అరకప్పు పెరుగులో వేసి మిక్స్ చేసి బాగా బ్లెడ్ చేసి , తలకు అప్లై చేయాలి . 20 నిముషాల తర్వాత కడిగేసుకోవాలి..

English summary

How To Make Your Hair Grow Faster And Longer

How To Make Your Hair Grow Faster And Longer,How To Make Your Hair Grow Faster And Longer, Today, learn how to make the coconut oil and curry leaves hair mask, which is very effective in making your hair thick and long, with regular use.
Story first published: Tuesday, June 28, 2016, 7:54 [IST]
Desktop Bottom Promotion