Latest Updates
-
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా?
చుండ్రును నివారించడంలో అలోవెర(కలబంద)చేసే అద్భుతాలు...
జుట్టు సమస్యల్లో చుండ్రు ఒక సాధారణ చర్మ సమస్య. ఇది మనం తలను క్లీన్ గా ఉంచుకోకపోతే కొన్ని బ్యాక్టిరియా మరియు ఫంగస్ వల్ల, కాలుష్యం వల్ల ఏర్పడుతుంది. తలలో చుండ్రు వల్ల ఎక్కువగా దురద, మరియు తలలో మొత్తం పొట్టు పొట్టుగా రాలుతుంటుంది. ఈ సమస్యను ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సాధారణ సమస్యగా వ్యవహరిస్తున్నారు. తలలో చుండ్రు ఫలితంగా జుట్టు రాలడానికి కారణం అవుతుంది. తలలో చుండ్రు నివారించుకోవడానికి మనకు సాధ్యమైన చిట్కాలన్ని పాటించి ఉంటాము మరియు యాంటీ డ్యాండ్రఫ్ షాంపులనూ ఉపయోగించి ఉంటాము . హార్డ్ గా చూస్తే వీటిలో కొన్ని మాత్రం పనిచేసి ఉంటాయి. కాబట్టి, ఎల్లప్పుడు నేచురల్ పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది
చుండ్రును నివారించుకోవడంలో వివిధ రకాల హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి . అన్నింటిలోకి, అలోవెరా చాలా బెస్ట్ గా పనిచేస్తుంది . అలోవెరా జెల్లోని నయం చేసే గుణాలు మరియు పోషక గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల జుట్టుకు అవసరం అయ్యే పోషణను అందించి మరియు డ్రైనెస్ ను పోగొడుతుంది. తగిన తేమను అందించి జుట్టు నేచురల్ గా సాప్ట్ అండ్ షైనీగా మార్చుతుంది. ముఖ్యంగా చుండ్రును నివారిస్తుంది.
ఈ సమస్యను నివారించడానికి అలోవెరా (కలబంద) చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కలబందలో ఉండే పెక్టిన్ అనే కంటెంట్ తలలో కొత్త కణాలను మరియు కణజాలాలను ఉత్తత్తి చేయడానికి, జుట్టును క్లీన్ గా మరియు సాప్ట్ గా మెయింటైన్ చేయడానికి గొప్పగా సహాయపడుతుంది.
అంతే కాదు, తలలోపలిభాగంలో జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యంగా పెరగడానికి కొన్ని న్యూట్రీషియన్లను గ్రహిస్తుంది . తలలో సెబమ్ మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడం వల్ల ఆటోమ్యాటిక్ గా చుండ్రును నివారించుకోవచ్చు. కాబట్టి, కొత్త జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. మరి, చుండ్రు నివారించుకోవడానికి అలోవెర జెల్ ను ఏవిధంగా ఉపయోగించాలో చూద్దాం...

1.ఫ్రెష్ అలోవెర జెల్:
ఫ్రెష్ గా ఉండే అలోవెర జెల్ ఒక బెస్ట్ హోం రెమెడీ . దీన్ని చుండ్రు నివారణకు ఉపయోగించుకోవచ్చు . అలోవెరాలోని థెరఫియాటిక్ లక్షణాలు చుండ్రును వదిలించడంలో కొన్ని అద్భుతాలను క్రియేట్ చేస్తుంది . అలోవెర ఆకు నుండి జెల్ ను వేరు చేసి తల, స్కాల్ఫ్ మొత్తానికి అప్లై చేయాలి . రాత్రంతా అలాగే ఉంచి ఉదయం తలస్నానం చేయాలి.

2.అలోవెర-టీట్రీ ఆయిల్:
అలోవెరాలో ఉండే నయం చేసే గుణాలు మరియు హైడ్రేటింగ్ లక్షణాలు చుండ్రును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. అంతే కాదు ఇతర సమస్యలను కూడా నివారిస్తాయి . టీట్రీ ఆయిల్లో కంటికి కనిపించని సూక్ష్మ క్రిములను నాశనం చేసే గుణాలున్నాయి . ఈ నూనెలో యాంటీబ్యాక్టిరియల్ లక్షణాలుండటం వల్ల చుండ్రు నివారణలో బెస్ట్ గా చెబుతున్నారు . 3చెంచాలా అలోవెర జెల్లో 6చుక్కల టీట్రీ ఆయిల్ మిక్స్ చేసి తలకు మొత్తానికి అప్లై చేసి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి.

3.కలబందం మరియు వేపనూనె:
వేపనూనెలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది తలలో పొట్టును మరియు దురదను నివారిస్తుంది.మొత్తంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను మరియు దురదను తగ్గిస్తుంది. మూడు చెంచాలా అలోవెర జెల్లలో 10 చుక్కల వేపనూనె మిక్స్ చేసి, తల మొత్తానికి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

4.కలబంద మరియు కర్పూరం:
కర్పూరం తలలో చల్లదనాన్ని అందిస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ కు కారణం అయ్యే మైక్రోబ్స్ ను నివారిస్తుంది. కలబంద తలలో డ్రైనెస్ ను తగ్గిస్తుంది. అరచెంచా కర్పూరం పౌడర్ లో 3 చెంచాలా అలోవెరా జెల్ ను వేసి ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి. కొద్ది సేపటి తర్వాత తలస్నానం చేయాలి.

5.కలబంద-నిమ్మరసం:
నిమ్మరసంలో ఉండే అసిడిక్ నేచర్ వల్ల చుండ్రుకు కారణం అయ్యే ఫంగస్ ను నివారించుకోవచ్చు. ఇంకా పిహెచ్ లెవల్స్ ను తగ్గిస్తుంది . జుట్టుకు మంచి షైనింగ్ ఇస్తుంది. అలోవెరా జెల్ కు కొద్దిగా నిమ్మరసం జోడించి తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు చాలా ఎఫెక్టివ్ గా తొలగించబడుతుంది.

6.కలబంద మరియు మెంతులు
నీళ్ళలో మెంతులు వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం రాత్రంతా నానిన మెంతులను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ కు అలోవెరా జెల్ ను మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను తలకు పట్టించాలి. ఇది తలలో అవాంఛితంగా ఏర్పడా నూనెను తొలగిస్తుంది. దాంతో తలలో జిడ్డు వదులుతుంది. దాంతో తలలో ఎలాంటి బ్యాక్టీరియా, ఫంగస్ ఉన్నా తొలగిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

7.యూకలిప్టస్ ఆయిల్ మరియు అలోవెరా
యూకలిప్టస్ ఆయిల్లో కొద్దిగా అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, నిధానంగా మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత నార్మల్ వాటర్ తో తలస్నానం చేయాలి. ఈ రెండు నేచురల్ హెర్బ్స్ లో ఉండే థెరఫాటిక్స్ లక్షణాల వల్ల తల మరియు జుట్టు క్లీన్ గా మారుతుంది. హెయిర్ షాంపును ఈ విధంగానే మీరు ఉపయోగించాల్సి ఉంటుంది.

8.అలోవెరా-ఆముదం:
అలోవెరా జెల్ ను అరకప్పు తీసుకొని , అందులో రెండు చెంచాలా ఆముదం, రెండు చెంచాలా మెంతి పొడి మరియు ఒక చెంచా తులసి పొడి మిక్స్ చేసి తలకు, జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత షవర్ క్యాప్ పెట్టుకొని నిద్రపోవాలి. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే మంచి నీరు, మన్నికైన షాంపుతో తలస్నానం చేయడం వల్ల జుట్టుకు అవసరం అయ్యే పోషకాలు అందడంతో పాటు, చుండ్రు వదులుతుంది. ఈ హెయిర్ మాస్క్ చాలా ఎఫెక్టివ్ గా కండీషన్ పనిచేస్తుంది. చుండ్రును నివారించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీన్నికనీసం వారానికొకసారి ఉపయోగించాలి.



Click it and Unblock the Notifications