For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒత్తైన, పొడవైన జుట్టు కోసం మెంతి , కరివేపాకు ఉపయోగించే సింపుల్ టిప్స్..!

|

తలదువ్వాలంటే భయంగా ఉందా..? ఎక్కువగా జుట్టు ఊడుతోందని తలదువ్వడం తగ్గించేస్తారు. ఇలా చేయడం వల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది తప్ప తగిన పరిష్కారం లభించదు. ఇలా చేడయం వల్ల తలలో మరింత చిక్కు, డ్రైనెస్ వల్ల జుట్టు ఇంకా ఎక్కువగా రాలుతుంది.

కాబట్టి, జుట్టు రాలే సమస్యను ప్రారంభంలోనే గమనించినట్లైతే, సమస్యను ప్రారంభంలోనే తగ్గించుకోవచ్చు. జుట్టు రాలడం అరికట్టడానికి కేవలం రెండే రెండు పదార్థాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇవి మన వంటగదిలో ఉండే నేచురల్ రెమెడీస్ . వీటిలో ఔషధ గుణాలు, పోషక విలువలు కూడా ఎక్కువే. అవేంటంటే కరివేపాకు మరియు మెంతులు.

కరివేపాకు మరియు మెంతులును ఉపయోగించడానికి ముందు ఈ రెండు పదార్థాలు జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో ఉన్న ఔషధ విలువల గురించి తెలుసుకోవాలి.

జుట్టుకు మెంతులు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయి? మెంతులల్లో నికోటినిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది కొత్తగా హెయిర్ ఫోలిసెల్స్ ను ప్రోత్సహిస్తుంది.ఇంకా మెంతులు లెసిథిన్ కు పవర్ హౌస్ వంటింది. లెసిథిన్ జుట్టుకు బలాన్ని ఇస్తుంది. తలలో సెన్సిటివ్ స్కిన్ కు రక్షణ కల్పిస్తుంది.

మరొక పదార్థం అమినో యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్, ఇది కొత్తగా ఉండే హెయిర్ ఫోలీ సెల్స్ ను డెవలప్ చేస్తుంది. కాబట్టి ఈ రెండింటి కాబినేషన్ లో ప్రోటీన్స్, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుది. ప్రోటీన్స్ హెయిర్ ఎలాసిటిని పెంచుతుంది. దాంతో జుట్టు బ్రేక్ కాకుండా ఉంటుంది. బీటా కెరోటిన్స్ జుట్టు రాలడం తగ్గిస్తుంది. ఈ రెండు పదార్థాల వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయో మీరు తెలుసుకున్నారు కదా, ఇక ఇప్పుడు కరివేపకు, మెంతులతో హెయిర్ స్ట్రెయిటనింగ్ మాస్క్ ను ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం...

How To Use Methi & Curry Leaves

స్టెప్ 1:
మీ జుట్టు పొడవును, ఒత్తును బట్టి, జుట్టుకు సరిపడా మెంతులను తీసుకుని, ఒక కప్పు నీటిలో వేసి, రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటితో పాటు, మెంతులను మెత్తగా పేస్ట్ చేయాలి.

How To Use Methi & Curry Leaves

స్టెప్ 2:
ఒక టీస్పూన్ కరివేపాకు పౌడర్ ను మెంతి పేస్ట్ కు జోడించి, బాగా మిక్స్ చేయాలి. రెండు బాగా మిక్స్ అయ్యే వరకూ మిక్స్ చేయాలి.

How To Use Methi & Curry Leaves

స్టెప్ 3:
ఇప్పుడు ఈ పేస్ట్ ను తలకు మరియు జుట్టు పొడవునా అప్లై చేయాలి..

How To Use Methi & Curry Leaves

స్టెప్ 4:
ఈ హెయిర్ మాస్క్ ను ఒక గంట సేపు అలాగే ఉండనివ్వాలి. తర్వాత రెగ్యులర్ షాంపుతో , కండీషర్ తో తలస్నానం చేయాలి. .

How To Use Methi & Curry Leaves

స్టెప్ 5:
ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల తలలో చుండ్రు నివారించబడుతుంది, కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవాలి.

జుట్టును స్ట్రాంగ్ మార్చడానికి , జుట్టు రాలడం అరకట్టడానికి వేరే ఇతర నేచురల్ రెమెడీస్ ఉన్నట్లైతే, ఈ క్రింది కామెంట్ బాక్స్ లో మాతో షేర్ చేసుకోండి.

English summary

How To Use Methi & Curry Leaves For Thicker Hair

How To Use Methi & Curry Leaves For Thicker Hair
Story first published:Wednesday, October 12, 2016, 11:24 [IST]
Desktop Bottom Promotion