జుట్టు ఒత్తుగా...పొడవుగా పెరగడానికి ఉల్లిపాయ జ్యూస్ తో సులభమైన మార్గాలు..!

అందమైన ఒత్తైన జుట్టు కలిగి ఉండాలని మహిళలు కలలు కంటారు. అంతే కాదు, అటువంటి జుట్టు ఉన్నవారిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయట. మెడికల్ ఎక్స్ పర్ట్స్ ప్రకారం, ఒక రోజులో 100 వెంట్రుకలు రాలిపోతాయని చెబుతున్నారు. వంద కంటే ఎక్కువ వెంట్రుకలు రాలిపోతుంటే , అప్పుడు సీరియస్ మ్యాటర్ గా తీసుకోవాలి. ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల బట్టతల వస్తుంది. ఈ రోజుల్లు బట్టతల, హెయిర్ లాస్ సమస్యలను ఎదుర్కొనే వారిని చాలా మందినే చూశాము .

చుండ్రు, టెన్షన్స్, స్ట్రెస్, క్లైమెంట్ లో మార్పులు, తలకు హార్డ్ వాటర్ ఉపయోగించడం వల్ల జుట్టు రాలడానికి ఎక్కువ కారణాలవుతున్నాయి . ఇవే కాకుండా లైఫ్ స్టైల్ కూడా కారణమవుతున్నది. కాబట్టి, జుట్టు రాలడం తగ్గించి, హెల్తీ హెయిర్ పొందడానికి, అనేక మార్గాలున్నాయి. అయితే ఒక్కటి మాత్రం గుర్తించుకోవాలి. జుట్టు రాలడాన్ని అరకట్టడానికి ఎన్న మార్గాలున్నా...వాటిలో నేచురల్ పద్దతులను ఫాలో అవ్వడం వల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కానీ,జుట్టు రాలడం కానీ జరగదు. ఇది హెయిర్ మరియు స్కిన్ కూడా చాలా మేలు చేస్తాయి

జుట్టు రాలడాన్ని అరకట్టడంలో ఉల్లిపాయ గ్రేట్ రెమెడీ. జుట్టు రాలడం నివారించడంలో ఇది హెయిర్ టానిక్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా చౌకైనది, చాలా సులభంగా మనకు అందుబాటులో ఉండే ఆహార పదార్థం. ఉల్లిపాయ వాసన ఘాటుగా ఉండవచ్చు. కానీ, ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ కంటెంట్ జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసి, జుట్టును ఒత్తుగా.. పొడవుగా..ఫాస్ట్ గా పెరగడానికి సహాయపడుతుంది. ఒత్తైన జుట్టును పొందడానికి ఉల్లిపాయ రసంను ఉపయోగించే సులభమైన పద్దతుల గురించి తెలుసుకుందాం:

జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి ఉల్లి టానిక్ ..!

ఉల్లిపాయ రసం:

ఉల్లిపాయ రసం:

ఉల్లిపాయ పొట్టు తొలగించి, చిన్న ముక్కలు గా కట్ చేయాలి. తర్వాత ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ నుండి రసాన్ని ఒక కప్పులోకి స్క్వీజ్ చేసి, తలకు అప్లై చేసి కొన్ని నిముషాలు మసాజ్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. దీన్ని వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఉల్లిపాయ రసం, తేనె :

ఉల్లిపాయ రసం, తేనె :

ఈ రెండు నేచురల్ పదార్థాలు జుట్టు పెరుగదలను ప్రోత్సహిస్తాయి. ఒక ఉల్లిపాయను తీసుకుని ముక్కలుగా కట్ చేసి, పేస్ట్ చేసి రసం తీయ్యాలి. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసి తలకు అప్లై చేసి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేడయం వల్ల జుట్టుకు కొన్ని అద్భుతాలు జరుగుతాయి .

ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనె:

ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనె:

ఉల్లిపాయ నుండి రసం తయారుచేసుకుని అందులో కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. కొబ్బరి నూనె జోడించడం వల్ల ఉల్లిపాయ వాసన ఉండదు. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసిన 2 గంటల తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

ఆనియన్ జ్యూస్, ఆలివ్ ఆయిల్:

ఆనియన్ జ్యూస్, ఆలివ్ ఆయిల్:

ఈ పద్దతిలో, ఉల్లిపాయను ముక్కలుగా చేసి, మిక్సీలో వేసి మెత్గగా గుజ్జు రెడీ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ కు కొద్దిగా బీర్, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను తలకు పూర్తిగా అప్లై చేసి, 2 గంటల పాటు అలాగే ఉండాలి. 2 గంటల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

ఆనియన్ జ్యూస్ , రమ్ :

ఆనియన్ జ్యూస్ , రమ్ :

సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఒక గ్లాస్ రమ్ లో వేయాలి. ఇలా వేయడం వల్ల ఉల్లిపాయ వాసనను తగ్గిస్తుంది. ఇలా రమ్ లో మిక్స్ చేసిన ఆనియన్స్ ను రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా ఉల్లిపాయలు రమ్ లో నానడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉదయం రమ్ ను వడగట్టి తలకు అప్లై చేయాలి. ఇలా వారంలో ఒకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆనియన్ జ్యూస్ , హాట్ ఆయిల్ :

ఆనియన్ జ్యూస్ , హాట్ ఆయిల్ :

హాట్ ఆయిల్ మసాజ్ వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. హాట్ హాయిల్ కు కొద్దిగా ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేయడం వల్ల ఫలితం రెట్టింపు అవుతుంది.

ఆనియన్ జ్యూస్, లెమన్ జ్యూస్ :

ఆనియన్ జ్యూస్, లెమన్ జ్యూస్ :

లెమన్ జ్యూస్ లో కొద్దిగా ఆనియన్ జ్యూస్ మిక్స్ చేసి, తలకు అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల జుట్టు హెల్తీగా మరియు షైనీగా మారుతుంది. నిమ్మరసం చేర్చడం వల్ల ఉల్లిపాయ వాసన ఉండదు . ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం మాత్రమే కాదు, ఇది తలలో చుండ్రును కూడా చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

డ్రై అండ్ నార్మల్ హెయిర్ కు ఆనియన్ మాస్క్ :

డ్రై అండ్ నార్మల్ హెయిర్ కు ఆనియన్ మాస్క్ :

ఆనియన్ జ్యూస్ కు కొద్దిగా తేనె, పెరుగు లేదా ఆలివ్ లేదా బాదం ఆయిల్ మిక్స్ చేసి, తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

రెగ్యులర్ డైట్ లో ఉల్లిపాయలను చేర్చుకోవాలి:

రెగ్యులర్ డైట్ లో ఉల్లిపాయలను చేర్చుకోవాలి:

రెగ్యులర్ డైట్ లో ఉల్లిపాయలను ఎక్కువగా చేర్చుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలడాన్ని నివారించడంలో ఇది ఒక సులభమైన చిట్కా ..

తలస్నానం చేసిన తర్వాత ఆనియన్ వాష్

తలస్నానం చేసిన తర్వాత ఆనియన్ వాష్

ఆనియన్ జ్యూస్ ను ఒక మగ్గు నీటిలో మిక్స్ చేసి, తలస్నానం పూర్తైన తర్వాత ఆనియన్ వాటర్ తో హెయిర్ వాష్ చేయాలి. వాసన గురించి మీరు పెద్దగా పట్టించుకోకపోతే రెగ్యురల్ హెయిర్ బాత్ లో కూడా ఉపయోగించుకోవచ్చు ..

Story first published: Wednesday, October 12, 2016, 17:30 [IST]
Desktop Bottom Promotion