Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బట్టతల నివారించడానికి సింపుల్ సొల్యూషన్..! ఆముదం.. !!
మీ జుట్టు రాలిపోతోందని బాధపడుతున్నారా ? రాలుతున్న వెంట్రుకలు చూస్తుంటే నిద్రపట్టడం లేదా ? బట్టతల వచ్చిన ఫీలింగ్ కలుగుతోందా ? జుట్టు రాలే సమస్య అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్న కామన్ ప్రాబ్లమ్. వెంటనే కేర్ తీసుకోకపోతే.. పర్మనెంట్ గా బట్టతలను ఫేస్ చేయాల్సి వస్తుంది.
బట్టతల రాకుండా ఉండటానికి ఏం చేయాలి ? ఒకవేళ ఇప్పటికే బట్టతల చాయలు కనిపిస్తుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? అని ఆలోచిస్తున్నారా ? ఏముంది హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్స్, ఖర్చుతో కూడిన ట్రీట్మెంట్స్ గురించి చెబుతామని అనుకుంటే.. మీరు పొరబడ్డట్టే. ఇలాంటి కాస్ట్ లీ ట్రీట్మెంట్స్ కాకుండా.. సింపుల్ సొల్యూషన్ ఉంది. అదే ఆముదం.. !!
జుట్టు రాలడాన్ని తగ్గించే మన వంటగది వస్తువులు
మన పూర్వీకులు ఎక్కువగా జుట్టు సంరక్షణకు ఆముదమునే ఉపయోగించేవాళ్లు. అది జిగుటగా, ఎక్కువ మందంగా ఉండటం వల్ల ఇప్పుడు దాన్ని ఉపయోగించడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ.. బట్టతల నివారించడంలో ఆముదం చేసే మిరాకిల్ తెలిస్తే.. ఇవాళ్టి నుంచే ఆముదం ఉపయోగించడం మొదలుపెట్టేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం బట్టతల నివారించడంలో ఆముదం ఎలా సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం..

ఎలా సహాయపడుతుంది ?
ఆముదం చాలా సహజసిద్ధమైన నూనె. ఇందులో విటమిన్ సి, ప్రొటీన్స్, మినరల్స్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.

ఎక్కువ మందంగా
ఆముదం చాలా మందంగా ఉంటుంది. దీన్ని జుట్టు, స్కాల్ప్ కి పట్టించడం వల్ల హెయిర్ గ్రోత్ పై దుష్ర్పభావం చూపే వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఫంగల్ ఏర్పడకుండా అరికడుతుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి స్కాల్ప్, జుట్టు ఆరోగ్యానికి మంచిది.

బ్లడ్ సర్క్యులేషన్
ఆముదంను జుట్టుకి, మాడుకి పట్టించడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా సాగుతుంది. దీనివల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది.

జుట్టు రాలడం
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం వల్ల ఆముదంను రెగ్యులర్ గా ఉపయోగిస్తే.. స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది. అలాగే రెగ్యులర్ గా ఆముదం ఉపయోగించే వాళ్లలో జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

జుట్టు చిట్లిపోవడం
ఆముదం జుట్టుని స్ట్రాంగ్ గా చేసి.. చివర్లు చిట్లిపోవడాన్ని నివారిస్తుంది. జుట్టు డ్యామేజ్ అవుతుందని భావించేవాళ్లు, జుట్టు పొడిబారిన వాళ్లు ఆముదం అప్లై చేయడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు.

మాయిశ్చరైజర్
ఆముదం తలకు మంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. ఇది మందంగా, జిగటగా ఉండటం వల్ల జుట్టుకి ఎక్కువ సేపు రక్షణగా ఉంటుంది. అలాగే పొడిబారిన జుట్టుని స్మూత్ గా మారుస్తుంది.

ఎలా ఉపయోగించాలి ?
ఆముదం చాలా మందంగా ఉండటం వల్ల దీన్ని ఉపయోగించడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయితే.. ఆముదంను అప్లై చేయడం ఇబ్బందిగా ఫీలయ్యే వాళ్లు.. కొంచెం కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె మిక్స్ చేసి రాసుకోవచ్చు.

బట్టతల
మీ తలలో ఎక్కడైనా జుట్టు పూర్తీగా రాలిపోయి.. బట్టతల చాయలు కనిపిస్తుంటే ఆముదం చక్కటి పరిష్కారం. అలాంటప్పుడు ఆముదంలో కాటన్ ముంది.. జుట్టు పూర్తీగా రాలిపోవడం వల్ల ఏర్పడిన గ్యాప్ పట్టించాలి. రాత్రంతా అలానే వదిలేసి.. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే బట్టతల నివారించడం తేలికైన పని అవుతుంది.



Click it and Unblock the Notifications