Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కేవలం రెండు వారాల్లో ఒత్తైన జుట్టు పొందే అమేజింగ్ సొల్యూషన్..!
పలుచటి జుట్టు ఉంటే.. ఎలాంటి హెయిర్ స్టైల్ వేసినా... అందంగా కనిపించదు. అసలు.. ఏ హెయిర్ స్టైల్ కూడా ట్రై చేయలేని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో పలుచటి జుట్టు వల్ల లుక్ మొత్తం మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒత్తైన జుట్టు పొందాలని కోరుకుంటారు. మీరు కూడా ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారా ?
అయితే కొంత సమయాన్ని మీ జుట్టు సంరక్షణ కోసం కేటాయించండి. ఒకసారి జుట్టుని కోల్పోయిన తర్వాత మళ్లీ ఆరోగ్యకరమైన హెయిర్ పొందండం అంత తేలికైన పని కాదు. హెల్తీ హెయిర్ పొందాలంటే.. ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి.

కొంతమంది పుట్టుకతోనే న్యాచురల్ గా ఒత్తైన జుట్టు కలిగి ఉంటారు. మరికొంతమంది సరైన పోషణ, కేర్ తీసుకుని.. జుట్టు ఒత్తుగా పెరగడానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు యుక్తవయసులో ఉన్నప్పుడు జుట్టు ఒత్తుగా ఉంటుంది. కానీ ఆ తర్వాత అసమతుల్య ఆహారం, దుమ్ము, కాలుష్యం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి కారణాల వల్ల జుట్టు బలహీనంగా మారి పలుచబడుతుంది.
ప్రస్తుతం జుట్టు రాలడం అనేది చాలా కామన్ గా వినిపిస్తున్న సమస్య. అన్ హెల్తీ, ఒత్తిడితో కూడా లైఫ్ స్టైల్ కారణంగా.. ఈ సమస్య ఎక్కువ అవుతోంది. కాబట్టి మీకు ఒత్తైన, హెల్తీ హెయిర్ కావాలంటే.. కేవలం 3 పదార్థాలు ఉపయోగిస్తే చాలు. అవి కూడా.. మీ వంటింట్లో అందుబాటులో ఉన్న న్యాచురల్ పదార్థాలే. అది కూడా కేవలం రెండువారాల్లోనే ఒత్తైన జుట్టు పొందవచ్చు.

కావాల్సిన పదార్థాలు
ఆముదం 1 టేబుల్ స్పూన్
ఎగ్ వైట్ 2 టేబుల్ స్పూన్లు
అలోవెరా జ్యూస్ 1 టేబుల్ స్పూన్
ఆముదం, ఎగ్ వైట్, ఆలోవెరా జ్యూస్ కలిపిన మిశ్రమం రెండు వారాల్లో జుట్టుని ఒత్తుగా మార్చడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అయితే హెల్తీ డైట్ కూడా ఫాలో అయితే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్ లో పోషకాలు, మినరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి స్ట్రాంగ్ గా మారుతుంది. జుట్టుకి మంచి పోషణను అందిస్తుంది.

ఆముదం హెల్తీ హెయిర్ సెల్స్ ఉత్పత్తి అవడానికి, జుట్టు ఎక్కువగా పెరగడానికి, ఏర్పడానికి సహాయపడి.. జుట్టుని ఒత్తుగా మార్చేస్తుంది. జుట్టుకి కావాల్సిన ప్రొటీన్ ఎగ్ వైట్ నుంచి లభిస్తుంది. అలోవెరా జ్యూస్ జుట్టుకి పోషణ అందించే గుణాలు పుష్కలంగా ఉంటుంది.
హెయిర్ ప్యాక్ తయారు చేసే విధానం
పైన చెప్పిన 3 పదార్థాలను ఒక గిన్నెలో కలుపుకోవాలి.
మూడింటింనీ.. బాగా మిక్స్ చేయాలి.
ఈ ప్యాక్ ని జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి.
15 నిమిషాలు అలా వదిలేసి.. తర్వాత కొన్ని నిమిషాలు మసాజ్ చేయాలి.
ఇప్పుడు మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
అంతే.. ఒత్తైన, హెల్తీ హెయిర్ మీ సొంతమవుతుంది.



Click it and Unblock the Notifications