Latest Updates
-
రాజస్థాన్ ఫేమస్ లాల్ మాస్..మటన్ కూర ఇలా వండితే గిన్నెలో ఒక్క ముక్క కూడా మిగలదు! -
ఈ ఫ్రూట్‌తో పురుషుల్లో ఎనర్జీ రెట్టింపు.. శిలాజిత్ కంటే మోస్ట్ పవర్ఫుల్.! -
లక్ష్మీదేవి సముద్రం నుండి ఎందుకు పుట్టింది? దాచిన పురాణ కథ -
జూన్ 6 గ్రహ సంచారం: కుంభరాశిలో చంద్రుడి ప్రయాణం.. ఈ రాశుల వారికి అదృష్టం, సంపద వెల్లువ! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 06 జూన్ 2026 -
మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? ఈ 7 వాస్తు & ఆధ్యాత్మిక మార్గాలు సకారాత్మక శక్తిని పెంచుతాయట! -
పనీర్, కాలీఫ్లవర్‌తో ఇలా కుర్మా చేశారంటే.. నాన్‌వెజ్ కూడా దిగదుడుపే.! -
ప్రతి మహిళ ఏడాదికోసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే.. లేదంటే.? -
ప్రేమిస్తున్నారు కానీ పోతారేమోనని భయం ఆ భయమే బంధాన్ని ఎలా పాడుచేస్తోందో తెలుసా? -
మ్యాంగోతో జ్యూస్‌లే కాదు.. ఇలా స్వీట్లు చేశారంటే ఆ రుచి జన్మలో మరిచిపోలేరు.!
షాంపూ లేకుండా.. న్యాచురల్ గా జుట్టు శుభ్రం చేసుకునే ట్రిక్స్
మీరు హెయిర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా ? ఒకవేళ మీకు జుట్టు సమస్యలు ఉంటే.. మీ షాంపూ, కండిషనర్ ని మార్చాల్సిన సమయం వచ్చిందని గుర్తించండి. బ్యూటీ ఎక్స్ పర్ట్స్ ప్రకారం.. 90 శాతం మంది మహిళలు, పురుషులు ఎదుర్కొంటున్న హెయిర్ లాస్, చుండ్రు వంటి సమస్యలకు వాళ్లు ఉపయోగించే షాంపూ సరైనది కాకపోవడమే అని చెబుతున్నారు.
హెయిర్ లాస్ నివారించడానికి వెల్లుల్లి ఎలా ఉపయోగపడుతుంది ?
ఆయిలీ స్కాల్ఫ్ తో బాధపడుతుంటే.. మీ జుట్టుని రోజూ శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే షాంపూ, కండిషనర్ ఉపయోగించకుండా.. రోజూ శుభ్రం చేసుకోవాలట. ఎందుకంటే.. రోజూ షాంపూతో జుట్టుని శుభ్రం చేసుకుంటే.. మరిన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి.. స్కాల్ఫ్ కి సరిపడే, ఎలాంటి హాని చేయని.. న్యాచురల్ షాంపూలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
తలస్నానానికి ముందు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ?
షాంపూ లేకుండా.. జుట్టుని శుభ్రం చేసుకోవడానికి అనేక రెమిడీస్ ఉన్నాయి. అవి కూడా చాలా సింపుల్ గా, న్యాచురల్ గా పనిచేస్తాయి. కాబట్టి కెమికల్ షాంపూలను పక్కనపెట్టి.. న్యాచురల్ షాంపూలను ప్రయత్నించండి. న్యాచురల్ షాంపూలు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

పుదీనా
ఒక గుండ్రటి గిన్నెలో ఒక కప్పు నీళ్లు వేయండి.ఆ నీటిని మీడియం ఫ్లేమ్ లో మరిగించాలి. అందులోకి గుప్పెడు పుదీనా ఆకులు వేయాలి. 10 నిమిషాల పాటు ఆ ఆకులు నీటిలో నాననివ్వాలి. నీటిని వడగట్టాలి. జుట్టుని ఆ నీటితో శుభ్రం చేసి.. ఆకులతో మసాజ్ చేయాలి. ఈ పుదీనా ఆకులు దుమ్ము తొలగించి.. న్యాచురల్ షాంపూలా పనిచేస్తుంది.

సోడా
వారానికి ఒకసారి సోడాతో జుట్టుని శుభ్రం చేసుకుంటే.. చుండ్రు నివారించవచ్చు. ముందుగా సోడాతో జుట్టు మాడుని శుభ్రం చేసుకోవాలి. 6 నిమిషాల అలా వదిలేసి.. తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి.

రోజ్ మెరీ
జుట్టుకి ఉపయోగించడానికి రోజ్ మెరీ చక్కటి ఎంపిక. మీ జుట్టుకి మంచి సువాసన తీసుకొస్తుంది. రోజ్ మెరీ ఆకులను నలపాలి. స్నానపు నీటిలో ఆ ఆకులు కలపాలి. 8 నిమిషాల ఆ నీటిలో రోజ్ మెరీ లీవ్స్ నాననివ్వాలి. తర్వాత ఆ నీటితో జుట్టు శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

వెనిగర్
అన్ని రకాల జుట్టు సమస్యలతో పోరాడటానికి వెనిగర్ సహాయపడుతుంది. ఆయిలీ స్కాల్ఫ్, డాండ్రఫ్ వంటి సమస్యలను వెనిగర్ చక్కటి పరిష్కారం. ఫ్రెష్ వెనిగర్ తో స్కాల్ఫ్ ని మసాజ్ చేయాలి. 7 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. షాంపూ, సోప్ ఉపయోగించరాదు. దీనివల్ల జుట్టు మెరిసిపోతుంది.

బేకింగ్ సోడా, యోగర్ట్
ఒక కప్పులో 3 టేబుల్ స్పూన్ల యోగర్ట్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి మాస్క్ లా అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత షాంపూ ఉపయోగించకుండా.. శుభ్రం చేసుకోవాలి. బేకింగ్ సోడా డర్ట్ తొలగిస్తే.. యోగర్ట్ జుట్టుకి న్యాచురల్ లుక్ తీసుకొస్తుంది.

గుడ్డు, నిమ్మ
లెమన్ ఆయిల్ వాడటం వల్ల స్కాల్ఫ్ లో చెమట వాసన తగ్గిపోతుంది. ఒక కప్పులో రెండు కోడిగుడ్లు, లెమన్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి.. స్కాల్ఫ్ పై మసాజ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో షాంపూ ఉపయోగించకుండా శుభ్రం చేసుకోవాలి.

పెరుగు
వారానికి ఒకసారి న్యాచురల్ రెమిడీస్ జుట్టుకి అప్లై చేయడం చాలా అవసరం. పెరుగు జుట్టుకి పర్ఫెక్ట్ కండిషనర్. చల్లటి, గడ్డ పెరుగు తలకు అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. షాంపూ ఉపయోగించరాదు.



Click it and Unblock the Notifications