For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు పెరగుదలను ప్రోత్సహించే హై ప్రోటీన్ ఫుడ్స్..!

|

పట్టుకుచ్చులా ఉండే కేశాలతో పొడవాటి జడతో మురిసిపోవాలని ప్రతి అమ్మాయీ కోరుకుంటుంది. అయితే ఎంతకీ పెరగని జుట్టుతో మదిలో మదనపడుతుంటారు. కొత్తకొత్త ప్రయోగాలు చేయాలని ఉన్నా శిరోజాలు ఒత్తుగా లేక వెనకుడుగు వేస్తుంటారు. వీటితోపాటు జుట్టు పొడిబారిపోవడం, చుండ్రు, జుట్టు చివర్లు చిట్లిపోవడం, రాలిపోవడం, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు మహిళలని కలవరపరిచేలా చేస్తుంది.

వీటన్నింటికీ కారణం ఒత్తిడి, అనారోగ్యాలు, జీవనశైలిలో మార్పులు. అయితే సరైన పోషకాహారం తీసుకొన్నట్టైతే వీటన్నింటికి అడ్డు కట్ట వేయవచ్చు. శరీరంలో జింక్ లోపం ఉన్నట్లైతే జుట్టు పెరుగుదల సరిగా ఉండదు. అలాగే జుట్టు పెరుగుదలకి విటమిన్ బి1, విటమిన్ సి, లైసీన్, నయాసిన్ లు ముఖ్యంగా అవసరం. బీటా కెరటిన్ ఫ్యాటీ ఆమ్లాలు సరిగా అందకపోతే చుండ్రు సమస్య తీవ్రం అవుతుంది.

Protein Rich food for Fast Hair Growth..!

జుత్తు పొడిబారకుండా సహజ సౌందర్యంతో నిగనిగలాడుతూ ఉండాలి. కొందరిలో జుట్టు అందవిహీనంగా, నిర్జీవంగా మారడానికి పోషకాహారలోపం ప్రధాన కారణం అంటున్నారు కొందరు సౌందర్య నిపుణులు. పోషకాహారం తీసుకోవడం అన్నది శరీరానికే కాకుండా శిరోజాలకు చాలా మేలు చేకూరుస్తుందని వారు చెబుతున్నారు. పోషకాహారం వలన జుట్టు ఊడిపోవడం, తెల్లబడడం, చుండ్రు వంటి సమస్యలను తేలికగానే అధిగమించవచ్చు.

జుట్టు రాలిపోతున్నదని చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు. పలు రకాల నూనెలు రాసి, జుట్టు రాలడాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తారు. నిజానికి కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడంతో పాటు ఆరోగ్యమైన జుట్టును పొందే వీలుందంటున్నారు నిపుణులు. కాబట్టి నిగనిగలాడే జుట్టు కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో చూద్దాం...

Protein Rich food for Fast Hair Growth..!
కోడిగుడ్డు: గుడ్డులో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. గుడ్డులోని సల్ఫర్ ఆధారిత అమైనో అమ్లాలు..కెరటిన్ ని అందించి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ ఆహారంలో గుడ్డు తీసుకోవడం వల్ల పట్టుకుచ్చులాంటి కేశాలతో పాటు ఆరోగ్యమవంతమైన గోళ్ళు కూడా సొంతమవుతాయి.
Protein Rich food for Fast Hair Growth..!

ఖర్జూరం: ఖర్జూరంలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. ఈ ఇనుము అందకే చాలామందికి జుట్టు రాలిపోతుంటుంది. రోజుకో ఖర్జూరం తింటే ఎంతో మేలు. డ్రైఫ్రూట్స్, నల్లటి ఎండు ద్రాక్ష, ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకు కూరలు ఉసిరి వంటివి ఇనుమును అందించే ఇతర పదార్థాలు.

Protein Rich food for Fast Hair Growth..!

జుట్టు చివర్లు చిట్ల ఇబ్బంది పడుతుంటే జామకాయలు తింటే మంచిది. జామలోని విటమిన్ సి చివర్లు చిట్లిపోకుండా కాపాడుతుంది. ఇనుము గ్రహిస్తుంది. జామతో పాటు ఉసిరి, టమాటా, బత్తాయి ఇందుకు సహకరిస్తాయి. నయాసిన్ విటమిన్ మాంసం, మొలకెత్తిన గింజలు, పచ్చిబఠాణి, ఆకుపచ్చ బఠాణి, వేరుశెనగ, మొలకెత్తిన గోధుమ గింజల నుంచి ఎక్కువగా దొరుకుతుంది. ఈ విటమిన్ జుట్టు తెల్లబడకుండా రాలిపోకుండా కాపాడుతుంది.

Protein Rich food for Fast Hair Growth..!

మాంసకృత్తులు: కుదుళ్ళను ఆరోగ్యంగా వుంచడానికి దోహదపడుతుంది. చేపలలో ఎక్కువగా లభిస్తాయి. అయితే గుడ్లు, చేపలు తినలేని వారు సోయాను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. సోయాలోని లైసిన్ అమినో ఆమ్లం జుట్టు కుదుళ్ళను ఆరోగ్యంగా వుంచుతుంది.

Protein Rich food for Fast Hair Growth..!

సోయాపాలు లేదా సోయా చిక్కుడులో ప్రోటీన్ అత్యధికంగా ఉంటుంది. జుట్టురాలడాన్ని సోయా సమర్థంగా అరికడుతుంది. ఠీజుట్టు పెరిగేందుకు జింక్ చాలా అవసరం. అది జీడిపప్పులో పుష్కలంగా ఉంటుంది.

Protein Rich food for Fast Hair Growth..!

ఆల్ఫాలినోలెటిక్ యాసిడ్ జుట్టు ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. ఈ యాసిడ్ బాదంపప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్‌లో అధికంగా ఉంటుంది.

Protein Rich food for Fast Hair Growth..!

పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. జుట్టు పెరిగేందుకు కాల్షియం చాలా అవసరం. అందుకే ఎదిగే పిల్లలకు రోజూ పాలు ఇవ్వడం వల్ల ఎముకలు పెరగడంతో పాటు నిగనిగలాడే జుట్టు వస్తుంది

English summary

Protein Rich food for Fast Hair Growth..!

Protein Rich food for Fast Hair Growth..!Eating foods that are rich in protein, as well as foods that are rich in iron, will not only keep your hair shiny and full of life, but will also allow it to grow at its fastest possible rate.
Story first published: Thursday, June 23, 2016, 16:53 [IST]
Desktop Bottom Promotion