Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నిర్జీవంగా మారిన జుట్టుని న్యాచురల్ గా మార్చే సింపుల్ రెమిడీస్
చాలామందికి ఎదురయ్యే కామన్ బ్యూటీ ప్రాబ్లమ్స్ లో డల్ హెయిర్ ఒకటి. లైఫ్ స్టైల్, కెమికల్స్, హెయిర్ కేర్ పై నిర్లక్ష్యం కారణంగా జుట్టు ఆకృతి, ప్రకాశాన్ని కోల్పోతుంది. తలస్నానం చేసినా.. వెంటనే నిర్జీవంగా కనిపిస్తూ ఉంటుంది.
అనారోగ్యకరమైన జుట్టుకు అధిక సూర్యరశ్మి, సరైన ఆహారం తీసుకోకపోవటం, హెయిర్ ట్రీట్మెంట్స్, రసాయనాలు డల్ హెయిర్ కి ప్రధాన కారణం. జుట్టుకి తీసుకునే ట్రీట్మెంట్స్ లో ఎసెన్షియల్ ఆయిల్స్ ఎక్కువగా వాడటం వల్ల కూడా జుట్టు పొడిబారుతుంది.

జుట్టు ప్రకాశవంతంగా మార్చేందుకు మంచి పోషణ అందివ్వాలి. జుట్టు సంరక్షించుకోవడానికి న్యాచురల్ ట్రీట్మెంట్స్ పై ఆసక్తి చూపడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. డల్ మారిన జుట్టుకి షైనింగ్ తీసుకొచ్చే.. హోం రెమిడీస్ ఇప్పుడు చూద్దాం.

గుడ్డు
గుడ్డు దెబ్బతిన్న జుట్టుకు అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది. గుడ్డు పచ్చసొన జుట్టుకు పోషణ అందిస్తుంది. జుట్టును స్మూత్ గా, సిల్కీగా చేస్తుంది. జుట్టుకు పచ్చ సొనను రాసి కొన్ని నిముషాలయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
అవోకాడో
అవోకాడో నిర్జీవంగా మారిన జుట్టుకు ఉత్తేజాన్నిస్తుంది. స్మూత్ గా మార్చి, తేమను కూడా అందిస్తుంది. వారంలో ఒకసారి అవోకాడో పేస్ట్ ని తలకు పట్టిస్తే జుట్టు హెల్తీగా, షైనీగా ఉంటుంది.

అరటిపండు
అరటిపండు దెబ్బతిన్న జుట్టుకు చక్కటి పరిష్కారం. అరటిపండులో అవసరమైన పోషకాలు, విటమిన్లు, సహజ నూనెలు ఉండుట వల్ల జుట్టుకు పోషణ, తేమను అందిస్తుంది. బాగా పండిన అరటిపండును గుజ్జుగా చేసి జుట్టుకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
కలబంద
కలబందలో ఎంజైమ్స్, విటమిన్స్ సమృద్దిగా ఉంటాయి. తలలో చుండ్రుని సమర్ధవంతంగా నివారిస్తుంది. కలబంద జెల్ ని నేరుగా జుట్టుకు రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరి నూనె
నిర్జీవమైన జుట్టుకు కొబ్బరి నూనె చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. జుట్టుకు లోతుగా పోషణ అందించి జుట్టుని సంరక్షిస్తుంది. కొబ్బరి నూనెను కొంచెం వేడి చేసి తల మీద రాసి మసాజ్ చేయాలి. ఈ విధంగా చేయుట వలన జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా మారుతుంది.



Click it and Unblock the Notifications