Latest Updates
-
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే!
చిన్నవయస్సు లోనే హెయిర్ ఫాల్..బట్టతలకు షాకింగ్ రీజన్స్...
బట్టతల లేదా జట్టు రాలిపోవడం ప్రస్తుత ఆధునిక జన జీవన సమస్య. ఉరుకులు పరుగులతో కూడిన జీవనశైలిలో ఇటు విద్యార్థులు, అటు ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇలా ఎవరైనా సరే ఒత్తిడికి లోనుకాని వారుండరు. ఒకప్పుడు నడి వయసు వ్యక్తులకు బట్టతల వచ్చేది. అది వంశపారంపర్యంగా వచ్చేదని సరిపెట్టుకునేవారు. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. పాతికేళ్ల యువతీ యువకులు కూడా బట్టతల, జుట్టురాలిపోవడం లాంటి సమస్యలతో ఆందోళన చెందుతున్నారు.
జుట్టు రాలడానికి కారణాలు అనేకం. కొన్ని వందల్లోనే చెప్పొచ్చు. ఒక స్థాయిలో జుట్టు రాలటం అందరిలోనూ సహజంగా జరిగేదే. అయితే కొంతమందిలో మాత్రం అసాధారణ స్థాయిలో వెంట్రుకలు ఊడిపోతుంటాయి. ఏది సాధారణం, ఏది అసాధారణం అనేది తెలుసుకోవటం అవసరం. వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, పడీపడని కాస్మొటిక్స్..... అన్నింటి ఫలితం జుట్టు రాలిపోవడం. ఇప్పుడు అందరినీ విపరీతంగా వేధిస్తున్న సమస్య.
దీని నివారణ కోసం అందరూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ఫలితాలే అందరికీ ఒకేవిధంగా అందవు. అసలు జుట్టు రాలిపోవడానికి గల అసలు కారణాలు తెలుసుకోవాలి. జుట్టు రాలడానికి రెగ్యులర్ గా కొన్ని సహజకారాణాలుంటే..మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకర కారణాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం...

హెరిడిటి:
25ఏళ్ళలోపు ఉన్న వారిలో జుట్టు ఎక్కువగా రాలుతుంటే అది జన్యుపరమైన సమస్యలు అయ్యుండవచ్చు. అయితే ఈ సమస్య చాలా రేర్ గా ఉంటుంది. 1-50లో మాత్రమే కనుగొనవచ్చు.కుటుంబంలో బట్టతల ఉంటె, మీరు ఏమి చేసినా దీనిని చక్కదిద్దలేరు. మీరు సరైన ఆహరం, జీవనశైలిని అనుసరించడం ద్వారా ఎక్కువ జుట్టును కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించవచ్చు, కొన్ని పనులు చేయకపోవడం వల్ల కూడా వేగంగా జుట్టు రాలడానికి దోహదపడుతుంది.

ఫాస్ట్‌ఫుడ్ నూడుల్స్, పిజ్జా, బర్గర్...
కంపూటర్ల ముందు ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం: కంప్యూటర్‌తో సహ జీవనం, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఫాస్ట్‌ఫుడ్ నూడుల్స్, పిజ్జా, బర్గర్... ఇలా నూనెలో వేయించిన పదార్థాలు ఎక్కువగా తినడం, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు, ఖర్జూరం తదితర పౌష్టికాహారం తగ్గించుకోవడంతో శరీరానికి తగినంత పోషక ఆహారం లభించడం లేదు. ఈ పోషకాహారలోపానికి మరోవైపు మానసిక ఒత్తిడి తోడవడంతో ఆరోగ్యం దెబ్బతిని జుట్టురాలిపోవడం, బట్టతల రావడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

రేడియేషన్ ప్రభావంతో జుట్టురాలిపోయే అవకాశం
ఆధునిక యువతలో కంప్యూటర్ల ముందు కూర్చుని ఉద్యోగాలు చేసే వారే ఎక్కువ ఉన్నారు. రేడియేషన్ ప్రభావంతో జుట్టురాలిపోయే అవకాశం ఉందని కొందరంటున్నారు. చిన్న వయసులోనే యువతీ, యువకులలో విపరీతమైన ఆందోళన చోటు చేసుకుంటోంది.మరి రాలిపోయిన జుట్టును తిరిగి తలపైకి తెచ్చుకోగలగడం సాధ్యమా? అవును.

హార్మోన్ లోపం..
హైపోథైరాయిడిజం, రక్తాల్పత.. ఇనుము, విటమిన్ బి12 లోపం, ఇన్‌ఫెక్షన్, డైటింగ్ , ఒత్తిడి , హార్మోన్ల అసమతుల్యం వల్ల , పోశాకాహారలోపము వల్ల ఎక్కువగా జుట్టు ఊడిపోతూ ఉంటంది .హార్మోనుల అసమతుల్యత వల్ల జీవక్రియలు దెబ్బతినడంతో పాటు, జుట్టుకూడా ఎక్కువగా రాలుతుంది. 25ఏళ్ళలోపు ఎక్కువ జుట్టు రాలుతున్నట్లైతే అందుకు హార్మోనులు కూడా ప్రధాణ కారణం. జుట్టు రాలడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం.

రక్తహీనత:
ఐరన్ లోపం అనేక ఆరోగ్య ప్రయోజనాలకు దారితీస్తుంది. . శరీరంలో ఐరన్ తక్కువైనప్పుడు, శరీరం చాలా డిఫరెంట్ గా పనిచేస్తుంది. జుట్టు రాలడం మాత్రమే కాదు, చర్మం పెళుసుగా మారుతుంది, బలహీనత మరియు తలనొప్పి మరికొన్ని లక్షణాలు కనబడుతాయి.

సెడన్ గా బరువు తగ్గుటం వల్ల:
రెగ్యులర్ డైట్ తో పాటు కొన్ని ఎఫెక్టివ్ వ్యాయామాలు చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . ముఖ్యంగా హెయిర్ ఫాల్ ఉండదు. అయితే చాలా మంది ఈ విషయాన్ని నమ్మరు. 25ఏళ్ళ లోపు బరువు తగ్గడం వల్ల జుట్టును కోల్పోతారు.

స్ట్రెస్ :
ఒత్తిడి ఒత్తిడి సైలెంట్ కిల్లర్. 25ఏళ్ళలోపు జుట్టు రాలిపోవడానికి ముఖ్య కారణం ఒత్తిడి. ఒత్తిడి వల్ల ప్రతి ఒక్క యవ్వనస్తుల్లో టాలోజెన్ ఎఫ్ల్యువిమ్ అనే ఎంజైమ్ జుట్టు రాలడానికి కారణం అవుతుంది. కాబట్టి ఒత్తిడి పెంచుకోకుండా... ప్రశాంతంగా జీవించాలి.

విటమిన్ ఎ :
ఎప్పుడైతే శరీరంలో విటమిన్స్ తక్కువైతాయో అప్పుడు శరీరంలో కనిపించే ఒకటి రెండు లక్షణాలు జుట్టు రాలడానికి ముఖ్య కారణాలు. 25ఏళ్ళలోపు అకస్మాత్తుగా ఎక్కువ జుట్టు రాలుతున్నట్లైతే . ఖచ్చితంగా విటమిన్ టెస్ట్ చేయించుకోవాలి.

ప్రోటీన్ల లోపం:
ప్రోటీన్లు మన శరరీంను ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. మీ శరీరంలో ప్రోటీన్ల లోపం ఉంటుంది. క్రమంగా హెయిర్ ఫాల్ పెరుగుతుంది. కాబట్టి, డైలీ డైట్ ద్వారా ప్రోటీన్లను శరీరానికి అందివ్వడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు

ఆటో ఇమ్యూన్ కండీషన్ వల్ల :
మన రోగనిరోధకశక్తే మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే జబ్బులను ఆటోఇమ్యూన్ జబ్బులుగా పేర్కొంటుంటారు. ఉదా: పేనుకొరుకుడు (అలొపేషియా ఏరేటా) వల్ల మాడు, కనుబొమలు, మీసం, గడ్డం, శరీరంలో ఏభాగంలోనైనా వెంట్రుకలన్నీ రాలిపోయి ప్యాచ్‌లుగా కనిపిస్తుంటాయి. లెకైన్ ప్లానస్ వల్ల జుట్టు శాశ్వతంగా ఊడిపోయే అవకాశం ఉంది. లూపస్ అనే కండిషన్ వల్ల కూడా శాశ్వతంగా జుట్టు రాలిపోవచ్చు.

ట్యూమాటిక్ ఈవెంట్స్ :
యాక్సిడెంట్స్, అత్యంత ఆప్తులను కోల్పోయినప్పుడు, ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ ఒత్తిడికి గురి అవుతారు. ఎక్కువ రోజులు డిప్రెషన్ వల్ల హెయిర్ ఫాల్ కు కారణమువుతుంది.

ఎక్కువ రోజులు జ్వరం వస్తే:
టైఫాయిడ్, మలేరియా లేదా వైరల్ ఫ్లూ వంటి జ్వరాల భారిన పడినప్పుడు, వీటి నుండి బయట పడటానికి కనీసం 15 రోజుల పైనే పడుతుంది. హెయిర్ ఫాల్ కు ఇది కూడా ఒక షాకింగ్ రీజన్ కావచ్చు.

బర్త్ కంట్రోల్ పిల్స్ :
ప్రస్తుత కాలంలో బర్త్ కంట్రోల్ పిల్స్ ను వినియోగించడం ఎక్కవైనది. బర్త్ కంట్రోల్ పిల్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల , శరీరంలో హార్మోనుల్లో అసమతుల్యతలు ఏర్పడుతాయి. ఫలితంగా జుట్టు రాలడానికి కారణమవుతుంది.

హెల్మెట్స్:
హెల్మెట్స్ అనేవి బైక్ డ్రైవింగ్ లో ఎక్కుగా వినియోగించేటివి. బైక్ మీద ప్రయాణం చేసే వాళ్లు భద్రత కోసం ఎక్కువగా వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే శరీరానికి ఎంత భద్రత అయినా తలకు మాత్రం ఒక రకంగా హానే జరుగుతుంది. అదెలా అంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది. హెల్మెట్స్ ను ఎక్కువ సేపు పెట్టుకొని ప్రయాణం చేయడం వల్ల తలలో చెమట ఎక్కువగా పట్టి, కురుల యొక్క మూలాలు బలహీన పడేలా చేస్తుంది. అందు వల్లనే అతి చిన్న వయస్సులో ఉన్నవారిలో కూడా జుట్టు రాలడం కనిపిస్తుంటుంది. ముఖ్యంగా ప్రతి రోజూ ఎక్కువ దూరం ప్రయానించే వారిలో మాత్రమే ఇటువంటి సమస్య ఎక్కువగా ఉంటుంది.

మరి వేడిగా ఉండే నీటితో తలస్నానం చేయడం వల్ల :
స్నానానికి వేడినీటిని ఉపయోగించడం కంటే చల్లటి నీటితో స్నానం చేయడం చాలా ఉత్తమమని చాలా మంది సౌందర్య నిపుణల పరిశోదన ద్వారా తెలుపబడినది. అయితే కొంత మంది నిపుణులు మాత్రం దీనిని వ్యతిరేకించారు. వేడినీళ్లతో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు డ్యామేజ్ అవ్వతుంది. ఎక్కువ వేడిగా ఉన్న నీళ్ళను తలకు పోసుకోవడం వల్ల తల వెంట్రుకులకు సంబంధించిన ఫోలీ సెల్స్ తెరుచుకోవడంతో తలవెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంది.

హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్:
వెంట్రుకల శైలిని మార్చే పరికరాలు: తల స్నానం చేసిన తరువాత బ్లో తో పొడిబారేటట్లు చేయడం తేలిక, సరైన పద్ధతి కాదు, కానీ అనేక అధ్యయనాలు ప్రతిరోజూ జుట్టుని బ్లోతో పొడిబారేటట్లు చేస్తే జుట్టు రాలడానికి దోహదపడుతుందని సూచించాయి. స్త్రైట్నింగ్, కర్లింగ్ వంటి ఇతర స్టైలింగ్ చికిత్సలు తరచుగా చేస్తే, మీ జుట్టుదువ్వే దువ్వేనపై కొన్ని అదనపు వెంట్రుకలు పోగవుతాయి.

ఎయిర్ కండీషనర్స్:
మీ కార్యాలయంలో, మీ ఇంటిలో ఉండే ఎయిర్ కండిషనర్ సౌకర్యవంతమైనది, అనుకూలమైనది, అనుకూలమైన విధంగా ఉంటుంది, కానీ అది మీ జుట్టుకు సరైనది కాదు. పెళుసైన, నష్టపోయే అవకాశం ఉండడంతో జుట్టు ఏ వాతావరణ మర్పులకైన తీవ్రంగా స్పందిస్తుంది. మీ జుట్టు రాలిపోకుండా ఉండడానికి ఇటువంటి పరిస్థితులను నివారిచడమే మంచి మార్గం.

మందులు, చికిత్సలు:
మానసిక నొప్పిని, గాయాన్ని కలుగచేసే ఒక ప్రమాదకరమైన సంఘటన జీవితంలో తీవ్రమైన మార్పును తెస్తుంది. చికిత్సలను, మందులను అనుసరించడం వల్ల మాత్రమె మీ ఊడిపోయే జుట్టును ఆరోగ్యంగా ఉంచవచ్చు. కొన్ని మందులను, అధిక మోతాదులో (కీమోతేరపీ వలె) ఉపయోగించడం వల్ల అధికంగా జుట్టు రాలడం, బట్టతల వచ్చే ప్రమాదం ఉంది.



Click it and Unblock the Notifications











