Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
రాత్రికి రాత్రి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసే హోం మేడ్ ట్రీట్మెంట్....
సహజంగా హెయిర్ ఫాల్ సమస్యలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యను తప్పనిసరిగా ఫేస్ చేయాల్సిందే. అయితే కొంత మందిలో హెయిర్ ఫాల్ గుర్తించలేనంత తక్కువగా ఉంటే, మరికొంత మంది ఆందోళన కలిగించేటంత ఎక్కువ హెయిర్ ఫాల్ కనిపిస్తుంది . హెయిర్ ఫాల్ తక్కువైనా, ఎక్కువైనా అది మనిషి బహిర్గత అందాన్ని దెబ్బతీస్తుంది . కాన్పిడెన్స్ లెవల్స్ ను తగ్గిస్తుంది.
హెయిర్ ఫాల్ సమస్య స్రీ, పురుషుల్లో కామన్ గా ఉండే సమస్య. ఈ హెయిర్ సమస్యలకు జీన్స్, హార్మోన్స్, డైట్, కాలుష్యం వంటివి హెయిర్ ఫాల్ కు కారణమవుతాయి. హెయిర్ ఫాల్ సమస్యకు కారణమేదైనా, తగ్గించుకోవడానికి కొన్ని సింపుల్ మార్గాలున్నాయి. హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించుకోవడానికి చౌకన మార్గం హోం రెమెడీ.
హెయిర్ ఫాల్ తగ్గించే హోం రెమెడీస్ కోసం రెండు రిమార్కబుల్ నేచురల్ పదార్థాలను ఉపయోగించి తయారుచేసుకోవాలి. వాటిలో ఒకటి ఉల్లి రసం, రెండు తేనె.

హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించడంలో ఉల్లిపాయ రసం పర్టిక్యులర్ గా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉల్లి రసంలో సల్ఫర్ కాంపౌండ్స్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . ముఖ్యంగా ఉల్లిపాయలో ఉండే ఇతర కాంపోనెంట్స్ హెయిర్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.
ముఖ్యంగా, ఉల్లి రసంను తేనెతో మిక్స్ చేసినప్పుడు ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ హెయిర్ ప్యాక్ ఏం చేస్తుందంటే హెయిర్ ప్యాక్ తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సమిస్తుంది. జుట్టును సాప్ట్ గా మరియు స్మూత్ గా మార్చుతుంది.

ఇంకా ఇందులో ల్యావెండర్ ఆయిల్ మిక్స్ చేయడం వల్ల, ఉల్లిపాయరసంలోని ఘాటైన వాసన తగ్గిస్తుంది. జుట్టును మరింత సాప్ట్ గా మరియు సిల్కీగా మార్చుతుంది.
హెయిర్ ఫాల్ తగ్గించే హెయిర్ ఫ్యాక్ తయారీకి కావల్సిన పదార్థాలు:
తేనె: 2టీస్పూన్లు
ల్యావెండర్ ఆయిల్:

ఎలా ఉపయోగించాలి:
మొదట, ఉల్లిపాయకు పొట్టు తొలగించి , చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత జ్యూసర్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసి, రసం తియ్యాలి. ఈ రసంలో తేనె మరియు ల్యావెండర్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని తలకు మరియు కేశాలకు పూర్తిగా పట్టించాలి. తర్వాత షవర్ క్యాప్ పెట్టేసుకుని, రాత్రంతా అలాగే ఉండనివ్వాలి. తర్వాతి రోజు ఉదయం షాంపు మరియు కండీషనర్ తో తలస్నానం చేయాలి.
ఒక వేళ ఈ హెయిర్ ప్యాక్ ను రాత్రుల్లో ఉంచుకోవడానికి మీరు ఇష్టపడనట్లైతే , తలస్నానం చెయ్యడానికి 1 లేదా 2గంటల ముందుగా తలకు అప్లై చేసి తర్వాత తలస్నానం చేసుకోవచ్చు.

మొదట ఈ హెయిర్ ప్యాక్ ఎలా రియాక్ట్ అవుతుందో గమనించాలి. తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు లేకుంటే, వారంలో రెండు సార్లు ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవచ్చు. రాత్రంతా ఈ ప్యాక్ ఉంచుకోవడం వల్ల ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. మంచి ఫలితాన్ని అందిస్తుంది,
ఈ సింపుల్ హో మేడ్ హెయిర్ ప్యాక్ తో జుట్టు రాలే సమస్యలను తగ్గించుకొని, అవుటర్ అప్పియరెన్స్ ను గ్రేట్ గా మెరుగుపరుచుకోండి....



Click it and Unblock the Notifications