For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుకి, చర్మానికి పెరుగు అప్లై చేయడం వల్ల కలిగే అమేజింగ్ బెన్ఫిట్స్..!!

పెరుగులో చర్మానికి, జుట్టుకి ప్రయోజనం కలిగించే అనేక బెన్ఫిట్స్ దాగున్నాయి. చాలామంది జుట్టుకి పెరుగు అప్లై చేస్తారు.

By Swathi
|

పెరుగు తినడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు నివారించడానికి సహాయపడుతుంది. అలాగే పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి పెరుగు తినడం చాలా అవసరం. అయితే పెరుగులో అనేక బ్యూటి బెన్ఫిట్స్ దాగున్నాయని చాలామందికి తెలియదు. పెరుగులో చర్మానికి, జుట్టుకి ప్రయోజనం కలిగించే అనేక బెన్ఫిట్స్ దాగున్నాయి.

పెరుగుని చర్మానికి అప్లై చేయడం వల్ల మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. నిగారింపు తీసుకొస్తుంది. కాబట్టి ఎలాంటి కెమికల్స్ లేకుండా పెరుగుతో గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. అయితే చర్మానికి, జుట్టుకి పెరుగుని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్

పెరుగుని చర్మానికి మాయిశ్చరైజర్ గా ఉపయోగించవచ్చు. 4 స్పూన్ల పెరుగు తీసుకుని, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ కొకో పౌడర్ మిక్స్ చేయాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.

యాంటీ ఏజింగ్

యాంటీ ఏజింగ్

పెరుగుని ప్రతిరోజూ కూడా చర్మానికి ఉపయోగించవచ్చు. ఇందులో యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. 2 నుంచి 4 స్పూన్ల పెరుగు, కొద్దిగా ఓట్స్ తీసుకోవాలి. ఒక స్పూన్ నిమ్మరసం, తేనె కూడా అందులో మిక్స్ చేయాలి. అన్నింటినీ బాగా కలిపి.. ముఖానికి పట్టించాలి. బాగా స్క్రబ్ చేసుకోవాలి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్.. ఎక్స్ ఫోలియేటర్ లా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది.

పిగ్మెంటేషన్

పిగ్మెంటేషన్

దీర్ఘకాలంగా మొటిమలు ఉంటే.. అది హైపర్ పిగ్మెంటేషన్ గా మారుతుంది. దీన్ని నివారించి.. గ్లోయింగ్ స్కిన్ పొందడానికి పెరుగు సహాయపడుతుంది. 1స్పూన్ పెరుగు, అరస్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పెరుగులో ఎక్కువ లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల పిగ్మెంటేషన్ ని తొలగిస్తుంది.

జుట్టుకి కండిషనర్

జుట్టుకి కండిషనర్

పెరుగు జుట్టుకి న్యాచురల్ కండిషనర్ లా సహాయపడుతుంది. జుట్టుకి పెరుగు అప్లై చేసి.. షవర్ క్యాప్ పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. లేదా 6 స్పూన్ల పెరుగులో కొద్దిగా కొబ్బరినూనె, అలోవెరా జెల్ కలిపి పట్టించుకోవాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. తర్వాత జుట్టుకి అప్లై చేసి.. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

జుట్టు రాలడం

జుట్టు రాలడం

జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా పెరుగు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అరకప్పు పెరుగు, రెండు మూడు స్పూన్ల మెంతి పొడి కలపాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి తలకు పట్టించుకుంటే.. జుట్టు రాలడం చాలా ఎఫెక్టివ్ గా తగ్గుతుంది.

చుండ్రు నివారించడానికి

చుండ్రు నివారించడానికి

పెరుగులో నిమ్మరసం కలిపి స్కాల్ప్ కి పట్టించి.. శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ని వారానికి రెండుసార్లు అప్లై చేస్తే.. చుండ్రు తగ్గిపోతుంది.

సాఫ్ట్ అండ్ స్మూత్ హెయిర్

సాఫ్ట్ అండ్ స్మూత్ హెయిర్

పెరుగులో కొద్దిగా తేనె కలిపి.. జుట్టుకి అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. మీ జుట్టు చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా మారుతుంది.

English summary

Super-Effective Ways To Use Curd On Skin & Hair!

Super-Effective Ways To Use Curd On Skin & Hair. Here are ways how you could use curd for skin and hair, check them out!
Desktop Bottom Promotion