For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బట్టతల, తెల్లజుట్టు సమస్యలను నివారించే టెస్టెడ్ రెమిడీస్..!!

తలపై జుట్టు తగ్గినా, తెల్ల వెంట్రుకల సంఖ్య పెరిగినా.. మీకు వయసు పెరిగిందన్న అంచనా పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలకు కెమికల్స్ ఉండే బ్యూటి ప్రొడక్ట్స్ ఉపయోగిస్తే.. మీ జుట్టు మరింత డ్యామేజ అవుతుంది.

By Swathi
|

బట్టతల, జుట్టు రాలడం, తలల ప్యాచ్ లు ఏర్పడటం వంటి రకరకాల జుట్టు సమస్యలు.. నలుగురిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందిపెడతాయి. మీరు బాగా కనిపించాలి అనుకున్నప్పుడు, డ్రెస్ కి తగ్గట్టు హెయిర్ స్టైల్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు.. ఈ జుట్టు సమస్యలు చాలా ఇబ్బందిపెడతాయి.

baldhead and greyhair

తలపై జుట్టు తగ్గినా, తెల్ల వెంట్రుకల సంఖ్య పెరిగినా.. మీకు వయసు పెరిగిందన్న అంచనా పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలకు కెమికల్స్ ఉండే బ్యూటి ప్రొడక్ట్స్ ఉపయోగిస్తే.. మీ జుట్టు మరింత డ్యామేజ్ అవుతుంది. కాబట్టి న్యాచురల్ రెమిడీస్ ప్రయత్నించడం మంచిది.

ఇప్పుడు చెప్పబోయేవి.. సింపుల్ హోం రెమిడీస్ మాత్రమే కాదు.. ఆయుర్వేదంలోని సీక్రెట్స్. ఇవి నిరూపితమైన, మంచి ఫలితాలు అందించిన.. టెస్టెడ్ రెమిడీస్. మరి.. తెల్లజుట్టుని, బట్టతలను నివారించే టెస్టెడ్ రెమిడీస్ ఇప్పుడే ట్రై చేయండి.

ఎగ్, ఉల్లిపాయ

ఎగ్, ఉల్లిపాయ

రెండు స్పూన్ల ఉల్లిరసం, ఒక ఎగ్ వైట్ కలిపి మిక్స్ చేయాలి. రెండింటినీ కలిపి.. స్కాల్ప్ కి మసాజ్ చేయాలి. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ని అప్లై చేస్తే.. జుట్టు రాలడాన్ని నివారించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

2స్పూన్ల వెల్లుల్లి పేస్ట్ ని.. స్కాల్ప్ కి పట్టించి.. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

టమోటా

టమోటా

ఒక స్పూన్ టమోటా జ్యూస్, పొటాటో జ్యూస్, తేనె కలిపి.. స్కాల్ప్ కి మసాజ్ చేయాలి. ఈ ప్యాక్ అప్లై చేస్తూ ఉంటే.. జుట్టు రాలడాన్ని అరికట్టి.. కొత్త జుట్టు ఏర్పడటానికి సహాయపడుతుంది.

కరివేపాకు

కరివేపాకు

పావు కప్పు ఆల్మండ్ ఆయిల్, ఆవ నూనె, కరివేపాకు పొడి తీసుకుని అన్నింటిని మిక్స్ చేసి వేడిచేయాలి. ఈ మిశ్రమాన్ని పట్టించాలి. రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయాలి. ఈ ప్యాక్ ని రెగ్యులర్ గా ఫాలో అవడం వల్ల ఇందులో ఉండే ప్రొటీన్, కరివేపాకు తెల్లజుట్టుని నివారిస్తుంది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

3 నుంచి 4 స్పూన్ల ఆలివ్ ఆయిల్ ని గోరువెచ్చగా చేసి స్కాల్ప్ కి పట్టించాలి. టవల్ ని గోరువెచ్చని నీటిలో ముంచి.. తలకు చుట్టుకోవాలి. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇందులో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉండటం వల్ల.. జుట్టు చిట్లిపోవడాన్ని, రాలడాన్ని అరికడుతుంది.

అలోవెరా

అలోవెరా

ఒక స్పూన్ అలోవెరా జెల్ ని స్కాల్ప్ కి ప్రతిరోజూ పట్టించాలి. గంత తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే ప్రొటియోలిటిక్ ఎంజైమ్స్.. డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించి.. జుట్టు పెరుగుదలను ప్రమోట్ చేస్తాయి. గ్రేట్ కండిషనర్ లా పనిచేస్తుంది.

బంగాళదుంప

బంగాళదుంప

బంగాళదుంప రసం తీసి.. స్కాల్ప్ కి, జుట్టుకి పట్టించాలి. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ అప్లై చేస్తే.. జుట్టు పెరుగుతుంది. బట్టతలను అడ్డుకుని, జుట్టు డ్రైగా మారకుండా.. కాపాడుతుంది.

English summary

Tested Remedies to Premature Hair Greying and Preventing Bald Head

Tested Remedies to Premature Hair Greying and Preventing Bald Head. From Premature Hair Greying To Preventing Bald Spots, These Unusual Remedies Will Sort Your 'Head' Out.
Story first published: Friday, October 28, 2016, 15:53 [IST]
Desktop Bottom Promotion