Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హెయిర్ బ్రేకేజ్-హెయిర్ డ్యామేజ్ కు గుడ్ బై చెప్పేహోం రెమెడీస్
సాధారణ జుట్టు సమస్యల్లో హెయిర్ బ్రేకేజ్ కూడా ఒక సమస్య . ఇది స్త్రీ, పురుషులు ఎదుర్కొనే చాలా సహజ సమస్య. మనం గమనించినట్లైతే చాలా మంది ఇలా హెయిర్ ఫాల్ గురించి, జుట్టు సమస్యల గురించి ఒకరితో ఒకరు చర్చించుకోవడం చూస్తేనే ఉంటాము . ఈ జుట్టు సమస్యల నివారణకోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ, టైమ్ వేస్ట్ చేస్తుంటారు. కానీ ఫలితం మాత్రం ఉండదు .
అయితే ఇలా బయట టైమ్ వేస్ట్ మరియు డబ్బు ఖర్చు చేయడం కంటే కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల హెయిర్ బ్రేకేజ్ ను నివారించుకోవచ్చు...మరి ఇంట్లోనే హెయిర్ బ్రేకేజ్ ను నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఏంటో చూద్దాం...

1. ఆలివ్ ఆయిల్:
సహజంగా హెయిర్ బ్రేకేజ్ డ్రైహెయిర్ లేదా చిక్కుబడిన చుట్టున్న వారిలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ సమస్యకు గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ డీప్ కండీషనర్ గా పనిచేస్తుంది. జుట్టు మొదళ్ల నుండి స్ట్రాంగ్ గా మార్చి, స్మూత్ గా సాఫ్ట్ గా మరియు సిల్కీగా కనబడేలా చేస్తుంది . అంతే కాదు హెయిర్ బ్రేకేజ్ పూర్తిగా అరికడుతుంది . కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను గోరువెచ్చగా చేసి చేతి వేళ్ళతో తలకు మసాజ్ చేయాలి . గంట తర్వాత తలస్నానం చేయాలి.

2. బీర్:
మన జుట్టుకు బీర్ చాలా మేలు చేస్తుందని చెబుతారు. తలకు నూనె వలె బీర్ ను కూడా పట్టించి సున్నితమైన మసాజ్ చేయాలి. బీర్ లో జుట్టు మొత్తం తడి అయ్యి నానే విధంగా చూడాలి. 15నిముషాల తర్వాత , షాంపు పెట్టకుండా తలకు స్నానం చేయాలి . ఇలా చేయడం వల్ల కేశాలు స్ట్రాంగ్ గా మారుతాయి మరియు సాప్ట్ గా మరియు షైనీగా కనబడుతాయి.

3. గుడ్డు పచ్చసొన:
వారానికొకసారి గుడ్డులోని పచ్చసొన అప్లై చేయడం వల్ల కొన్ని వండర్స్ జరుగుతాయి . గుడ్డులోని పచ్చసొన బాగా గిలకొట్టి, అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిన్స్ చేసి , తడి జుట్టుకు అప్లై చేయాలి . ఇలా చేయడం వల్ల జుట్టు బ్రేక్ అవ్వకుండా స్ట్రాంగ్ గా మారడమే కాదు, మంచి షైనింగ్ తో స్మూత్ గా మిమ్మల్ని ఆనందపరుస్తాయి.

4. మయోనైజ్:
హెయిర్ బ్రేకేజ్ ను అరకట్టడంలో మయోనైజ్ కూడా ఒకటి. వారంలో ఒకసారి మయోనైజ్ ను జుట్టుకు పట్టించడంల్ల జుట్టు స్ట్రాంగ్ గా మరియు సాప్ట్ గా మారుతుంది. తలకు అప్లై చేసిన అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి . మయోనైజ్ జుట్టుకు కావల్సిన కండీషన్ అందివ్వడంతో పాటు జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది . దాంతో హెయిర్ బ్రేక్ తగ్గుతుంది.

5. జుట్టుకు తరచూ నూనె అప్లై చేయాలి:
సాధ్యమైనంత వరకూ తలకు నూనె అప్లై చేయడం మంచిది . బయట వెళ్ళే ముందు తలస్నానం చేస్తే సరిపోతుంది . నూనెను కొద్దిగా వేడి చేసి తల నుండి కుదుళ్ల చివర్ల వరకూ నూనె అప్లై చేసి, తర్వాత గోరువెచ్చని నీటిలో డిప్ చేసిన టవల్ ను తలకు చుట్టాలి . ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ బ్రేకేజ్ తగ్గుతుంది మరియు అందుకు కొబ్బరి నూనె చాలా మంచిది.

6. విటమిన్ ఇ:
డ్రైస్కిన్ కు ఒక వండర్ రెమెడీ విటమిన్ ఇ, అదే విధంగా గ్రేట్ హెయిర్ టానిక్ కూడా . విటమిన్ ఇ హెయిర్ బ్రేకేజ్ ను తగ్గిస్తుంది . 5-6 విటమిన్ ఇ క్యాప్యూసూల్స్ ను బ్రేక్ చేసి వాటిని షాంపులో వేసి జుట్టుకు పట్టించి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ బ్రేకేజ్ తగ్గుతుంది .జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

7. ప్రోటీన్ సప్లిమెంట్:
మరో మంచి ఉపాయం ప్రోటీన్ సప్లిమెంట్ ను తీసుకోవడం వల్ల జుట్టును బలోపేతం చేస్తుంది . కెమికల్స్ వల్ల హెయిర్ బ్రేకేజ్ అవుతుంటే ప్రోటీన్ సప్లిమెంట్ మంచి కండీషనర్ గా పనిచేస్తాయి. దాంతో హెయిర్ బ్రేకేజ్ కాకుండా నివారించుకోవచ్చు.

8. తడిజుట్టును బ్రష్ చేయకూడదు:
తడిగా ఉన్న జుట్టును దువ్వడం లేదా బ్రష్ చేయడం వల్ల డ్యామేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. జుట్టు డ్రై అయిన తర్వాత బ్రష్ చేయాలి.

9. నో హీట్ :
హీట్ వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది. జుట్టుకు డ్రైయ్యర్ ఉపయోగించడం వల్ల , హీట్ వల్ల జుట్టు బ్రేకేజ్ అవుతుంది. కాబట్టి, ప్రతి సారి మీ జుట్టును దువ్వెనతో లేదా బ్రష్ తో మ్యానేజ్ చేయాలి . జుట్టు కర్లింగ్ చేయడానికి ఐరన్, బ్లో డ్రయ్యర్స్ మరియు ఇతర ట్రీట్మెంట్ వల్ల మీ జుట్టు డ్యామేజ్ అవుతుంది. కాబట్టి జుట్టును నేచురల్ తడి ఆర్పుకోవాలి.

10. హెయిర్ టచ్ అప్స్:
జుట్టుకు హెన్నా మరియు ఇతర నేచురల్ హెయిర్ కలరింగ్ ఏజెంట్స్ ను ఉపయోగించాలి. ప్రతి 8 వారాలకొకసారి హయిర్ టచ్ అప్స్ చేయడం మంచిది.



Click it and Unblock the Notifications