For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే అమేజింగ్ అండ్ హెల్తీ జ్యూసెస్

|

మీకు తెలుసా తాజాగా ఉండే వెజిటేబుల్స్, ఫ్రూట్ జ్యూస్ లు హెయిర్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతాయి.?ఖచ్చితంగా అవుననే అంటున్నారు పోషకాహార, మరియు బ్యూటీ నిపుణులు. రెగ్యులర్ డైట్ లో ఫ్రెష్ జ్యూస్ లను చేర్చుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది .

ఫ్రెష్ గా ఉండే వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్ జ్యూస్ లతో వెలకట్టలేని న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కేవలం బాడీ హెల్త్ కు మాత్రమే కాదు, బ్యూటీ విషయంలో కూడా అమేజింగ్ బెనిఫిట్స్ ను అందిస్తుంది. ముఖ్యంగా జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది . హెయిర్ బ్రేక్ కాకుండా హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది .

ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ ద్వారా పొందే న్యూట్రీషియన్స్ నేరుగా..త్వరగా శరీరం గ్రహించడం వల్ల ఫలితం మరింత జుట్టు పెరుగుదల ఫాస్ట్ గా ఉంటుంది . ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన జ్యూస్ లు రెగ్యులర్ బేస్ లో తీసుకోవడం వల్ల , హెయిర్ ఫాల్ మరియు జుట్టు పల్చబడటం, జుట్టు సమస్యలన్నీనివారించుకోవచ్చు. మరి జుట్టు పెరుగుదలకు కొన్ని ఎఫెక్టి జ్యూస్ లు ఈ క్రింది విధంగా ....

 అలోవెర జ్యూస్ :

అలోవెర జ్యూస్ :

అలోవెర జ్యూస్ జుట్టు రాలడం నివారిస్తుంది. కలబందలో ఉండే విటమిన్స్ హెయిర్ స్ట్రాంగ్ గా మార్చతుంది. బ్రేక అవ్వకుండా స్ట్రాంగ్ అండ్ హెల్తీగా మార్చే ఎంజైమ్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి . ఇది జుట్టుకు పోషణ మరియు తేమను అందిస్తుంది. అలోవెర చుండ్రును నివారిస్తుంది. దురద వంటి లక్షణాలను పోగొడుతుంది.

కివి ఫ్రూట్ జ్యూస్:

కివి ఫ్రూట్ జ్యూస్:

కివి ఫ్రూట్ జ్యూస్ లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది . ఇది హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది . విటమిన్ ఇ రెగ్యురల్ గా మన శరీరానికి అందడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది. స్ట్రాంగ్ ఇమ్యూనిటి వల్ల హెయిర్ ఫాల్ తగ్గించవచ్చు. ఇది క్లెన్సింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

ఉల్లిపాయ రసం:

ఉల్లిపాయ రసం:

జుట్టు ఆరోగ్యానికి ఉల్లిపాయ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుందన్న విషయం మీకు తెలిసిందే . ఇది నేరుగా జుట్టుకు అప్లై చేయడం వల్ల వైట్ హెయిర్ నివారించబడుతుంది. ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉండటం వల్ల జుట్టుకు అవసరమయ్యే న్యూట్రీషియన్స్ అందుతాయి. ఇవి పాలీసెల్స్ ను గ్రేట్ గా సహాయపడుతుంది .

స్పినాచ్ జ్యూస్:

స్పినాచ్ జ్యూస్:

స్పినాచ్ జ్యూస్ లో వివిధ రకాల విటమిన్స్, మినిరల్స్, ఐరన్ అధికంగా ఉన్నాయి . ఇవన్నీ కూడాజుట్టు పెరుగుదలకు అత్యంత అవసరం.. జుట్టు రాలడం నివారిస్తాయి మరియు తలలో ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది . స్పినాచ్ లో ఉండే విటమిన్ బి జుట్టుకు మంచి షైనింగ్ ఇస్తుంది. మరియు జుట్టు పెరిగేలా చేస్తుంది.

జామకాయ జ్యూస్:

జామకాయ జ్యూస్:

జామకాయ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . వివిధ రకాల న్యూట్రీషియన్స్ క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్ వంటివి జుట్టు పెరుగుదలకు అత్యవసరమైనవి. కాబట్టి జామకాయను జ్యూస్ రూపంలో లేదా పచ్చివి అలాగే తినవచ్చు .

గార్లిక్ జ్యూస్ :

గార్లిక్ జ్యూస్ :

పురాతన కాలం నుండి వెల్లులిని ఔషధంగాను, సౌందర్య సాధనంగాను ఉపయోగిస్తున్నారు. ఇది హెయిర్ క్వాలిటి పెంచుతుంది మరియు హెయిర్ ఫోలి సెల్స్ కు పోషణ అందిస్తుంది. గార్లిక్ జ్యూస్ జుట్టుకు పట్టించడం వల్ల తలలో రక్తప్రసరణ పెరిగి, జుట్టు పెరుగుతుంది. జుట్టు ప్రకాశవంతంగా మరియు స్మూత్ గా మారుతుంది.

 కుకుంబర్ జ్యూస్ :

కుకుంబర్ జ్యూస్ :

కుకుంబర్ జ్యూస్ హెయిర్ క్వాలిటీ పెంచుతుంది. హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది,.. కుకుంబర్ లో ఉండే ఎంజైమ్స్ జుట్టు రాలడం నివారించి , హీమోగ్లోబిన్ పెంచుతుంది. హెయిర్ ఫోలిసెల్స్ కు సరిగా హీమోగ్లోబిన్ ప్రసరించడం వల్ల జుట్టు త్వరగా పెరుగుతుంది,. జుట్టు సమస్యలను నివారిస్తుంది.

కొత్తిమీర జ్యూస్ :

కొత్తిమీర జ్యూస్ :

కొత్తిమీర హెయిర్ ఫాల్ తో పోరాడి, జుట్టు పెరిగేలా చేస్తుంది. కొత్తిమీరను ఇతర జ్యూసులతో కలిపి తీసుకుంటే రిజల్ట్ మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. పేస్ట్ కూడా తలకు పట్టించి అరగంట తర్వాత కోల్డ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

క్యారెట్ జ్యూస్ :

క్యారెట్ జ్యూస్ :

క్యారెట్ జ్యూస్ గ్రేట్ న్యూట్రీషియన్స్ కలది. ఇందులో ఉండే బీటాకెరోటిన్ జుట్టు పెరుగుదలకు మరియు హెయిర్ కలర్ ను ప్రోత్సహిస్తుంది . హెయిర్ ఫోలిసెల్స్ కు సరిపడా న్యూట్రీషియన్స్ అందడంతో హెయిర్ క్వాలిటీ రీస్టోర్ అవుతుంది .

 స్ట్రాబెర్రీ జ్యూస్ :

స్ట్రాబెర్రీ జ్యూస్ :

స్ట్రాబెర్రీ జ్యూస్ జుట్టుకు అవసరం అయ్యే ప్రోటీన్స్ ను పుష్కలంగా అందిస్తుంది. స్ట్రాబెర్రీ పేస్ట్ ను హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఒత్తుగా, స్ట్రాంగ్ గా షైనీగా పెరుగుతుంది.

English summary

Top 10 Juices That Help Further Hair Growth

The residue of fresh fruits and green leafy vegetables provide your body with ample nutrition and also assists the growth of mane. Fresh fruits and vegetable juices will lessen the chances of hair breakage and thus help promote hair growth.
Story first published: Wednesday, May 11, 2016, 13:57 [IST]
Desktop Bottom Promotion