For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రు నివారణకు ఇంట్లో స్వయంగా చేసుకునే ఎఫెక్టివ్ రెమెడీస్...!

|

జుట్టు చూడటానికి ఎంత పొడవుగా, ఒత్తుగా ఉన్నా, శుభ్రంగా లేకపోతే జుట్టు అందంగా కనబడుదు. ఉదాహరణకు పొడవైన, ఒత్తైన జుట్టు ఉన్నా, తలలో తెల్లగా పొట్టుపొట్టుగా కనబడితే చూడటానికి అసహ్యంగా కనబడుతుంది. అంతే కాదు, నలుగురిలో దురదపెడితే మరింత ఇబ్బంది కరంగా.. మెయింటైన్ చేయడం కూడా కష్టంగా మారుతుంది.

చాలా వరకూ చుండ్రు సమస్య మెడికల్ కండీషన్స్ వల్లే వస్తుంది, కానీ ఈ సమస్యను బ్యూటీ వర్గంగా సూచిస్తుంటారు. ఈ విషయంలో ఖచ్చితంగా అవుననే చెప్పవచ్చు.

ఒక బ్యూటిఫుల్ గా ఉండే మీకు నచ్చిన బ్లాక్ డ్రెస్ ను దరించినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, చెప్పండి. పైకి ఎన్ని మేకప్పులు చేసినా..ఎలాంటి ప్రయోజనం ఉండదు సరికదా, తెల్లగా పొట్టుపొట్టుగా డ్రెస్ మీద రాలి, నలుగురిలో ఇబ్బంది కలిగిస్తుంది.

జుట్టు సమస్యల్లో చుండ్రును దాచడానికి కూడా కుదరదు. ఇలాంటి సమస్య నుండి బయటపడటం ఎలా? జుట్టు సమస్యల్లో చుండ్రు ఒక సాధారణ సమస్య. తలలో చుండ్రు ఏర్పడుటకు శుభ్రతపాటించకపోవడం, ఈస్ట్ అలర్జీ, తలలో డ్రై స్కిన్, చీకాకు కలిగించే ఆయిలీ స్కిన్, ఎగ్జిమా, లేదా పోరియోసిస్, వ్యాధినిరోధకత లోపించడంలో, హార్ట్ డిసీజ్, స్ట్రోక్, వంటి జబ్బుల వల్ల, ఎక్కువ షాంపు వాడటం వల్ల తలలో డ్రైనెస్ పెరిగి డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది .

ఎక్సెస్ ఆయిల్ తలలో ఎక్కువగా చేరి చుండ్రుకు దారితీస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. చుండ్రు కేవలం ఆయిల్ స్కాల్ఫ్ వల్లే అని చాలా మంది నమ్ముతారు, కానీ పౌష్టికాహార లోపం మరియు ఒత్తిడి వల్ల కూడా చుండ్రు ఏర్పడటానికి కారణం అవుతుంది. ఈ డాండ్రఫ్ సమస్యను నివారించుకోవడానికి స్టోర్స్ లోమెడికేటెడ్ డాండ్రఫ్ ట్రీట్మెంట్ ను తీసుకోవడం కంటే ఇంట్లో స్వయంగా ట్రై చేసి, టెస్ట్ చేసిన కొన్ని హోం రెమెడీస్ ను ప్రయత్నించండి. ఇవి చుండ్రును చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. అంతకూ ఈ సమస్య తగ్గకపోతే మెడికేటెడ్ షాంపులను ప్రయత్నించండి. ఈ క్రింది సూచించిన నేచురల్ రెమెడీస్ ఏంటో ఏవిధంగా పనిచేస్తాయో తెలుసుకుందాం.....

1. ఉప్పు:

1. ఉప్పు:

ఉప్పు నేచురల్ రెమెడీ. ఇది చుండ్రును తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అదే విధంగా ఫేస్ స్క్రబ్బింగ్ వలే స్కాల్ఫ్ స్ర్కబ్బింగ్ గా కూడా సహాయపడుతుంది. తలలో కొద్దిగా టేబుల్ సాల్ట్ చిలకరించి తర్వాత నిధానంగా మసాజ్ చేయాలి. ఇది తలలో డెడ్ స్కిన్ ఫ్లాక్స్ ను తొలగిస్తుంది. తర్వాత యథాప్రకారం తలస్నానం చేసి, కండీషన్ ను అప్లై చేయాలి, . దాంతో చుండ్రు మాయమవుతుంది.

2. బేకింగ్ సోడ:

2. బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ, మరియు వాటర్ ప్యాక్ . ఈ రెండింటి మిశ్రమంతో చుండ్రును..తలలో జిడ్డును నివారించుకోవచ్చు. తలకు మాత్రమే అప్లై చేయాలి. లేదంటే జుట్టు మొత్త డ్రైగా మార్చుతుంది. ఈ హోం రెమెడీని అనుసరించేటప్పుడు షాంపువాడకూదు. ఇది నేచురల్ షాంపువలే పనిచేస్తుంది.

3. వెనిగర్ :

3. వెనిగర్ :

వైట్ వెనిగర్ మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ రెండూ అద్భుతంగా పనిచేస్తాయి. ఒక టీస్పూన్ వెనిగర్ ను ఒక కప్పు నీటిలో మిక్స్ చేసి, దీన్ని తలకు అప్లై చేయాలి. షాంపు చేయడానికి ఒక గంట ముందు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వెనిగర్ లో ఉండే అసిడిక్ నేచర్ వల్ల చుండ్రుకు, ఇన్ఫెక్షన్స్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

4. వేప:

4. వేప:

ఇండియన్ ఔషధం , స్కిన్ మరియు హెయిర్ సమస్యను నివారించడంలో , చుండ్రు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. నీళ్ళలో కొద్దిగా వేపాకు వేసి బాగా మరిగించి , చల్లార్చి ఆ నీటిని తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. చుండ్రును నివారించడంలో ఇది చాలా గ్రేట్ ట్రీట్మెంట్. ఇందులో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల అద్భుతంగా పనిచేస్తుంది.

5. నిమ్మరసం :

5. నిమ్మరసం :

తలలో ఎక్సెస్ సెబమ్ ను నివారించడంలో లెమన్ గ్రేట్ గా సహాయపడుతుంది. . కొద్దిగా నిమ్మరసంను తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. నిమ్మరసం అప్లై చేసిన తర్వాత ఎండకు బయట తిరగకుండా ఉండటం మంచిది. నిమ్మరసం బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది.

6. టీట్రీ ఆయిల్ :

6. టీట్రీ ఆయిల్ :

టీట్రీ ఆయిల్లో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ముఖంలో మచ్చలు, మొటిమలను తొలగిస్తుంది. అదే విధంగా తలలో చుండ్రును నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. షాంపులో కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల తలలో ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు.

7. అలోవెర జెల్ :

7. అలోవెర జెల్ :

మరో మల్టీపర్పస్ బ్యూటీ ప్రొడక్ట్స్ అలోవెర, అలోవెరలో చర్మ , మరియు హెయిర్ కు సంబంధించిన ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని ఎక్కువగా డ్రై స్కిన్ ఉన్న వారు అప్లై చేస్తారు. ఈ జెల్ జుట్టుకు అద్భుతమైన హైడ్రేషన్ ను అందిస్తుంది. జుట్టు ఆయిలీగా లేకుండా చేస్తుంది. అలోవెర జెల్ ను తలకు మసాజ్ చేసి అర గంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది..!

English summary

Top 7 Kitchen Ingredients To Get Rid Of Dandruff At Home

Dandruff is mostly a medical condition, but it can be categorised as a beauty concern as well because, obviously, it is not a pleasant sight when all the white flakes from your scalp fall around everywhere. You definitely wouldn't want that, right?
Story first published:Wednesday, August 17, 2016, 14:12 [IST]
Desktop Bottom Promotion