For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై అండ్ డ్యామేజ్ జుట్టుని స్మూత్ గా మార్చే హోం రెమిడీస్

By Swathi
|

డ్రైగా మారి, డ్యామేజ్ అయిన జుట్టు నివారించడానికి ఎన్నో ప్రొడక్స్ వచ్చాయి. అత్యంత ఖరీదైన ప్రొడక్ట్స్ కళ్ల ముందు అందుబాటులో ఉన్నాయి. కానీ.. ఈ ప్రొడక్ట్స్ అన్నీ హానికారక కెమికల్స్ తో కూడినవే. ఇవి జుట్టుని స్మూత్ గా, హెల్తీగా మార్చడం కంటే ఎక్కువ డ్యామేజ్ చేయడానికి కారణమవుతాయి.

అబ్బాయిలు వాళ్ల జుట్టు విషయంలో చేసే కామన్ మిస్టేక్స్..!

గతకొన్నేళ్లుగా డ్రై అండ్ డ్యామేజ్డ్ హెయిర్ చాలా కామన్ గా వినిపిస్తున్న సమస్య. హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, స్టైలింగ్ పరికరాలు, స్ట్రెయిటనర్స్, బ్లో డ్రైయర్సే దీనికి కారణమవుతున్నాయి. వీటిని అత్యంత ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ కి కారణమవుతోంది. అలాగే న్యాచురల్ షైన్ కోల్పోతుంది.

పురుషుల మెరుగైన ఆరోగ్యానికి ఉత్తమ ఆహారాలు

డ్రై అండ్ డ్యామేజ్ జుట్టుని స్మూత్ గా మార్చడానికి హోం రెమిడీస్ సహాయపడతాయి. వీటికి ఏమాత్రం ఖర్చు కూడా కాదు. ఖర్చు లేకుండా ఇంట్లో తయారు చేసుకునే ఈ రెమిడీస్ ఎఫెక్టివ్ ఫలితాలను ఇస్తాయి. జుట్టు పొడిబారకుండా చేస్తాయి. వీటిని రెగ్యులర్ గా ఫాలో అయితే.. అందమైన, హెల్తీ జుట్టు మీ సొంతమవుతుంది.

వెచ్చటి ఆలివ్ ఆయిల్ మసాజ్

వెచ్చటి ఆలివ్ ఆయిల్ మసాజ్

డ్రైగా, డ్యామేజ్ గా మారిన జుట్టుకి ఇది చక్కటి పరిష్కారం. గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ తో జుట్టుని, కుదుళ్లని మసాజ్ చేయడం వల్ల మంచి పోషణ అందుతుంది. డ్యామేజ్ నివారించి.. జుట్టుని స్మూత్ గా మారుస్తుంది.

ఎగ్ ప్యాక్

ఎగ్ ప్యాక్

పొడిబారిన, డ్యామేజ్ జుట్టుకి గుడ్డులోని సొన చాలా మంచిది. గుడ్డులోని పచ్చసొన, తేనె, ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకి ప్యాక్ లా వేసుకుంటే.. జుట్టుకి కావాల్సిన మాయిశ్చరైజర్ అందిస్తుంది. అలాగే డ్యామేజ్ అయిన జుట్టుని నివారిస్తుంది.

వెనిగర్ మాస్క్

వెనిగర్ మాస్క్

జుట్టుకి కండిషన్ అందివ్వడానికి యాపిల్ సైడర్ వెనిగర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కుదుళ్ల నుంచి.. జుట్టు డ్యామేజ్ ని నివారిస్తుంది. ఇది జుట్టు అప్లై చేయడం వల్ల జుట్టు లోపలి నుంచి స్ట్రాంగ్ గా మారుతుంది.

సాండల్ వుడ్ ఆయిల్

సాండల్ వుడ్ ఆయిల్

ఎసెన్షియల్ ఆయిల్స్ అయిన సాండల్ వుడ్ ఆయిల్ ఉపయోగిస్తే.. డ్యామేజ్ జుట్టు నివారించవచ్చు. జుట్టుకి న్యాచురల్ గా స్ట్రాంగ్ నెస్ ని, షైనింగ్ ని అందిస్తుంది. రెగ్యులర్ గా ఈ ఆయిల్ అప్లై చేస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

కండిషనర్

కండిషనర్

డ్యామేజ్ హెయిర్ నివారించడానికి డీప్ కండిషనింగ్ చాలా మంచి పరిష్కారం. ఇది జుట్టు కుదుళ్లను కూడా పోషణ అందించి.. డ్రైనెస్ ని దూరంగా ఉంచుతుంది. డీప్ కండిషనింగ్ వల్ల జుట్టు అందంగా, న్యాచురల్ గా, హెల్తీగా ఉంటుంది.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా

హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది. షాంపూ చేసుకోవడానికి ముందు బేకింగ్ సోడాని నీటిలో కలిపి జుట్టుని శుభ్రం చేసుకుంటే చాలు.. మంచి ఫలితాలు పొందవచ్చు.

పెరుగు

పెరుగు

పెరుగు న్యాచురల్ కండిషనర్ లా పనిచేస్తుంది. డ్యామేజ్ ని కంట్రోల్ చేస్తుంది. డ్రైనెస్ ని నివారిస్తుంది. డైరెక్ట్ గా పెరుగుని జుట్టుకి ప్యాక్ లా అప్లై చేసి శుభ్రం చేసుకుంటే చాలు.. జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

English summary

Try These Home Remedies For Dry And Damaged Hair

Try These Home Remedies For Dry And Damaged Hair. These home remedies won't cost you a ton of money and they are powerfully effective in fixing damaged hair and keeping dryness at bay.
Story first published:Wednesday, May 25, 2016, 16:39 [IST]
Desktop Bottom Promotion