Latest Updates
-
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు
ఆయిలీ హెయిర్ నివారించే సింపుల్ టెక్నిక్
సాధారణ జుట్టు సమస్యల్లో ఆయిలీ హెయిర్ ఒకటి. మీరు రెగ్యులర్ గా తలస్నానం చేస్తున్నా, జుట్టు ఎప్పుడూ జిడ్డుగా కనబడుతుంటుందా ? తలలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఈ జిడ్డు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా కేశాల మీద ప్రభావం చూపుతుంది. నూనె వల్ల జుట్టు మరింత మురికిగా, జిడ్డుగా కనబడేలా చేస్తుంది.
అలాగే మరికొంత మందిలో జీన్స్, హార్మోనుల ప్రభావంతో పాటు, అసాధారణ ఆహారపు అలవాట్లు , ఒత్తిడి వంటి కారణాల వల్ల కూడా జుట్టు జిడ్డుగా మారే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆయిలీ హెయిర్ జుట్టుకు సంబంధించిన చుండ్రు, జుట్టు చిట్లడం వంటి సమస్యలకు కారణమవుతుంది.
ఇలాంటి జుట్టును మ్యానేజ్ చేయడం చాలా కష్టం. ఇలాంటి జుట్టు నిర్వాహణ కోసం ఒక సులభమైన, పవర్ఫుల్ హోం మేడ్ హెయిర్ మాస్క్ ను పరిచయం చేస్తున్నాం. ఇది ఆయిల్ జుట్టుకు ఉపయోగించి, ఆయిలీ హెయిర్ నునివారించుకోండి.

ఆయిల్ హెయిర్ నివారించుకోవడానికి వంటగదిలోని కొన్ని పదార్థాలు చాలా ఉపయోగకరమైనవి. వంటగదిలో ఉండే ఎగ్ వైట్, ఉప్పు, నిమ్మరసం వీటన్నింటిలో, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకమైన గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు లోపల నుంచి పోషణను అందిస్తాయి. అలాగే తలలో ఉండే అదనపు నూనెను గ్రహిస్తాయి.
ఈ పదార్థాలు యాంటీబ్యాక్టీరియల్ స్వభావం కలిగి ఉంటాయి. అందువల్ల ఇవి వివిధ రకాల జుట్టు సమస్యలను నివారించడంలో గొప్పగా సహాయపడతాయి. ఆయిలీ హెయిర్ ను నివారించుకోవడానికి ఇంట్లో మీరు ఉపయోగించాల్సిన ఒక ఎఫెక్టివ్ హోం మేడ్ హెయిర్ ప్యాక్. దీన్ని ఎలా తయారుచేయాలి, ఏఏ పదార్థాలు అవసరమవుతాయో తెలుసుకుందాం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకుందాం...

పదార్థాలు:
గుడ్డు 1
ఉప్పు: 2 టేబుల్స్ స్పూన్లు
నిమ్మరసం 3 టేబుల్ స్పూన్లు
ఎలా ఉపయోగించాలి:
*ముందుగా గుడ్డు సొన ఒక బౌల్లో తీసుకొని, అందులో నిమ్మరసం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.
*ఇలా బీట్ చేసిన గుడ్డు మిశ్రమాన్ని తలకు మొత్తం అప్లై చేసి 10 నుంచి 15 నిముషాల వరకూ మసాజ్ చేయాలి.
*తర్వాత షవర్ క్యాప్ తో తలను కవర్ చేయాలి.
*ఇలా షవర్ క్యాప్ పెట్టుకొని అరగంట అలాగే ఉండి కొద్దిగా తడి ఆరిన తర్వాత మీకు నచ్చిన షాంపుతో తలస్నానం చేయాలి.
*తర్వాత కండీషనర్ ను అప్లై చేయాలి.
ఈ సింపుల్ అండ్ పవర్ ఫుల్ హెయిర్ మాస్క్ ను వారంలో రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల క్రమంగా తలలో ఎక్సెస్ ఆయిల్ ను నివారిస్తుంది. మీ జుట్టు మరింత అందంగా కనబడేలా చేస్తుంది.



Click it and Unblock the Notifications
