Latest Updates
-
డేటింగ్ యాప్లో పరిచయం.. పెళ్లయ్యాక కట్నం కోసం వేధింపులు: ఆన్లైన్ సంబంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
వాట్సాప్లో పెళ్లి పత్రికల పేరుతో కొత్త మోసం… ఆ లింక్ క్లిక్ చేస్తే మీ జీవితమే తలకిందులు! -
ఇంట్లో కూరగాయలు లేవా? కేవలం 5 నిమిషాల్లో ఈ కరకరలాడే ఉల్లిపాయ భుజియా చేసి చూడండి! -
మిథున, తులా, కుంభ రాశుల వారికి ఈరోజు అదృష్టం..ఆర్థికంగా భారీ లాభాలు పొందే అరుదైన అవకాశం! -
మీ ఒంట్లో ఈ 7 లక్షణాలు కనిపిస్తే.. మీరు కరెక్ట్ గా నీళ్లు తాగుతున్నట్టే లెక్క! -
గురు పుష్య యోగం: ఈ రోజు బంగారం కొంటే మీ జాతకమే మారిపోతుందా? అదృష్టం మీ వెంటే! -
మంగళవారం పనులు మొదలుపెడుతున్నారా? ఈరోజు శుభ ముహూర్తాలు, రాహుకాలం తెలుసుకోకపోతే పనుల్లో ఆటంకాలు తప్పవా? -
రేవతిలో శని, రోహిణిలో బుధుడు: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. ఎవరికి ధన లాభం? - మంగళవారం, 19 మే 2026 -
నీట్ రద్దుతో మొదలైన గొడవలు.. మీ రిలేషన్షిప్ను కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఒక నెలలో ఒత్తైన..పొడవైన జుట్టు పొందడానికి ఇంట్లో తయారుచేసుకొనే హెయిర్ ఆయిల్ !
జుట్టు ఎక్కువగా రాలిపోతున్నదని ఒకటే ఆందోళన చెందుతున్నారా? ఈ మద్యకాలంలో ఎక్కువ జుట్టు రాలపోవడం గమనిస్తున్నారా? మరి అయితే త్వరంలో మీ జుట్టు కాస్త పల్చబడిపోతున్నదని గుర్తించాలి.
సమస్య మరింత తీవ్రం కాక ముందే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు పల్చబడిపోతున్నదన్న ఆందోళను ఉండదు.జుట్టు పల్చగా మారడం , లేదా హెయిర్ ఫాల్ అనేది సీరయస్ గా తీసుకోవల్సిన విషయం. జుట్టు ఎక్కువగా రాలిపోతున్నప్పడు, సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే స్త్రీ, పురుషులిద్దరిలో బట్టతలకు కారణమవుతుంది.!
ఇలా బట్టతల, జుట్టు పల్చబడం వల్ల అందంగా కనబడకపోగా , ఉన్న అందంగా కాస్తా పోతుంది. దాంతో నలుగురిలో వెళ్లడానికి ఇబ్బంది పడుతారు. యాక్సైటీగా ఫీలవుతారు . సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది.
అంతే కాదు, ఎక్కువ జుట్టు రాలిపోతున్న సమయంలో జుట్టు సంరక్షణకోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ ప్రొడక్ట్స్ ను ప్రయత్నించాలాన్న భయపడుతుంటారు. అవి ఏవిధంగా పనిచేస్తాయో...ఎలాంటి ఫలితాలను అందిస్తాయోనన్న కంగారు చాలా మందిలో ఉంటుంది. ఎదైనా ఎక్సరిమెంట్స్ చేయాలన్నా సిగ్గుపడుతారు.

జుట్టు రాలడానికి, జుట్టు పల్చబడటానికి ముఖ్యకారణం మనం తీసుకునే ఆహారం, జుట్టు పట్ల నిర్లక్ష్యం, సరైన హైజీనిక్ పాటించకపోవడం, హెరిడిటి , మేల్ ప్యాట్రన్, బట్టతల, తలలో ఇన్ఫెక్షన్ , మొదలగు కారణాలు.
మీ జుట్టును నేచురల్ గా, పొడవుగా, ఒత్తుగా పెంచుకోవాలని కోరుకుంటున్నట్లైతే మీ వంటగదిలోకి ఓ లుక్ వేయండి..!
అవును, మీ జుట్టు సమస్యలకు ఒక గొప్ప పరిష్కార మార్గంగా ఒక నేచురల్ హోం మేడ్ హెయిర్ ఆయిల్ తయారీ విధానంను పరిచయం చేస్తున్నాం. ఈ హెయిర్ ఆయిల్ ను రెగ్యులర్ గా తలకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది.!

ఒత్తైన..పొడవైన జుట్టు పొందడానికి హోం మేడ్ హెయిర్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..
కావల్సిన పదార్థాలు:
కొబ్బరి నూనె- 2 tablespoons
మెంతి పౌడర్- 1 tablespoon
కొబ్బరి నూనె , మెంతి పౌడర్ కాంబినేషన్ హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది, జుట్టును ఒత్తుగా మరియు స్ట్రాంగ్ గా పెరగడానికి సహాయపడుతుంది . రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ హోం మేడ్ హెయిర్ ఆయిల్లోని విటమిన్స్ మరియు మినిరల్స్ హెయిర్ ఫోలిసెల్స్ ను బలోపేతం చేస్తుంది. మరియు ఈ కాంబినేసన్ హెయిర్ ఆయిల్ జుట్టుకు మంచి మాయిశ్చరైజర్ గా సహాయపడుతుంది. పొడి జుట్టు కూడా కొన్ని సందర్బాల్లో జుట్టు రాలడానికి కారణమవుతుంది.

అదనంగా , ఈ నేచురల్ హెయిర్ ఆయిల్ జుట్టుకు రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా సిల్కీగా మారుతుంది. ఇంకా అనేక ప్రయోజనాలున్నాయి. కాబట్టి ఈ హోం మేడ్ ఆయిల్ రిసిపిని మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే..
తయారుచేయు విధానం:
పైన చూసించన పదార్థాలు ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి.
రెండింటిని బాగా మిక్స్ చేయాలి.
ఈ హెయిర్ ఆయిల్ ను జుట్టుకు బాగా పట్టించి మసాజ్ చేయాలి.
ఒకటి రెండు గంటలు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీరు, షాంపుతో తలస్నానం చేయాలి.



Click it and Unblock the Notifications