For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక నెలలో ఒత్తైన..పొడవైన జుట్టు పొందడానికి ఇంట్లో తయారుచేసుకొనే హెయిర్ ఆయిల్ !

|

జుట్టు ఎక్కువగా రాలిపోతున్నదని ఒకటే ఆందోళన చెందుతున్నారా? ఈ మద్యకాలంలో ఎక్కువ జుట్టు రాలపోవడం గమనిస్తున్నారా? మరి అయితే త్వరంలో మీ జుట్టు కాస్త పల్చబడిపోతున్నదని గుర్తించాలి.

సమస్య మరింత తీవ్రం కాక ముందే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు పల్చబడిపోతున్నదన్న ఆందోళను ఉండదు.జుట్టు పల్చగా మారడం , లేదా హెయిర్ ఫాల్ అనేది సీరయస్ గా తీసుకోవల్సిన విషయం. జుట్టు ఎక్కువగా రాలిపోతున్నప్పడు, సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే స్త్రీ, పురుషులిద్దరిలో బట్టతలకు కారణమవుతుంది.!

ఇలా బట్టతల, జుట్టు పల్చబడం వల్ల అందంగా కనబడకపోగా , ఉన్న అందంగా కాస్తా పోతుంది. దాంతో నలుగురిలో వెళ్లడానికి ఇబ్బంది పడుతారు. యాక్సైటీగా ఫీలవుతారు . సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది.

అంతే కాదు, ఎక్కువ జుట్టు రాలిపోతున్న సమయంలో జుట్టు సంరక్షణకోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ ప్రొడక్ట్స్ ను ప్రయత్నించాలాన్న భయపడుతుంటారు. అవి ఏవిధంగా పనిచేస్తాయో...ఎలాంటి ఫలితాలను అందిస్తాయోనన్న కంగారు చాలా మందిలో ఉంటుంది. ఎదైనా ఎక్సరిమెంట్స్ చేయాలన్నా సిగ్గుపడుతారు.

Want To Get Thick Hair In A Month? Try This Homemade Oil!

జుట్టు రాలడానికి, జుట్టు పల్చబడటానికి ముఖ్యకారణం మనం తీసుకునే ఆహారం, జుట్టు పట్ల నిర్లక్ష్యం, సరైన హైజీనిక్ పాటించకపోవడం, హెరిడిటి , మేల్ ప్యాట్రన్, బట్టతల, తలలో ఇన్ఫెక్షన్ , మొదలగు కారణాలు.

మీ జుట్టును నేచురల్ గా, పొడవుగా, ఒత్తుగా పెంచుకోవాలని కోరుకుంటున్నట్లైతే మీ వంటగదిలోకి ఓ లుక్ వేయండి..!

అవును, మీ జుట్టు సమస్యలకు ఒక గొప్ప పరిష్కార మార్గంగా ఒక నేచురల్ హోం మేడ్ హెయిర్ ఆయిల్ తయారీ విధానంను పరిచయం చేస్తున్నాం. ఈ హెయిర్ ఆయిల్ ను రెగ్యులర్ గా తలకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది.!

Want To Get Thick Hair In A Month? Try This Homemade Oil!

ఒత్తైన..పొడవైన జుట్టు పొందడానికి హోం మేడ్ హెయిర్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..
కావల్సిన పదార్థాలు:
కొబ్బరి నూనె- 2 tablespoons
మెంతి పౌడర్- 1 tablespoon

కొబ్బరి నూనె , మెంతి పౌడర్ కాంబినేషన్ హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది, జుట్టును ఒత్తుగా మరియు స్ట్రాంగ్ గా పెరగడానికి సహాయపడుతుంది . రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఈ హోం మేడ్ హెయిర్ ఆయిల్లోని విటమిన్స్ మరియు మినిరల్స్ హెయిర్ ఫోలిసెల్స్ ను బలోపేతం చేస్తుంది. మరియు ఈ కాంబినేసన్ హెయిర్ ఆయిల్ జుట్టుకు మంచి మాయిశ్చరైజర్ గా సహాయపడుతుంది. పొడి జుట్టు కూడా కొన్ని సందర్బాల్లో జుట్టు రాలడానికి కారణమవుతుంది.

Want To Get Thick Hair In A Month? Try This Homemade Oil!

అదనంగా , ఈ నేచురల్ హెయిర్ ఆయిల్ జుట్టుకు రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా సిల్కీగా మారుతుంది. ఇంకా అనేక ప్రయోజనాలున్నాయి. కాబట్టి ఈ హోం మేడ్ ఆయిల్ రిసిపిని మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే..

తయారుచేయు విధానం:
పైన చూసించన పదార్థాలు ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి.
రెండింటిని బాగా మిక్స్ చేయాలి.
ఈ హెయిర్ ఆయిల్ ను జుట్టుకు బాగా పట్టించి మసాజ్ చేయాలి.
ఒకటి రెండు గంటలు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీరు, షాంపుతో తలస్నానం చేయాలి.

English summary

Want To Get Thick Hair In A Month? Try This Homemade Oil!

Have you been worried about your hair a lot lately? Do you feel that you are experiencing a lot of hair fall and that your hair is thinning out?
Story first published: Saturday, July 30, 2016, 15:48 [IST]
Desktop Bottom Promotion