Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
డాండ్రఫ్ , హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసే మెంతి చిట్కాలు
మన భారతీయ పోసు దినుసుల్లో మెంతులు ఒకటి. మెంతులో గొప్ప ఔషధగుణాలున్నాయి. ఆరోగ్యానికి మరియు అందానికి ఉపయోగపడే ప్రయోజనాలెన్నో ఇందులో ఇమిడి ఉన్నాయి. అందుకే వీటిని పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో మెంతి ఆకులను లేదా మెంతి గింజలను వంటలకు విరివిగి ఉపయోగిస్తుండేవారు. మెంతి ఆకులను హెర్బల్ రెమెడీస్ లో కూడా విరివిగా ఉపయోగిస్తుంటారు.
మెంతులు ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా గొప్పగా ఉపయోగపడుతుంది. వివిధ రకాల జుట్టు సమస్యలను నివారించడంలో మెంతులు గ్రేట్ గా సహాయపడుతాయి. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలెన్నో నివారించబడుతుంది. మెంతులను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకు మెంతులు ఒక న్యూట్రీషియన్ పదార్థం. జుట్టు పెరుగుదల కోసం ఖరీదైన ట్రీట్మెంట్స్ కోసం మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు . మెంతులను ఉపయోగిస్తుంటే చాలు. అన్ని రకాల జుట్టు సమస్యలను నివారించి జుట్టు పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
మెంతుల్లో ఉండే నూనెలు, ప్రోటీనులు మరియు ఇతర కాంపోనెంట్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి . ఇంట్లో మెంతులుంటే చాలు వేరే ఏ ఇతర పదార్థాల అవసరముండదు.

జుట్టు పెరుగుదలకోసం మెంతులను ఉపయోగించడం చాలా చౌకన పద్దతి. కానీ ఎఫెక్టివ్ రిజల్ట్ ను అందిస్తుంది . జుట్టు కోల్పోయిన అందాన్ని తిరిగి తీసుకొస్తుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది.
మెంతులకు ఇతర పదార్థాలను కూడా జోడించి ఉపయోగించడం వల్ల ఫలితాలు మరింత ఎఫెక్టివ్ గా ఉంటాయి . కాబట్టి, జుట్టు ఆరోగ్యంగా మరియు హెల్తీగా పెంచుకోవడానికి మెంతులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

మెంతి పేస్ట్: మెంతులను నీటిలో వేసి 6-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత నీరు వంపేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను తలకు పట్టించి అరగంట ఉండాలి . అరగంట తర్వాత నేచురల్ షాంపుతో తలస్నానం చేయాలి.

మెంతు -ఎగ్ మాస్క్: నానబెట్టిన మెంతులను మెత్తగా పేస్ట్ చేసి, అందులో ఎగ్ వైట్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి . గుడ్డు మరియు మెంతులు రెండింటిలో ప్రోటీనులు అధికంగా ఉంటాయి. ఈ రెండింటి కాంబినేసన్ లో జుట్టుకు తగినంత పోషణ అందతుంది .జుట్టు ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా మెరుస్తుంటాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు మెంతులు: చుండ్రును నివారించుకోవడానికి మెంతి హెయిర్ ప్యాక్ గ్రేట్ గా పనిచేస్తుంది . అరకప్పు మెంతి పేస్ట్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

పెరుగు మరియు మెంతులు: ఇది హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది. 1/4కప్పు పెరుగు, అరకప్పు మెంతి పేస్ట్ మిక్స్ చేసి, తలకు, జుట్టుకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

హాట్ ఆయిల్ మరియు మెంతులు: కొన్ని మెంతులను పొడి చేసి అందులో మూడు చెంచాల ఆవనూనె మరియు ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి మసాజ్ చేయాలి. 20 నిముషాల తర్వాత తలస్నానం గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

కొబ్బరి పాలు మరియు మెంతి మాస్క్: 1/4కోకనట్ మిల్క్ మరియు అరకప్పు మెంతి పేస్ట్ మిక్స్ చేసి , దీన్ని తలకు అప్లై చేయాలి. 5నిముషాలు తలకు బాగా మసాజ్ చేసిన తర్వాత 15నిముషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇది హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది.



Click it and Unblock the Notifications