Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
జుట్టు రాలడం, బట్టతల, చుండ్రు నివారించే ఆనియన్ జ్యూస్ ట్రీట్మెంట్
ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టుకు సంబంధించి చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాడం మొదలు.. చుండ్రు వరకూ చాలా రకాల జుట్ట సమస్యలను నివారించడానికి కూడా వీలుపడనన్ని సమస్యలు ఎదుర్కో వల్సి వస్తోంది. జుట్టు రాలడం మరియు జుట్టు అతి తక్కువగా లేదా నిధానంగా పెరగడం వంటివి మరో హెయిర్ సమస్య. కేశ సంరక్షణ జాగ్రత్తలు తీసుకొన్న తర్వాత కూడా అదే విధంగా ఉంటే దానికి కారణం అనారోగ్యకరమైన జీవన శైలి, ఆహారంలో అసమతుల్యత వల్ల చర్మ మరియు జుట్టు మీద చెడు ప్రభావాన్ని చూపెడుతుంది. దాంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. దీని వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మరి ఒత్తిడి కూడా తోడైతే మొదటికే మోసం అవుతుంది.
శరీర ఆరోగ్య శుద్ధీకరణలో ఉల్లిపాయ చేసే మేలు..!
ఇటువంటి సమస్యలను అరికట్టడానికి చాలా ట్రీట్మెంట్లు తీసుకొన్నా కూడా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. చాలా మంది కేశాలను సంరక్షించుకోవడం కోసం కొన్ని ఇంటి చిట్కాలను సాధారణ పద్దతుల్లో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా హేర్బల్ ట్రీట్మెంట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. అలాంటి హేర్బల్స్ మన వంటగదిలోని చాలా రకాలు వంటకు ఉపయోగించే వస్తువులను హెయిర్ కేర్ లో భాగంగా ఉపయోగిస్తుంటారు.
హెత్తీ ఫుడ్సే కానీ, గ్యాస్ట్రిక్ మరియు పొట్టఉబ్బరానికి కారణం అవుతాయి? మరి నివారణ ఎలా?
ఉదాహరణకు తేనె, గుడ్డు, పెరుగు, బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మరసం, మరియు ఉల్లిపాయ వంటివి హోమ్ రెమెడీ హెయిర్ ట్రీట్మెంట్ కు ఉపయోగిస్తుంటారు. అవును, నిజంగానే ఉల్లిపాయ మన కళ్ళలో నీళ్ళు కారేవింధంగా చేస్తుంది. అలాగే కురుల సమస్యలను కూడా నివారిస్తుంది. ఎందుకంటే ఉల్లిపాయలో ఉండే ఘాటైన వాసన కలిగిన సల్ఫర్ తలలో రక్తప్రసరణ పెంచుతుంది. కురులకు శక్తిని అందిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
స్ప్రింగ్ ఆనియన్(ఉల్లికాడ)లో అద్భతమైన హెల్త్ బెనిఫిట్స్
ఇంకా ఉల్లిపాయలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల చండ్రు నివారించబడుతుంది. కాబట్టి, జుట్టు రాలడాన్ని అరికట్టాలన్నా,...ఉన్న జుట్టు అందంగా, స్ట్రాంగ్ గా ఉండాలనుకున్నా ఆనియన్ రసం ది బెస్ట్ హేర్బల్ రెమెడీ. ఉల్లిపాయ రసాన్ని వివిధ రకాలుగా ఉపయోగించి జుట్టు రాలడం, చుండ్రు సమస్యలను నివారించుకోవచ్చు..మరి ఎలాగో చూద్దామా...

ఉల్లిపాయ రసం -తేనె:
జుట్టు రాలడం మరియు చుండ్రు నివారించడంలో ఉల్లిపాయ రసం ది బెస్ట్ హఓం రెమెడీ . జుట్టు రాలడాన్ని అరికట్టి,కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. కాబట్టి ఉల్లిపాయ రసం, తేనె సమంగా తీసుకొని, రెండింటిని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

ఆనియన్ జ్యూస్-బాదం ఆయిల్:
బాదం నూనె ఒక అద్భుతమైన హెయిర్ ఆయిల్ . ఇది జుట్టును స్ట్రాంగ్ ఉంచడంతో పాటు కేశాలకు మంచి షైనింగ్ ను అందిస్తుంది. బాదం ఆయిల్ కు ఆనియన్ జ్యూస్ జోడించడం వల్ల ఇది జుట్టు రాలడం నివారించడంలో సహాయపడుతుంది. ఇది హెయిర్ ఫాలీ సెల్స్ ను బలోపేతం చేస్తుంది. మంచి హెయిర్ గ్రోత్ ను అందిస్తుంది.

ఆనియన్ జ్యూస్ *-కోకనట్ ఆయిల్:
కోకనట్ ఆయిల్ సాధారణంగా హెయిర్ ఆయిల్ గా ఉపయోగిస్తుంటారు. ఇది జుట్టు రాలడం తగ్గిస్తుంది. ఈ నూనె ను ఉల్లిపాయ రసంతో మిక్స్ చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గిస్తుంది మరియు జుట్టు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది . రెండు చెంచాల కొబ్బరి నూనెలో ఒక చెంచా ఉల్లిపాయ రసం మిక్స్ చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

ఆనియన్ జ్యూస్-ఆలివ్ ఆయిల్:
జుట్టు రాలడం నివారించడంలో ఆనియన్ జ్యూస్ మరియు ఆలివ్ ఆయిల్ పర్ఫెక్ట్ కాంబినేషన్ . ఆలివ్ ఆయిల్ కు కొద్దిగా ఆనియన్ జ్యూస్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఆనియన్ జ్యూస్ వార్మ్ వాటర్:
ఆనియన్ జ్యూస్ లో గోరువెచ్చని నీటిని మిక్స్ చేసి, తలస్నానం చేసిన తర్వాత ఈ నీటిని తలారా హెయిర్ కండీషనర్ గా పోసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే ఫలితాన్ని మీరు గమనిస్తారు.

ఉల్లిపాయ- బీర్ :
ఉల్లిపాయ నుండి జ్యూస్ ను సపరేట్ చేసిన తర్వాత మిగిలి ఉల్లిపాయ గుజ్జుకు కొద్దిగా బీర్ మరియు కొబ్బరినూనె మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. అప్లై చేసిన ఒకటి రెండు గంటలు ఇలాగే ఉంచేయాలి. తర్వాత నిమ్మరసం కలిపిన నీటితో తలస్నానం చేసుకోవాలి . ఇది హెయిర్ గ్రోత్ కు బాగా సహకరిస్తుంది. కేశాలు అందంగా మెరుస్తుంటాయి. హాట్ వ్రాప్ చుట్టడం ద్వారా కేశకణాకలు కావల్సిన న్యూట్రిషియన్స్ పుష్కలంగా అందుతాయి.

ఆనియన్ జ్యూస్ -నిమ్మరసం, పెరుగు:
ఉల్లిపాయతో మరో అద్భుతమైన హెయిర్ బెనిఫిట్ ఇది. హోం రెమడీస్ లలో చుండ్రును వదలగొట్టడానికి ఇదొ అద్బుతమైన చిట్కా. ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం వల్ల హెయిర్ లాస్ అరికడుతుంది. అలాగే చుండ్రును నివారిస్తుంది. మీరు రెగ్యులర్ గా తలకు వాడే హెయిర్ ప్యాక్ కి కొద్దిగా ఉల్లిపాయ రసాన్ని కూడా చేర్చడం వల్ల చుండ్రును నివారించగలుగుతుంది. నిమ్మరసం, పెరుగు, మరియు కొద్దిగా తేనె మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల కూడా చుండ్రును నివారంచవచ్చు.

ఆనియన్ జ్యూస్ -రమ్:
ఒక ఉల్లిపాయను ఒక కప్పు బీర్ లో రాత్రంతా నానబెట్టుకోవాలి . ఇలా ఊరబెట్టిన బీర్ ను మరుసటి రోజు ఉదయం తలకు పట్టించి మసాజ్ చేయాలి. జుట్టు పెరుగుదలకు ఇది ఒక బెస్ట్ మార్గం.

ఉల్లిపాయ-పెరుగు:
ఉల్లిపాయను మెత్తగా పేస్ట్ చేసి అందులో ఒక చెంచా పెరుగు వేసి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 1గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

ఆనియన్ -ఎగ్ వైట్:
గుడ్డు జుట్టు పెరుగుదలకు చాలా మేలు చేస్తుంది . ఇది అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ ను అందిస్తుంది. కాబట్టి, ఉల్లిపాయ రసంలో కొద్దిగా ఎగ్ వైట్ మిక్స్ చేసి, బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.



Click it and Unblock the Notifications