For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరివేపాకు, మెంతి ఆకు మిశ్రమంతో జుట్టుకి కలిగే అమేజింగ్ బెన్ఫిట్స్..!!

By Swathi
|

చాలా తేలికగా అందుబాటులో ఉండే.. వంటింటింట్లో ఉపయోగించే పదార్థాలే.. మీ జుట్టుని హెల్తీగా, షైనీగా మారుస్తాయి. న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ తో అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ ని నివారించవచ్చు. అంతేకాదు న్యాచురల్ హెయిర్ ప్రొడక్ట్స్.. కెమికల్ ప్రొడక్ట్స్ తో కంపేర్ చేస్తే.. చాలా సురక్షితం.

చాలా సందర్భాల్లో హెల్తీ హెయిర్ ఉన్నా కూడా.. సరైన శ్రద్ధ తీసుకోకపోవడం, ఒత్తిడి, ఎక్కువ సమయం ఏసీలలో కూర్చోవడం, దుమ్ము, కాలుష్యం వంటి కారణాల వల్ల.. జుట్టు ఆరోగ్యాన్ని కోల్పోయి, నిర్జీవంగా మారుతుంటుంది.

కాబట్టి జుట్టు సంరక్షణ కోసం కొంత సమయాన్ని కేటాయించడం చాలా అవసరం. కరివేపాకు, మెంతి మిశ్రమంతో.. జుట్టుకి అమేజింగ్ బెన్ఫిట్స్ అందుతాయి. కొన్ని కరివేపాకు ఆకులు, కొద్దిగా మేతి కలిపి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే.. నీళ్లు కలపవచ్చు.

ఈ మిశ్రమాన్ని జుట్టు అంతటికీ పట్టించి.. 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్ తో పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

సాఫ్ట్ హెయిర్

సాఫ్ట్ హెయిర్

ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల.. జుట్టు మాయిశ్చరైజర్ కోల్పోకుండా చూస్తుంది. దీనివల్ల జుట్టు హైడ్రేట్ గా, సాఫ్ట్ గా ఉంటుంది.

చిట్లిపోకుండా

చిట్లిపోకుండా

ఈ హోంమేడ్ హెయిర్ ప్యాక్ చిట్లిపోయిన జుట్టుని సాధారణంగా మారుస్తుంది. పోషణ అందించి, మాయిశ్చర్ చేసి.. జుట్టుని హెల్తీగా మారుస్తుంది.

షైనీగా

షైనీగా

కరివేపాకు, మెంతి ఆకు.. రెండింటిలోనూ.. విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టులోని ప్రతి కణాన్ని బలంగా మార్చి.. జుట్టు షైనీగా కనిపించడానికి సహాయపడుతుంది.

తెల్ల జుట్టు

తెల్ల జుట్టు

ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్ లో యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇది హెల్తీ హెయిర్ సెల్స్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దీనివల్ల తెల్ల జుట్టు రాకుండా నివారించవచ్చు.

జుట్టు రాలడాన్ని

జుట్టు రాలడాన్ని

ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్.. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే పదార్థాలు.. జుట్టుకి పోషణ అందించి.. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.

చుండ్రు

చుండ్రు

ఈ హోంమేడ్ హెయిర్ ప్యాక్ లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. డాండ్రఫ్ కి కారణమయ్యే.. బ్యాక్టీరియాను.. నాశనం చేసే సత్తా ఈ ప్యాక్ లో ఉంటుంది.

స్కాల్ప్ క్లెన్స్ కి

స్కాల్ప్ క్లెన్స్ కి

ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్ లో నిమ్మరసం కలిపి పట్టించుకుంటే.. స్కాల్ప్ లో పేరుకున్న ఆయిల్ ని, దుమ్ముని తొలగించి.. స్కాల్ప్ ని క్లెన్స్ చేస్తుంది.

డ్రై హెయిర్

డ్రై హెయిర్

ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్ జుట్టులోని ప్రతి కణానికి హైడ్రేషన్ అందిస్తుంది. దీనివల్ల ఇది జుట్టు పొడిబారకుండా అడ్డుకుంటుంది.

ఒత్తుగా

ఒత్తుగా

మెంతి ఆకు, కరివేపాకు రెండింటిలో ఉండే పోషకాలు.. జుట్టుని మరింత ఒత్తుగా కనిపించేలా చేస్తాయి.

జిడ్డుతనం

జిడ్డుతనం

ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్ స్కాల్ప్ లో సెబమ్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల.. జుట్టు జిడ్డుతనాన్ని కోల్పోయి.. ఫ్రెజ్ గా కనిపిస్తుంది.

జుట్టు రాలడం

జుట్టు రాలడం

ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్.. జుట్టు కుదుళ్లను బలంగా మార్చడం వల్ల.. హెయిర్ ఫాల్, హెయిర్ బ్రేకేజ్ ని అరికడుతుంది.

స్మూత్ గా

స్మూత్ గా

మెంతి, కరివేపాకు మిశ్రమాన్ని జుట్టుకి పట్టించడం వల్ల.. జుట్టు స్మూత్ గా, సిల్కీగా మారుతుంది.

English summary

What Happens When You Apply Curry Leafs With Methi To Your Hair?

What Happens When You Apply Curry Leafs With Methi To Your Hair? Did you know that kitchen ingredients like curry leaves and methi (fenugreek) come with more than 12 hair benefits?
Desktop Bottom Promotion