For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లో వల్ల చర్మానికి, జుట్టుకి కలిగే నష్టాలు తెలుసుకోవాల్సిందే..!

By Swathi
|

పిల్లో లేకుండా నిద్రపట్టదు చాలామందికి. కానీ.. పిల్లో ఉందా లేదా అంతే కానీ.. అది ఎంత శుభ్రంగా ఉంది అనేది చాలామంది పట్టించుకోరు. కానీ.. మీ పిల్లో వల్ల మీ జుట్టుకి, చర్మానికి చాలా సమస్యలు వస్తాయి. అవి తెలిస్తే మీరు షాక్ అవుతారు.

దుమ్ము, కాలుష్యం, అన్ హెల్తీ డైట్, చర్మ సంరక్షణలో లోపాలు వంటివి చర్మానికి, జుట్టుకి చాలా ఎక్కువగా హాని కలిగిస్తాయి. అయితే మీకు తెలుసా.. మీ ఫేవరేట్ పిల్లో కూడా.. మీ జుట్టుకి, చర్మానికి హానిచేస్తుంది. కాటన్ పిల్లో కవర్ వాడటం వల్ల ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలనుందా..

డ్రై స్కిన్

డ్రై స్కిన్

డ్రై స్కిన్ ఉన్నవాళ్లు కాటన్ కవర్ ఉన్న పిల్లో వాటడం వల్ల సమస్యలు పెరుగుతాయి. సిల్క్, సాటిన్ తో పోల్చితే.. కాటన్ దే ఎక్కువ రఫ్ గా ఉంటుంది. దీన్ని కవర్ గా ఉపయోగించినప్పుడు.. మీ చర్మంలోని ఆయిల్ ని పీల్చుకుని.. మరింత డ్రైగా మారుస్తుంది.

ముడతలు

ముడతలు

కాటన్ పిల్లో కవర్ రఫ్ గా ఉంటడం వల్ల.. చర్మానికి చాలా హానికరంగా మారుతుంది. చర్మంలో ఉండే కొల్లాజెన్ చర్మం చర్మంలో తగ్గిపోయి.. ఎలాస్టిసిటీని తగ్గిస్తుంది. దీనివల్ల ముడతలు చాలా త్వరగా ఏర్పడతాయి.

మొటిమలు

మొటిమలు

పిల్లో కవర్ పై ఉండే దుమ్ము, ధూళి.. మొటిమలు, ఇతర అలర్జీలు రావడానికి కారణమవుతాయి.

హెయిర్ ఫాల్

హెయిర్ ఫాల్

కాటన్ పిల్లో కవర్ పై పడుకున్నప్పుడు.. రాపిడి జరిగి.. జుట్టు రాలిపోవడానికి కారణమవుతుంది.

కనురెప్పలు

కనురెప్పలు

జుట్టు మాదిరాగానే.. కనురెప్పలు, దిండు కవర్ మధ్య రాపిడి జరిగి.. అవి రాలిపోవడానికి కారణమవుతుంది.

ర్యాషెస్ రావడానికి

ర్యాషెస్ రావడానికి

చర్మం దిండుపై ఒరిపిడికి గురై.. పిల్లో రఫ్ గా ఉండటం వల్ల.. చర్మంపై ర్యాషెస్ వస్తాయి. సున్నితమైన చర్మ తత్వం కలిగి ఉన్నవాళ్లలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. పిల్లో కవర్స్ సాఫ్ట్ గా ఉండేలా జాగ్రత్తపడాలి.

English summary

What Your Pillow Cover Is Doing To Your Skin And Hair

What Your Pillow Cover Is Doing To Your Skin And Hair. Dust, pollution, unhealthy diet and wrong skin care routine are a few things which affect our hair and skin badly.
Story first published: Wednesday, September 14, 2016, 16:03 [IST]
Desktop Bottom Promotion