Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
సర్ ప్రైజ్ : వైట్ హెయిర్ ప్యాక్స్ తో సాప్ట్ అండ్ సిల్కీ హెయిర్...
జుట్టు ఆరోగ్యానికి హెయిర్ ప్యాక్స్ గ్రేట్ గా పనిచేస్తాయి. ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవడం వల్ల , జుట్టును స్ట్రాంగ్ గా మార్చడంతో పాటు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
వేసవి సీజన్ లో జుట్టు త్వరగా డ్రై అవుతుంటుంది. వేసవి వేడి, శరీరంలో ఉష్ణోగ్రత, తలలో చెమట పట్టడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య ఎదురవుతుంది. దాంతో పాటు తలలో దురద ఇబ్బంది పెడుతుంది.
వేసవిలో ఇలా జరగడానికి ముఖ్య కారణం తలకు ఉపయోగించే హార్డ్ వాటర్ మరియు చెమట. వేసవి సీజన్ లో వారంలో రెండు మూడు సార్లు తలస్నానం చేయడం వల్ల 80 శాతం హెయిల్ ఫాల్ ను తగ్గించుకోవచ్చు.
వేసవి సీజన్ లో జుట్టు రాలడం నివారించుకోవడం కోసం ప్రత్యేకంగా వైట్ కలర్ హెయిర్ ప్యాక్స్ గ్రేట్ గా సహాయపడుతాయి . జుట్టుకు తగిన రక్షణ కల్పించడంతో పాటు, చూడటానికి చాలా సింపుల్ గా ప్రకాశవంతంగా మెరుస్తుంటాయి.
బ్యూటీ ఎక్సపర్ట్స్ అభిప్రాయం ప్రకారం , తలను దువ్వుడం లేదా తలలో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ హెయిర్ ప్యాక్స్ వేసుకోకపోవడం మంచిది . తలలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల తలలో స్కిన్ సమస్యలు మరియు ఇన్ఫెక్షన్స్ మరియు నొప్ప రెట్టింపు అవుతుంది.
అంతే కాదు, ఈ వైట్ హెయిర్ ప్యాక్స్ ను వేసుకోవడానికి ముందు, మీకు అలర్జీ కలిగిస్తాయో లేదో అన్న డౌట్ ను క్లియర్ చేసుకోవడానికి ప్యాచ్ టెస్ట్ ను వేసుకోవాలి. ఎటువంటి అలర్జీ లేకుంటే , నిరభ్యరంతరంగా ఈ హెయిర్ ప్యాక్స్ వేసుకోవడానికి సిద్దం అయిపోవండి...

1. పెరుగు:
మీ జుట్టును మీరు స్మూత్ గా మరియు సిల్కీగా మార్చుకోవాలంటే పెరుగుతో ప్యాక్ వేసుకోవడానికి వెనకాడవచ్చు. ఈ హెియర్ ప్యాక్ లో క్యాల్షియం మరియు ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉండటం వల్ల ఇది మీ జుట్టును సూపర్ సాప్ట్ గా మార్చి, డ్రై హెయిర్ నివారిస్తుంది.

2. మయోనూజ్:
మయోనైజ్ మరో హెల్తీ పదార్థం . హెయిర్ రూట్స్ కు మంచి పోషణ అందివ్వడంలో ఇది బెస్ట్ . అందుకు మీరు చేయాల్సిందల్లా చిక్కటి మయోనైజ్ ను తలకు అప్లై చేయాలి . 10 నిముషాల తర్వాత వేడి నీటితో తలస్నానం చేయాలి. మయోనైజ్ హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

3. పాలు:
హెయిర్ ను సాప్ట్ గా మార్చే వాటిలో పాలు కూడా ఒకటి . పాలతో తలను పూర్తిగా తడపాలి. ఇలా పూర్తిగా పాలను తలకు అప్లై చేసిన తర్వాత ఒక టవల్ ను తలకు చుట్టుకోవాలి . 10 నిముషాల తర్వాత నార్మల్ వాటర్ తో తలస్నానం చేయాలి.

4. ఓట్స్:
ఓట్స్ తో తలకు ప్యాక్ వేసుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలిసుండకపోవచ్చు. కానీ ఓట్స్ చాలా పర్ఫెక్ట్ హెయిర్ కేర్ ప్యాక్ . ఈ ప్యాక్ వల్ల జుట్టు ప్రకాశతంగా మెరుస్తుంటుంది . ఈ ప్యాక్ వేసుకొని తలస్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా మార్పును మీరు గమనిస్తారు.

5.తెల్ల ఉల్లిపాయలు :
జుట్టు సమస్యలను నివారించడంలో ఆనియన్ జ్యూస్ ను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు . ఇది జుట్టుకు మంచి షైనింగ్ ఇవ్వడంతో పాటు, సాప్ట్ గా మార్చతుంది. ఆనియన్ జ్యూస్ ను వారంలో రెండు సార్లు తలకు పట్టించి తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ హెల్తీ జ్యూస్ వల్ల చుండ్రు నివారించుకోవచ్చు . వైట్ హెయిర్ ను తొలగించుకోవచ్చు .

6. ఎగ్ వైట్:
ఎగ్ వైట్ లో ప్రోటీనులు అధికంగా ఉంటాయి . ఇవి జుట్టు ఆరోగ్యానికి, హెయిర్ బ్యూటీకి చాలా బాగా ఉపయోగపడుతాయి . ఈ వేసవిలో మీ జుట్టుఆరోగ్యాన్ని అందాన్ని కాపాడుకోవడానికి ఎగ్ వైట్ గ్రేట్ గా సహాయపడుతుంది . జుట్టుకు ఎగ్ వైట్ అప్లై చేసి 15నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. బెటర్ రిజల్ట్ పొందడానికి వారానికొసారి దీన్ని ఉపయోగించాలి.

7. రైస్ వాటర్:
రైస్ వాటర్ మరో వైట్ హెయిర్ మాస్క్. రైస్ వాటర్ జుట్టు యొక్క నాణ్యతను పెంచుతుంది మరియు తలలో ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది . చుండ్రును నివారిస్తుంది . హెయిర్ ను సాప్ట్ గా మరియు సిల్కీగా మార్చుతుంది.



Click it and Unblock the Notifications