For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చీకాకు కలిగించే చుండ్రును మాయం చేసే 10 ఆయుర్వేదిక్ రెమెడీస్..!

చుండ్రు నివారించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే అనేక షాంపూలు యాంటీ డాండ్రఫ్ పేరుతో ఉంటాయి. వీటన్నింటినీ ప్రయత్నించినా.. ఫలితం మాత్రం దక్కదు. ఇవి తలస్నానం చేసిన రోజు రిలీఫ్ ఇచ్చినా.. షరామామ

|

జుట్టు చూడటానికి ఎంత పొడవుగా, ఒత్తుగా ఉన్నా, శుభ్రంగా లేకపోతే జుట్టు అందంగా కనబడుదు. ఉదాహరణకు పొడవైన, ఒత్తైన జుట్టు ఉన్నా, తలలో తెల్లగా పొట్టుపొట్టుగా కనబడితే చూడటానికి అసహ్యంగా కనబడుతుంది. అంతే కాదు, నలుగురిలో దురదపెడితే మరింత ఇబ్బంది కరంగా ఉంటుంది. చుండ్రును కనబడనివ్వకుండా మెయింటైన్ చేయడం కష్టంగా మారుతుంది. జుట్టు సమస్యల్లో చుండ్రును దాచడానికి కూడా కుదరదు.

10 Ayurveda Remedies For Dandruff

మరి ఇలాంటి సమస్య నుండి బయటపడటం ఎలా? జుట్టు సమస్యల్లో చుండ్రు ఒక సాధారణ సమస్య. తలలో చుండ్రు ఏర్పడుటకు శుభ్రతపాటించకపోవడం, ఈస్ట్ అలర్జీ, డ్రై స్కిన్, వ్యాధినిరోధకత లోపించడంలో, హార్ట్ డిసీజ్, స్ట్రోక్, వంటి జబ్బుల వల్ల, ఎక్కువ షాంపు వాడటం వల్ల తలలో డ్రైనెస్ పెరిగి డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది .

చుండ్రు నివారించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే అనేక షాంపూలు యాంటీ డాండ్రఫ్ పేరుతో ఉంటాయి. వీటన్నింటినీ ప్రయత్నించినా.. ఫలితం మాత్రం దక్కదు. ఇవి తలస్నానం చేసిన రోజు రిలీఫ్ ఇచ్చినా.. షరామామూలే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలా అప్పటికప్పుడు కాకుండా.. శాశ్వతంగా చుండ్రు నివారించడానికి, చుండ్రురహిత స్కాల్ఫ్ పొందడానికి ఆయుర్వేదిక్ రెమెడీస్ ఉన్నాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎపెక్ట్స్ ఉండవు. ఆయుర్వేదిక్ రెమెడీస్ తో చుండ్రు నివారించుకోవడం ఎలాగో చూద్దాం...

పెరుగు-నిమ్మరసం

పెరుగు-నిమ్మరసం

చుండ్రు నివారించుకోవడానానికి ఆయుర్వేదంలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి. పెరుగులో కొద్దిగా నిమ్మరసం పిండి తలకు పట్టించడం వల్ల తల శుభ్రం చేస్తుంది. క్లియర్ అవుతుంది . నిమ్మరసం చుండ్రును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. . ఇది చాలా ఎఫెక్టివ్ టిప్ . పెరుగు జుట్టుకు మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. తలను కూల్ గా ఉంచుతుంది

వేప ఆకులు

వేప ఆకులు

వేప ఆకులను మెత్తగా పేస్ట్ చేసి తలకు అప్లై చేయాలి. అరగంట అలాగే ఉంచి తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి. చుండ్రు పూర్తిగా తొలగిపోవాలంటే వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది

వెనిగర్ ఆయుర్వేదిక్ రెమెడీ:

వెనిగర్ ఆయుర్వేదిక్ రెమెడీ:

రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ ను హాట్ వాటర్లో మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయడం వల్ల ఇది చుండ్రును మాయం చేయడంతో పాటు, తలను శుభ్రం చేస్తుంది . పుదీనా ఆకులు మరియు ఆపిల్ సైడర్ వెనిగర్:

పుదీనా ఆకులు మరియు ఆపిల్ సైడర్ వెనిగర్:

పుదీనా ఆకులు మరియు ఆపిల్ సైడర్ వెనిగర్:

ఒక కప్పు వేడి నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి, అందులో కొద్దిగా పుదీనా ఆకులను మిక్స్ చేసి బాయిల్ అయిన తర్వాత చల్లార్చి , తలకు అప్లై చేయాలి. చేతివేళ్ళతో మర్ధన చేయాలి. తడి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

మెంతులు

మెంతులు

మెంతులు జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగే యాంటీ ఫంగల్ గుణాలు ఇందులో మెండుగా ఉంటాయి. కాబట్టి ఇది చుండ్రుని నివారించడంలో పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. రాత్రంతా మెంతులను నీళ్లలో నాననివ్వాలి. ఉదయాన్నే వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలోకి ఒక కప్పు పెరుగు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు, స్కాల్ఫ్ కి పట్టించి రెండు గంటలపాటు ఆరనివ్వాలి. తర్వాత షాంపూతో స్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ చిట్కాని వారానికి రెండుసార్లు ప్రయత్నిస్తే.. మంచి ఫలితాలు పొందవచ్చు.

కలబంద:

కలబంద:

కలబంద చుండ్రును నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . మరియు చర్మంలో తేమను ఉంచతుంది. తలలో స్కిన్ డ్యామేజ్ ను నివారిస్తుంది . చర్మంను హెల్తీగా ఉంచుతుంది. చుండ్రు ఏర్పడకుండా నివారిస్తుంది . అలోవెర యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది . దాంతో చుండ్రు నివారించడబడుతుంది.

గుడ్డు:

గుడ్డు:

రెండు గుడ్లను పగులగొట్టి సొనను బాగా గిలకొట్టాలి, ఈ సొనను తలకు బాగా పట్టించి ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూ ఉపయోగించి గోరువెచ్చిని నీటితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు మరియు హెయిర్ ఫాల్ ను అరికడుతుంది. తలస్నానం చేసిన తర్వాత కోడిగుడ్డును జుట్టుకు పట్టించండి. ఇది మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. ఇది కూడా చుండ్రును తగ్గిస్తుంది.

ఉసిరికాయ పేస్ట్ :

ఉసిరికాయ పేస్ట్ :

ఇది యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్ . ఇందులో చుండ్రు నివారించే గుణాలు, ఇన్ఫ్లమేషన్ తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పేస్ట్ ను తలకు అప్లై చేసి బాగా మర్దన చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

శికాకాయ :

శికాకాయ :

శీకాకాయను పుదీనాతో మరియు మెంతి సీడ్స్ తో మిక్స్ చేసి, పేస్ట్ చేసి తలకు పట్టించాలి. . లేదీ వీటని నీటిలో నానబెట్టి, ఆ నీటిని నిద్రించడానికి ముందు తలకు అప్లై చేయాలి. రాత్రంతా అలా ఉంచి తర్వాతి రోజు ఉదయం స్నానం చేయాలి. దీన్ని ఇంట్లో తయారుచేసుకోలేకపోతే, ఇది ఆయుర్వేదిక్ షాప్స్ లో అందుబాటులో దొరుకుతుంది, శీకాకయ చుండ్రుకు మాత్రమే కాదు, జుట్టుకు సంబంధించిన ఇతర సమస్యలను నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది .

హాట్ ఆయిల్ మసాజ్:

హాట్ ఆయిల్ మసాజ్:

తలకు నూనె అప్లై చేయడానికి ముందు నూనెను కొద్దిగా వేడి చేాయలి. . దీన్ని జుట్టులోపలి వరకూ అప్లై చేయాలి. 10 నిముషాల మసాజ్ చేసి తర్వాత ఒక గంట రెండు గంటల పాటు అలాగే వదిలేసి తర్వాత తలస్నానం చేయాలి.

English summary

10 Ayurveda Remedies For Dandruff

Ayurvedic Cures For Dandruff, Dandruff might be the result of a number of factors such as frequent heat or cold exposure, excessive exposure to hair styling products, chronic constipation, stress, fatigue, pollution and much more.
Story first published: Thursday, February 9, 2017, 12:29 [IST]
Desktop Bottom Promotion