For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెల్లజుట్టు ఉన్నప్పుడు ఖచ్ఛితంగా చేయకూడని 8 పొరపాట్లు

|

తెల్ల జుట్టు ఉందంటే.. దాన్ని నల్లగా మార్చడానికి, అది కనపడకుండా చేయడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటాం. కానీ.. తెల్ల జుట్టు విషయంలో కొన్ని పొరపాట్లు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదని.. ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు.

తాజా అధ్యయనాల ప్రకారం ప్రతి 5మంది మహిళల్లో ముగ్గురు తెల్లజుట్టుని పొందుతున్నారట. అది కూడా.. 30లలోనే జుట్టు తెల్లబడిపోతోందట. మగవాళ్లకైతే.. మరీ టీనేజ్ లోనే తెల్లజుట్టు సమస్య ఎదురవుతోందట.

 8 Things You Should Never Do To Your Grey Hair

మొదటిసారి తెల్లజుట్టు వచ్చినప్పుడు.. ఫస్ట్ రియాక్షన్ అయోమయం. దాన్ని పీకేయాలా వద్దా అనే ప్రశ్న వేధిస్తుంది. లేదా న్యాచురల్ డై వేసుకోవాలా, సలూన్ కి వెళ్లాలా అన్న డౌట్స్ కూడా ఉంటాయి. రకరకాల ప్రశ్నలు, జవాబులు ఉంటాయి. అయితే.. కొన్ని పనులు మాత్రం ఏమాత్రం చేయకూడదని.. సూచిస్తున్నారు. మరి తెల్లజుట్టు సమస్య ఉన్నవాళ్లు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడని పొరపాట్లు, తప్పులు ఏంటో చూద్దామా..

తెల్లజుట్టు పీకకూడదు

తెల్లజుట్టు పీకకూడదు

తెల్లజుట్టు పీకడం వల్ల మరిన్ని ఎక్కువ తెల్లజుట్టు వస్తుందని అపోహ ఉంది. అయితే న్యాచురల్ పిగ్మెంటెడ్ హెయిర్ కంటే.. తెల్ల జుట్టు కొంచెం రఫ్ గా ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని లాగుతారో.. అది మళ్లీ తెల్లజుట్టుగానే పెరుగుతుంది. కాబట్టి.. తెల్లజుట్టు కనిపించినా.. దాన్ని ఏమీ చేయకుండా వదిలేయండి.

<strong>చిన్నవయస్సులో జుట్టు తెల్లబడుటకు వైద్య కారణాలు </strong>చిన్నవయస్సులో జుట్టు తెల్లబడుటకు వైద్య కారణాలు

రూట్స్ నుంచి పీకరాదు

రూట్స్ నుంచి పీకరాదు

తెల్ల జుట్టు ఉంటే.. దాన్ని కుదుళ్ల నుంచి ఎట్టిపరిస్థితుల్లో పీకేయరాదు. ఎందుకంటే.. అలా పీకేయడం వల్ల స్కాల్ప్ ఎర్రగా మారి.. బ్లడ్ సప్లై అందదు. దీనివల్ల జుట్టు మళ్లీ పెరగదు.

నిర్లక్ష్యం చేయకూడదు

నిర్లక్ష్యం చేయకూడదు

తెల్ల జుట్టు ఉంటే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. తెల్లజుట్టుకి వారసత్వం, జింక్, ఐరన్ లోపం కూడా కారణమవుతాయి. కాబట్టి జుట్టంతా తెల్లబడకముందే.. న్యాచురల్ రెమిడీస్ ఫాలో అవడం మంచిది.

స్మోకింగ్ వద్దు

స్మోకింగ్ వద్దు

స్మోకింగ్ శరీర వయసు ఛాయలనుపెంచుతుంది. అలాగే.. మెలనిన్ లెవెల్ ని కోల్పోతుంది. అలాగే జుట్టుని కుదుళ్ల నుంచి కోల్పోతారు. కొన్ని సందర్భాల్లో బట్టతలకు కూడా దారితీస్తుంది. కాబట్టి స్మోకింగ్ ను ఇవాళే మానేయడం మంచిది.

ప్రతిరోజూ హెయిర్ వాష్

ప్రతిరోజూ హెయిర్ వాష్

ప్రతిరోజూ జుట్టుకి షాంపూ చేయడం వల్ల.. అది న్యాచురల్ ఆయిల్ ని కోల్పోతుంది. దీనివల్ల జుట్టు చిట్లిపోతుంది. కాబట్టి.. వారానికి రెండుమూడు సార్లు తలస్నానం చేయడం మంచిది.

<strong>తెల్లజుట్టు కనబడకుండా చేయడానికి 5అద్భుత ఉపాయాలు </strong>తెల్లజుట్టు కనబడకుండా చేయడానికి 5అద్భుత ఉపాయాలు

అమ్మోనియా డై వాడకూడదు

అమ్మోనియా డై వాడకూడదు

తెల్ల జుట్టు ఉన్నప్పుడు అమ్మోనియా బేస్డ్ డై ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు. అవి తాత్కాలికంగా మీ జుట్టుని నల్లగా మార్చినా.. తర్వాత జుట్టు రాలడానికి కారణమవుతుంది. కాబట్టి.. ఆర్గానిక్ డై వాడాలి.

రెగ్యులర్ గా ట్రిమ్ చేయకపోవడం

రెగ్యులర్ గా ట్రిమ్ చేయకపోవడం

తెల్లజుట్టు ఉన్నప్పుడు.. జుట్టు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. కాబట్టి.. కనీసం 6 నుంచి 8 వారాలకు ఒకసారి జుట్టుని కట్ చేస్తూ ఉండాలి.

తెల్లజుట్టు శాశ్వత పరిష్కారానికి బెస్ట్ నేచురల్ టిప్స్..!తెల్లజుట్టు శాశ్వత పరిష్కారానికి బెస్ట్ నేచురల్ టిప్స్..!

ఒకేషాంపూ ఉపయోగించకూడదు

ఒకేషాంపూ ఉపయోగించకూడదు

చాలా కాలం వరకు ఒకే రకమైన షాంపూ ఉపయోగించరాదు. జుట్టు తెల్లగా మారడం, కలర్ మారడం, టెక్చర్ మారడం అనేది.. జుట్టుకి మరింత సంరక్షణ కావాలని సంకేతం. కాబట్టి.. మీ తెల్ల జుట్టుకి కావాల్సిన పోషకాలు ఉండే షాంపూనే ఉపయోగించాలి.

English summary

8 Things You Should Never Do To Your Grey Hair

What You Should Never Do To Your Grey Hair? Have a look at the things to not do if you have grey hair.
Story first published: Saturday, June 24, 2017, 18:23 [IST]
Desktop Bottom Promotion