For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నువ్వుల నూనెను జుట్టుకు అప్లై చేస్తే పొందే అద్భుత ప్రయోజనాలు..!

నువ్వుల నూనెను ఇండియాలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులోని అమోఘమైన హెల్త్ బెన్ఫిట్స్ మనందరికీ బాగా తెలుసు. కానీ..వాటిని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.

|

నువ్వుల నూనెను ఇండియాలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులోని అమోఘమైన హెల్త్ బెన్ఫిట్స్ మనందరికీ బాగా తెలుసు. కానీ..వాటిని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి, జుట్టు సౌందర్యానికి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

చర్మ ఆరోగ్యానికి నువ్వుల నూనె ఏంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నువ్వుల నూనె మన చర్మానికి సహజ కాంతిని ఇవ్వడమే కాకుండా ముఖం మీద మొటిమలు, మచ్చలు లేకుండా చేస్తుంది. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.

నువ్వుల విత్తనాల నుంచి తయారు చేసే నువ్వుల నూనె వంటకాలలో, ఆయుర్వేదంలో ప్రపంచ వ్యాప్తంగా విరివిగా వినియోగించబడుతోంది. అన్ని నూనెల్లోకి నువ్వుల నూనె శ్రేష్టమైనది. నువ్వులలో నూనె పదార్థంతో పాటు ప్రొటీన్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే.. ఇది ఆరోగ్యానికే కాదు.. జుట్టు, చర్మ సౌందర్యానికి కూడా అద్భుత ప్రయోజనాలు అందిస్తుంది.

నువ్వుల నూనె హైలీ న్యూట్రీషియన్ ఫుడ్, ఇందులో హీలింగ్, లూబ్రికేటింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవన్నీ జుట్టును ఆరోగ్యాంగా ఉంచుతాయి. ఇందులో విటమిన్ ఇ, బికాంప్లెక్స్, మరియు మనిరల్స్, మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్, ప్రోటీన్లు అధికంగా ఉన్నాయి. ఇవి జుట్టులోపల నుండి పోషణను అందిస్తాయి. నువ్వుల నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

 తెల్ల జుట్టును నివారిస్తుంది:

తెల్ల జుట్టును నివారిస్తుంది:

నువ్వుల నూనెను తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇది తెల్ల జుట్టును నివారించడంతో పాటు, జుట్టుకు నేచురల్ కలర్ ను అందిస్తుంది. నువ్వుల నూనెలో హెయిర్ డార్క్ చేసే లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఈ నూనెను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

నువ్వుల నూనె తలకు అప్లై చేయడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది, దాంతో జుట్టు పెరుగుతుంది. జుట్టుకు మొదలకు, హెయిర్ ఫోలిసెల్స్ కు పోషణను అందిస్తుంది.

యూవి కిరణాల నుండి జుట్టుకు రక్షణ కల్పిస్తుంది:

యూవి కిరణాల నుండి జుట్టుకు రక్షణ కల్పిస్తుంది:

నువ్వుల నూనెలో మరో బెనిఫిట్ . సూర్యుని నుండి వెలువడే హానికరమైన యూవి కిరణాల నుండి రక్షణ కల్పిస్తుంది. జుట్టు డ్యామేజ్ కాకుండా యూవి కిరణాల నుండి జుట్టుకు రక్షణ కల్పిస్తుంది. అలాగే పొల్యూషన్ నుండి జుట్టు పాడవ్వకుండా రక్షణ కల్పిస్తుంది.

పేలను నివారిస్తుంది:

పేలను నివారిస్తుంది:

నువ్వుల నూనెలో ఉండే ఔషధ గుణాలు తలలో పేలను నివారిస్తుంది. రెగ్యులర్ గా తలకు షాంపు చేయడానికి ముందు నువ్వుల నూనెను అప్లై చేసి మర్ధన చేయాలి. ఇది ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను దూరం చేస్తుంది.

జుట్టును స్మూత్ గా మార్చుతుంది:

జుట్టును స్మూత్ గా మార్చుతుంది:

నువ్వు నూనెలో స్మూతింగ్ మరియు ట్రాన్సిక్యూలైజింగ్ లక్షణాలు అద్భుతంగా ఉన్నాయి. హానికరమైన వేడి వల్ల హెయిర్ ఫాలీ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. నువ్వల నూనె తలను కూల్ గా ఉంచుతుంది, జుట్టు లోపలి నుండి బయట వరకూ కూలింగ్ ఎఫెక్ట్స్ ను అందిస్తుంది. నువ్వుల నూనె జుట్టుకు కావల్సిన మాయిశ్చరైజింగ్ ను అందివ్వడంతో పాటు, డ్యామేజ్ కాకుండా చేస్తుంది.

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారిస్తుంది:

నువ్వుల నూనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తలకు పట్టించాలి. చేతి వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేయాలి. తలలో స్మూత్ నెస్ ను ఇస్తుంది. తిరిగి చుండ్రు ఏర్పడకుండా ఉంటుంది.

పొడి జట్టును నివారిస్తుంది:

పొడి జట్టును నివారిస్తుంది:

రూట్ జ్యూస్ నువ్వుల నూనె నిమ్మరసం, మిక్స్ చేసి తలకు పూర్తిగా అప్లై చేయాలి. చేతి వేళ్ళతో మర్ధ చేయాలి.రాత్రుల్లో అప్లై చేస్తే ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటాయిడ్రైగా మారిన జుట్టు, స్కాల్ప్ డాండ్రఫ్ కి దారితీస్తుంది. నువ్వుల నూనెలో ఉండే విటమిన్స్, పోషకాలు, మినరల్స్ తో పాటు యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్.. పొడి జుట్టుని, స్కాల్ఫ్ ని నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

 జుట్టు చిట్లిపోవడాన్ని నివారించడానికి

జుట్టు చిట్లిపోవడాన్ని నివారించడానికి

జుట్టు చిట్లిపోవడాన్ని నివారించడానికి జుట్టుకి న్యాచురల్ కండిషనర్ గా పనిచేస్తుంది . నువ్వుల నూనె.జుట్టుకి మాయిశ్చరైజర్ అందించి.. చిట్లిపోవడాన్ని అరికట్టి.. జుట్టుని సాఫ్ట్ గా మారుస్తుంది. రెగ్యులర్ హెయిర్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె కలిపి జుట్టుకి పట్టించాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Amazing Benefits Of Sesame Oil For Hair

Amazing Benefits Of Sesame Oil For Hair ,Sesame oil is also known as gingelly oil. It is highly nourishing, healing and lubricating. Other than being used as a flavor enhancing cooking oil, it has many beauty benefits too. Sesame oil is popularly used for hair growth and to maintain scalp health. It is enrich
Desktop Bottom Promotion