For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అశ్వగంధ ఆరోగ్యం, సెక్స్ సామర్థ్యం పెంచడమే కాదు, జుట్టుకి కలుగజేసే ప్రయోజనాల గురించి తెలుసుకోండి..

అశ్వగంధ - ఈ ఔషధీయ వనమూలిక వైద్య ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఇండియన్ జిన్సెంగ్ లేదా అశ్వగంధ అనే ఈ ఔషధ మొక్క ప్రత్యేకంగా కనిపించకపోయినా చిన్నగా కేవలం 35 నుండి 75 సెంటీమీటర్ల పొడవు మాత్రమేనున్నా తనలో

|

అశ్వగంధ - ఈ ఔషధీయ వనమూలిక వైద్య ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఇండియన్ జిన్సెంగ్ లేదా అశ్వగంధ అనే ఈ ఔషధ మొక్క ప్రత్యేకంగా కనిపించకపోయినా చిన్నగా కేవలం 35 నుండి 75 సెంటీమీటర్ల పొడవు మాత్రమేనున్నా తనలోనున్న ఔషధ విలువలతో మానవజాతికి ఎంతో సహాయపడుతోంది. చక్కటి ఔషధ విలువలు కలిగిన అశ్వగంధ యొక్క బెర్రీలు అలాగే వేర్లు ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగపడతాయి.

యాంటీఆక్సిడాంట్ పుష్కలంగా కలిగిన అశ్వగంధలో రోగనిరోధక శక్తిని పెంపొందించే లక్షణం కలదు. ఆంతే కాదు, నిద్రలేమి సమస్యను తొలగించడంతో పాటు ఒత్తిడిని తొలగించడానికి కూడా అశ్వగంధ సహాయపడుతుంది. ఇంకా అశ్వగంధలో యాంటీకాంవాల్సన్ట్ తో పాటు యాంటీబాక్టీరియల్ ప్రాపర్టీస్ కలవు. అన్ని రకాల వ్యాధులకు ఈ ఔషధ మూలిక అద్భుతంగా పనిచేస్తుంది.

Ashwagandha Nutrition Facts

అశ్వగంధ అంటే ఏంటి?

'వితానియా సోమ్నిఫెరా' అనేది అశ్వగంధ యొక్క శాస్త్రీయ నామం. అయితే, సర్వసాధారణంగా ఈ మూలికను 'ఇండియన్ జింసెంగ్' లేదా 'ఇండియన్ వింటర్ చెర్రీ' అనంటారు.

అశ్వగంధని ఎందుకు వాడతాము?

అశ్వగంధ వల్ల కలిగే ఉపయోగాలు అనేకం. మేధాశక్తిని పెంపొందించడంలో పాటు ఈ ఔషధ మూలికలో నాడీవ్యవస్థను మెరుగుపరిచే లక్షణం కూడా కలదు. అలాగే జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో అశ్వగంధ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో ఈ మూలికకు పునరుత్పత్తి అలాగే ఆరోగ్యకరమైన లైంగిక సమతుల్యం కలించే సామర్థ్యం కలదు.

శరీరానికి ఒత్తిడి తట్టుకునే శక్తిని అందించే సామర్ధ్యం కలదు. అదే విధంగా తెల్ల రక్త కణాలను బాలన్స్ చేయడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచే లక్షణం అశ్వగంధలో కలదు.

అంతే కాదు, అశ్వగంధలో లభించే ముఖ్యమైన యాంటీఆక్సిడాంట్ మిమ్మల్ని సూర్యరశ్మి వలన కలిగే విషపూరిత ఫ్రీ రాడికల్ డామేజ్ నుంచి రక్షించి తద్వారా వేగంగా వృద్ధాప్యం చెందడం నుంచి రక్షిస్తుంది.

Ashwagandha Nutrition Facts

అశ్వగంధ న్యూట్రిషన్ గూర్చి కొన్ని వాస్తవాలు :

అనామ్లజనకాలు, ఐరన్, టానిన్లు, నైట్రేట్స్, పొటాషియం, గ్లూకోజ్, మరియు కొవ్వు ఆమ్లాలను వంటి పదార్థాలను కలిగి ఉన్న ఒక గొప్ప పోషకాహారాల మిశ్రమము ఈ అశ్వగంధము. ఇది సోమ్నిఫెరిన్, సోమినైన్, అఫిరిన్ మరియు అటానోలైడ్స్ వంటి కొన్ని ముఖ్యమైన స్టెరాయిడ్ అల్కలాయిడ్లను కలిగి ఉంటుంది. అదనంగా ఇంకేమైనా జోడించబడినదా? అంటే, ఇది ఫ్లేవానాయిడ్స్, లాక్టోన్స్, మరియు అసిల్ స్టెరిల్ గ్లూకోసైడ్స్ వంటి వాటిని సమృద్ధిని కలిగి ఉంది.

జుట్టు కోసం, అశ్వగంధము కలుగజేసే ప్రయోజనాలు :

సరైన రీతిలో లేని జుట్టును పరిరక్షించడంలో విసిగిపోయారా? ఈ పరిస్థితిని అధిగమించటానికి అశ్వగంధము ఉందిగా ! ఇలాంటి సమయంలో, అశ్వగంధము లేకుండా ఏదైతే సాధ్యపడదో, దాని యొక్క విజయాన్ని చూసి మీరు ఆశ్చర్యపోక తప్పదు. బాగా చెప్పాలంటే, బహుశా ప్రపంచంలో శాంతి ఎక్కడా లేకపోయినా, కానీ మీ జుట్టుకు మాత్రం ఉంటుంది, అలా అశ్వగంధము మిమ్మల్ని మరలా మిమ్మల్ని వెనక్కి తీసుకు వస్తుంది !

1. తలపై ఉన్న చర్మము యొక్క సర్క్యులేషన్ను మెరుగుపరుస్తుంది :

1. తలపై ఉన్న చర్మము యొక్క సర్క్యులేషన్ను మెరుగుపరుస్తుంది :

జుట్టుకు (లేదా) మీ తలపై ఉన్న చర్మపు రోగాలకి చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగి ఉన్న అశ్వగంధం, జుట్టు చర్మం మీద రక్త ప్రసరణను మెరుగుపరిచగల సామర్థ్యం కలిగి ఉంది.

ఇది మీకు ఎందుకు అవసరం? రక్త ప్రసరణ మెరుగుపడినప్పుడు, మీ వెంట్రుకల యొక్క ఫోలికల్స్ మరింత పోషకాలను పొందుతాయి, ఫలితంగా బలమైన, మృదువుగా ఉన్న ఒత్తైన జుట్టు మీ సొంతం కాగలదు.

2.తక్కువగా చిట్లకుండా బలమైన జుట్టును ఇస్తుంది :

2.తక్కువగా చిట్లకుండా బలమైన జుట్టును ఇస్తుంది :

అశ్వగంధం మరియు జుట్టు నష్ట నివారణ ప్రతిచర్య అనేవి రెండింటికీ పర్యాయపదాలుగా ఉంటాయి. తరచుగా మీ జుట్టు రాలడానికి బాధ్యుడిగా ఉన్న అతిపెద్ద నేరస్థుల్లో ఒకరు "ఒత్తిడి". మీ శరీరంపై ఒత్తిడిని దరిచేరకుండా ఉండే హానికరమైన ప్రభావాలకు సంబంధించిన కార్టిసాల్ స్థాయిలు తగ్గించడంలో ఆశ్వగంధము పాత్ర మీకు తెలిసినదే, జుట్టు చిట్లకుండా మరియు రాలిపోవడం వంటి సమస్యలను గణనీయంగా తగ్గిస్తుంది.

3. చుండ్రుని తొలగిస్తుంది :

3. చుండ్రుని తొలగిస్తుంది :

తామర, చర్మ సోరియాసిస్, మరియు చుండ్రు వంటివి; తాపజనక కారకాలు కలుగజేసే చర్మ పరిస్థితుల చికిత్స కోసం - అశ్వగంధము యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉన్నందున, వాటి అన్నింటి మీద శక్తివంతమైన చికిత్సా విధానంగా పనిచేసి వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది.

4. జుట్టు ఫోలికల్స్ ను ప్రేరేపిస్తుంది :

4. జుట్టు ఫోలికల్స్ ను ప్రేరేపిస్తుంది :

కొన్ని ఔషధ గుణం కలిగిన షాంపూలలో, కండిషనర్లలో ఈ అశ్వగంధాన్ని కూడా కలపబడి ఉంటుంది. ఇది జుట్టు ఫోలికల్స్ ప్రేరేపిస్తూ, తద్వారా మీ జుట్టు యొక్క ఆరోగ్యమును సంరక్షిస్తూ మరియు కాంతివంతంగా ఉండేదిగా సహాయ పడుతుంది.

5. జుట్టు బూడిద రంగులోకి మారే పరిస్థితిని నిరోధిస్తుంది :

5. జుట్టు బూడిద రంగులోకి మారే పరిస్థితిని నిరోధిస్తుంది :

జుట్టు మెలనిన్ (33) ఉత్పత్తిని పెంచుకోవడానికి అశ్వగంధము ప్రసిద్ధి చెందినది. మెలనిన్ అనేది మీ జుట్టుకు సహజ రంగును ఇస్తుంది, మరియు దాని యొక్క ఉత్పత్తిని పెంచబడినప్పుడు, మీరు బూడిద రంగులో ఉన్న జుట్టును తక్కువ ఉండటాన్ని చూడవచ్చు.

English summary

Ashwagandha Nutrition Facts and Benefits Of Ashwagandha For Hair

Rich in antioxidants, iron, tannins, nitrates, potassium, glucose, and fatty acids, Ashwagandha is a nutritional jackpot. It also contains some essential steroidal alkaloids like somniferine, sominine, anferine, and withanolides. Added bonus? It also possesses an abundance of flavonoids, lactones, and acyl steryl glucosides.
Story first published:Wednesday, November 29, 2017, 16:20 [IST]
Desktop Bottom Promotion