For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జుట్టు రాలడం తగ్గించి, జుట్టు ఒత్తుగా పెరగేలా చేసే ఆముదం నూనె

|

ఆముదపు నూనె మీ జుట్టును వత్తుగా నిజంగానే పెంచుతుందా అనే మీ ప్రశ్నకు సింపుల్ గా జవాబు చెప్పాలంటే, అవును అది నిజమే. కానీ ఆముదపు నూనె లాభాలన్నిటినీ ఒక ప్రశ్నకి జవాబుగా తేల్చేయలేం. ఆముదపు నూనె వాడకం గూర్చి అనేకప్రశ్నలున్నాయి, వాటిల్లో సాధారణంగా అందరూ అడిగేవాటిని మేము ఇక్కడ పొందుపరిచాం.

ఆన్ లైన్ లేదా మీ స్థానిక కిరాణాషాపుల్లో సులభంగా దొరికే , ఆముదపు నూనెను ఆముదం విత్తనాల నుండి తీస్తారు. ఇది పలచటి పసుపు రంగులో వుండి అనేక రూపాల్లో వస్తుంది.

<strong>కళ్ళ క్రింద నల్లని వలయాలను తొలగించుకోవడానికి ఆముదం ఎలా వాడాలి?</strong>కళ్ళ క్రింద నల్లని వలయాలను తొలగించుకోవడానికి ఆముదం ఎలా వాడాలి?

Does Castor Oil Really Boost Hair Growth

అందుకని మీరు రేపటినుంచే ఆముదం నూనెను మీ జుట్టు సంరక్షణ కోసం వాడుకోవచ్చు.మొదలుపెట్టేముందు ఈ కొన్ని ప్రశ్నలు వాటికి జవాబులు తెలుసుకోండి.

మీ జుట్టుకి ఆముదపు నూనె వాడకం సంబంధ ప్రశ్నలను తెలుసుకుని తర్వాత వాడాలో లేదో నిర్ణయించుకోండి.

<strong>ఆముదం తలకే కాదు.. చర్మానికీ ఎంతో మేలుచేస్తుంది..!</strong>ఆముదం తలకే కాదు.. చర్మానికీ ఎంతో మేలుచేస్తుంది..!

1. ఆముదం నూనె ఏ జుట్టు సమస్యలపై పనిచేస్తుంది?

1. ఆముదం నూనె ఏ జుట్టు సమస్యలపై పనిచేస్తుంది?

మీ జుట్టు అన్నివిధాలుగా బాగుంటే, ఆముదం నూనెను మీ జుట్టు సంరక్షణలో భాగం చేయాల్సిన అవసరం ఏముంది? దానిబదులు, ఆముదం నూనె పనిచేసే, పరిష్కరించే ఈ జుట్టు సమస్యల లిస్టును చూసి అప్పుడు ఎంచుకోండి. మీకు ఈ కింది ఏ జుట్టు సమస్యలున్నా ఆముదం నూనె వాడితే మంచిది. లేకపోతే లేదు.

జుట్టు చాలా ఊడిపోవటం, పెరగకపోవటం చుండ్రు మరియు మొదళ్ళలో చర్మం ముక్కలుగా ఊడిపోవటం జుట్టు చివర్ల వెంట్రుకలు తెగిపోవటం ( ముఖ్యంగా పొడుగు జుట్టు వారికి) జుట్టు చిక్కుపడటం (ఆముదం నూనె సహజ కండీషనర్) జుట్టు రంగు పోయి పాలిపోతుండటం

2. పాడైపోయిన జుట్టుకి ఆముదం నూనెను వాడాల్సిన ఒక్క ప్రత్యేక కారణం ఏంటి ఇప్పుడు?

2. పాడైపోయిన జుట్టుకి ఆముదం నూనెను వాడాల్సిన ఒక్క ప్రత్యేక కారణం ఏంటి ఇప్పుడు?

ఆముదం నూనెను మీ జుట్టు సంరక్షణలో భాగం చేయటానికి ఉపయోగపడే దాని ముఖ్యలక్షణం దాని తేమగుణం. ఆముదం నూనె జుట్టుపై తేమను ఆకర్షించి పట్టి ఉంచుతుంది.ఇది కూడా జుట్టు పెరగటానికి సాయపడుతుంది.అందువల్ల మీరు ఆముదం నూనెను 2-3వారాలు వరసగా వాడితే మీ జుట్టు ఊడిపోవటం తగ్గిపోతుంది. అదే నెలలు వాడుతూ పోతే, మీ జుట్టు పెరగటం, ఒత్తుగా మారటాన్ని చూస్తారు.

3. ఆముదం నూనెను కనుబొమలు,కనురెప్పలపై కూడా వాడవచ్చా?

3. ఆముదం నూనెను కనుబొమలు,కనురెప్పలపై కూడా వాడవచ్చా?

ఆముదం నూనె ఏ జుట్టుపైనైనా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మీరు కనుబొమలు, కనురెప్పలపై కూడా వాడవచ్చు. కానీ కొంతమంది ఆముదం నూనె రాయటం వల్ల కళ్ళలో మంట కలిగిందని చెప్తారు. దీనికి పరిష్కారం, ఆముదం నూనెను కనుబొమ్మల చివర్లలో ప్రయత్నించండి. మీ కళ్లకి ఏ మంట కలగకపోతే నిరభ్యంతరంగా దీన్ని కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలకి వాడుకోవచ్చు.

4. ఏ రకమైన ఆముదం నూనె జుట్టుపై వాడాలి?

4. ఏ రకమైన ఆముదం నూనె జుట్టుపై వాడాలి?

మీరు షాపులో ఆముదం నూనెను కొనడానికి వెళ్తే, మీకు ఏ రకపు ఆముదం నూనె కావాలో తెలిసివుండాలి. మేము మీకు ఎన్నిరకాల ఆముదం నూనెలు ఉన్నాయో చెప్పి, ఏది మంచిదో కూడా చెప్తాము. అందుకని సందేహపడవద్దు.

ఆర్గానిక్/ కోల్డ్ ప్రెస్డ్ ఆముదం నూనె - దురద పుడుతూ, ఎండిపోయిన రింగుల జుట్టు కలవారికి

జమైకన్ నల్లని ఆముదం నూనె - స్ట్రెయిట్ జుట్టుకలవారికి

ఆముదం మైనం - నేరుగా వాడటానికి కాదు; మేకప్ మరియు జుట్టు సంబంధ ఉత్పత్తులలో కలుపుతారు.

5. జుట్టుపై ఆముదం నూనె తరచూ ఎన్నిసార్లు వాడవచ్చు?

5. జుట్టుపై ఆముదం నూనె తరచూ ఎన్నిసార్లు వాడవచ్చు?

ఈ ప్రశ్నకి జవాబు కష్టం ఎందుకంటే ఇది వ్యక్తిగత ఇష్టం. అది మీ జుట్టు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నదన్నదానిపై, సమస్యలపై కూడా ఆధారపడి ఉంటుంది.ఒకసారి ఇది చూడండి.

మీ జుట్టు పొడుగు, ఒత్తుగా, త్వరగా పెరగాలనుకుంటే వారానికి 4 సార్లు ఆముదం నూనె రాసుకోండి, చుండ్రు వంటి సమస్యలకి వాడుతున్నట్లయితే వారానికి ఒకసారి వాడితే చాలు.

ఆముదం నూనెను హెయిర్ కండీషనర్ గా వాడుతున్నట్లయితే, తలంటు పోసుకున్న ప్రతిసారీ వాడండి. కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలకి వాడుతున్నట్లయితే ప్రతిరోజూ పడుకునే ముందు వాడవచ్చు.

6. ఆముదం నూనెను జుట్టుపై ఎలా రాయాలి?

6. ఆముదం నూనెను జుట్టుపై ఎలా రాయాలి?

ఆముదం నూనెను జుట్టుపై రాయడానికి అనేక విధానాలున్నాయి. మేము మీకు అన్నిరకాల జుట్టులకి సరిపోయే, సులభమైన,త్వరగా అయిపోయే విధానాన్ని చెప్తున్నాం.

ఆముదం నూనె రాస్తున్నప్పుడు, హెయిర్ బ్రష్ వాడండి. మరకలు పడవచ్చు కాబట్టి పాత బట్టలు వేసుకోండి. మీ జుట్టును సెక్షన్లులాగా విడగొట్టి, ఆముదం నూనెను బ్రష్ తో మధ్యలో రాయండి. జుట్టుపై చేత్తో రాస్తూ నూనె పట్టేట్లా చేయండి.

పెద్ద జుట్టు ఉన్నవారు, మొదళ్ల నుంచి మొదలుపెట్టి చివర్ల వరకూ రాయండి. ఆముదం నూనె రాసుకున్న తర్వాత బయటపడ్డ చిందులను టిష్యూ లేదా గుడ్డతో తుడిచేయండి.

నూనె రాసిన అరగంట వరకూ షవర్ క్యాప్ ధరించి, ఇంకేట్లా నాననివ్వండి. కొంతమంది నూనె రాసేసి రాత్రంతా వదిలేస్తే మంచిదంటారు కానీ అది మరీ ఎక్కువ సమయం. నూనె చాలా పల్చగా కన్పిస్తుంది కాబట్టి తొందరగానే జుట్టు కుదుళ్ళలోకి పాకుతుంది.

అరగంట తర్వాత మొదట షాంపూతో తలంటు పోసుకుని,తర్వాత కండీషనర్ రాసుకోండి.

English summary

Does Castor Oil Really Boost Hair Growth in Telugu

To simply answer the question, does castor oil really boost hair growth, the answer is yes. However, use of castor oil and its benefits cannot be summed up to answer one question. There are many questions regarding the use of castor oil and today, we list the most common of them.
Story first published:Tuesday, October 10, 2017, 10:29 [IST]
Desktop Bottom Promotion