For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు తప్పక ప్రయత్నించవలసిన డీప్ కండిషనింగ్ యోగర్ట్ హెయిర్ మాస్క్స్

దెబ్బతిన్న, నిస్తేజంగా కనిపిస్తున్న శిరోజాలను డీప్ కండిషనింగ్ ద్వారా సాధారణ స్థితికి తీసుకురావచ్చు. ఈ చికిత్స ద్వారా శిరోజాలలో సహజసిద్ధమైన తేమను పునరుద్ధరించవచ్చు. తద్వారా, శిరోజాలకు అవసరమైన సంరక్షణ ల

|

దెబ్బతిన్న, నిస్తేజంగా కనిపిస్తున్న శిరోజాలను డీప్ కండిషనింగ్ ద్వారా సాధారణ స్థితికి తీసుకురావచ్చు. ఈ చికిత్స ద్వారా శిరోజాలలో సహజసిద్ధమైన తేమను పునరుద్ధరించవచ్చు. తద్వారా, శిరోజాలకు అవసరమైన సంరక్షణ లభిస్తుంది. ఆ విధంగా, శిరోజాల ఆకృతి మెరుగవడంతో పాటు ప్రకాశవంతంగా మారతాయి.

ఇవే కాకుండా, డీప్ కండిషనింగ్ వలన శిరోజాలు వేగంగా పెరుగుతాయి. అలాగే, శిరోజాలు దృఢంగా ఉండేందుకు డీప్ కండిషనింగ్ తోడవుతుంది. ఈ ట్రీట్మెంట్ కోసం, మీరు మార్కెట్ లో లభ్యమయ్యే కమర్షియల్ ప్రోడక్ట్ ని వాడవచ్చు లేదా ఇంటి వద్దే సహజసిద్ధమైన డీప్ కండిషన్ మాస్క్ ని తయారుచేసుకుని ఆ హోంమేడ్ ప్రాడక్ట్ ని వాడవచ్చు. 100 శాతం సురక్షితమైన హోంమేడ్ డీప్ కండిషనింగ్ మాస్క్ ని వాడితే శిరోజాలపై ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

deep conditioning yogurt hair mask

డీప్ కండిషనింగ్ యోగర్ట్ హెయిర్ మాస్క్

శిరోజాలకు సంపూర్ణ పోషణనివ్వడానికి కొన్ని పదార్థాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. అటువంటి వాటిలో యోగర్ట్ (పెరుగు) ఒకటి. యోగర్ట్ అనేది ప్రోటీన్స్ కి నిలయంగా మారింది. అంతే కాదు, ఇందులో ల్యాక్టిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తుంది. అందుకే, యోగర్ట్ ని శిరోజాలకు సరైన పోషణనిచ్చే అద్భుతమైన పదార్థంగా పేర్కొంటారు. యోగర్ట్ తో చేసుకునే డీప్ హెయిర్ కండిషనింగ్ మాస్క్ వలన శిరోజాలు ఆరోగ్యంగా, సిల్కీగా మరియు మృదువుగా మారతాయి.

ఇక్కడ, యోగర్ట్ తో చేసుకునే డీప్ కండిషనింగ్ హెయిర్ మాస్క్స్ ల జాబితాను సిద్ధం చేసాము. ఈ హెయిర్ మాస్క్ లను మీరు ఎంతో సులభంగా చేసుకోవచ్చు. వీటిని వాడటం ద్వారా మీ శిరోజ సంపదను కాపాడుకోవచ్చు.

1. యోగర్ట్ + ఆల్మండ్ ఆయిల్

1. యోగర్ట్ + ఆల్మండ్ ఆయిల్

నాలుగు టీస్పూన్ల యోగర్ట్ తో రెండు టేబుల్ స్పూన్ల ఆల్మండ్ ఆయిల్ ను కలపండి.

ఈ మాస్క్ తో మీ స్కాల్ప్ పై మసాజ్ చేయండి. మీ జుట్టు చివర్లకి కూడా ఈ మాస్క్ తో మసాజ్ చేయండి.

ఒక గంట పాటు ఈ మాస్క్ ని ఆరనివ్వండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో మీ శిరోజాలను శుభ్రపరుచుకోండి.

ఈ డీప్ కండిషనింగ్ హెయిర్ మాస్క్ మీ శిరోజాలపై అద్భుతాలు సృష్టిస్తుంది.

2. యోగర్ట్ + తేనె

2. యోగర్ట్ + తేనె

రెండు టేబుల్ స్పూన్ల యోగర్ట్ ని ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ స్కాల్ప్ తో పాటు శిరోజాలపై కూడా అప్లై చేయండి.

ముప్పై నిమిషాల తరువాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి.

వారానికి ఒకసారి ఈ డీప్ కండిషనింగ్ మాస్క్ ని వాడటం వలన శిరోజాలు మృదువుగా సిల్కీగా మారతాయి.

3. యోగర్ట్ ఎగ్ + కొబ్బరి నూనె

3. యోగర్ట్ ఎగ్ + కొబ్బరి నూనె

ఒక టేబుల్ స్పూన్ యోగర్ట్ తో ఒక ఎగ్ ని అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెని కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ స్కాల్ప్ పై అలాగే శిరోజాలపై అప్లై చేయండి.

ఒక గంట తరువాత హెర్బల్ షాంపూతో పాటు గోరువెచ్చటి నీటితో శిరోజాలను శుభ్రపరుచుకోండి.

మెరిసే, ప్రకాశవంతమైన శిరోజాలను పొందటం కోసం నెలలో రెండు సార్లు ఈ మాస్క్ ని వాడాలి.

4. యోగర్ట్ అరటిపండు+ రోజ్ వాటర్

4. యోగర్ట్ అరటిపండు+ రోజ్ వాటర్

బాగా పండిన అరటిపండును గుజ్జులా చేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ యోగర్ట్ ని అలాగే ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ని కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై అలాగే శిరోజాలపై అప్లై చేయాలి.

ఒక గంట తరువాత, గోరువెచ్చటి నీటితో శిరోజాలను శుభ్రపరచుకోవాలి.

రెండువారాలకి ఒకసారి ఈ మాస్క్ ను అప్లై చేయడం ద్వారా శిరోజాల సౌందర్యాన్ని సంరక్షించుకోవచ్చు.

5. యోగర్ట్ + అవొకాడో

5. యోగర్ట్ + అవొకాడో

ఒక అవొకాడో ని మ్యాష్ చేసుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల తాజా యోగర్ట్ ని జోడించండి.

ఈ మాస్క్ ని స్కాల్ప్ పై అలాగే శిరోజాలపై అప్లై చేయాలి.

నలభై నిమిషాల తరువాత హెర్బల్ షాంపూతో పాటు గోరువెచ్చటి నీటితో శిరోజాలను శుభ్రం చేసుకోవాలి.

శిరోజాల ఆకృతిని మెరుగుపరుచుకునేందుకు ఈ మాస్క్ అమితంగా ఉపయోగపడుతుంది.

6. యోగర్ట్ అలోవెరా జెల్ + లెమన్ జ్యూస్

6. యోగర్ట్ అలోవెరా జెల్ + లెమన్ జ్యూస్

2 టేబుల్ స్పూన్ల యోగర్ట్ ని ఒక టేబుల్ స్పూన్ అలో వెరా జెల్ తో అలాగే రెండు టీస్పూన్ల లెమన్ జ్యూస్ తో కలపాలి.

ఈ డీప్ కండిషనింగ్ మాస్క్ ని మీ తలపై అప్లై చేసుకోవాలి.

ముప్పై నుంచి ముప్పై అయిదు నిమిషాల వరకు ఈ మాస్క్ ఆరేందుకు సమయమిచ్చి ఆ తరువాత గోరువెచ్చటి నీటితో మాస్క్ ని తొలగించాలి.

జుట్టు మూలాల నుంచి సంరక్షణనివ్వడానికి ఈ మాస్క్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.

7. యోగర్ట్ ఆలివ్ ఆయిల్ + ఆపిల్ సిడర్ వెనిగర్

7. యోగర్ట్ ఆలివ్ ఆయిల్ + ఆపిల్ సిడర్ వెనిగర్

రెండు టేబుల్ స్పూన్ల యోగర్ట్ ని ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తో పాటు అర టీస్పూన్ ఆపిల్ సిడర్ వెనిగర్ తో కలపాలి.

ఈ మిశ్రమంతో స్కాల్ప్ పై మసాజ్ చేసుకోవాలి.

ముప్పై నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో తలని శుభ్రపరచుకోవాలి.

నెలకి ఒకసారి ఈ మాస్క్ ను అప్లై చేయడం వలన శిరోజాలకు అద్భుతమైన పోషణ లభిస్తుంది.

8. యోగర్ట్ + కొబ్బరి పాలు

8. యోగర్ట్ + కొబ్బరి పాలు

మూడు టేబుల్ స్పూన్ల యోగర్ట్ ని ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పాలతో కలపండి.

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై అప్లై చేసి మీ మునివేళ్లతో మృదువుగా అయిదు నిమిషాలపాటు మసాజ్ చేయండి.

40 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో మీ తలను శుభ్రపరచుకోండి.

వారానికి ఒకసారి ఈ పద్ధతిలో శిరోజాలకు సంరక్షణనిస్తే దృఢమైన ప్రకాశవంతమైన శిరోజాలు మీ సొంతం.

English summary

Deep Conditioning Yogurt Hair Masks You Should Try

Deep conditioning is an effective way of treating damaged and dull-looking hair. This treatment can restore moisture to your hair follicles and provide them with much-needed nourishment, thereby improving their texture and appearance. Here are some deep-condtioning yogurt hair masks you should try.
Desktop Bottom Promotion