For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘బీర్’లో అంత దమ్ముందా..?జుట్టు సమస్యలన్నీ మాయం అవుతాయా

మీ జుట్టు సంరక్షణ కోసం వివిధ రకాల పండ్లు, కూరగాయాలు, హెర్బల్ రెమెడీస్, హెర్బల్ టీలు, ఆకులు, కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించి ఉంటారు, మరి మీరు ఎప్పుడైనా బీర్ జుట్టుకు ఉపయోగించారా? బీర్ చర్మ, జుట్టు సమస్యల

By Mallikarjuna
|
బీర్ తో జుట్టు సమస్యలన్నీ మాయం: ఎలా అంటే సింపుల్ !

మీ జుట్టు సంరక్షణ కోసం వివిధ రకాల పండ్లు, కూరగాయాలు, హెర్బల్ రెమెడీస్, హెర్బల్ టీలు, ఆకులు, కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించి ఉంటారు, మరి మీరు ఎప్పుడైనా బీర్ జుట్టుకు ఉపయోగించారా? బీర్ చర్మ, జుట్టు సమస్యలను తీర్చడానికి ఒక టానిక్ వంటిది.

జుట్టు రాలే సమస్య.. మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరిలోనూ చాలా కామన్ ప్రాబ్లమ్. ఈ వయసు, ఆ వయసు అని లేకుండా.. అందరినీ ఇబ్బందిపెట్టే సమస్య ఇది. ఎలాంటి కారణం లేకుండా.. సడెన్ గా సమస్య రావచ్చు. జుట్టు తీవ్రంగా రాలిపోతే.. వాళ్ల ఆత్మ స్తైర్థ్యం మీదా ప్రభావం చూపుతుంది.

hair care treatment using beer

జుట్టు రాలే సమస్యను ఫేస్ చేసేవాళ్లు.. దానికి ఎలాంటి ఎఫెక్టివ్ రెమెడీ లేదని భావిస్తారు. కానీ ఈ సమస్యతో బాధపడేవాళ్లకు అద్భుతమైన రెమెడీ ఉంది. అదే బీర్ రెమెడీ. ఈ న్యాచురల్ పర్ఫెక్ట్ రెమెడీ.. కొంతకాలంలోనే జుట్టు రాలడాన్ని అరికట్టి.. కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఎందుకుంటే బీర్ లో మినిరల్స్, విటమిన్స్ , ఇతర న్యూట్రీషియన్స్ ఉన్నాయి. ఇవి కండీషనర్ గా పనిచేసి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

డ్రై హెయిర్ కోసం : తేనె, అరటి, గుడ్డుపచ్చసొన, బీర్

డ్రై హెయిర్ కోసం : తేనె, అరటి, గుడ్డుపచ్చసొన, బీర్

తేనెలో తేమగుణాలు ఎక్కువగా ఉండటం వల్ల హెయిర్ ఫోలిసెల్స్ ను స్ట్రాంగ్ గా ఉంచుతుంది, హెల్తీ గ్లోను అందిస్తుంది.

అరటి పండ్లలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి ఎక్కువ ఇది, జుట్టుకు మేలు చేస్తుంది, జుట్టుకు తగిన మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. డల్ నెస్ తగ్గిస్తుంది

గుడ్డులో ప్రోటీన్స్ విటమిన్స్, మినిరల్స్ ఎక్కువ, ఇది జుట్టుకు మేలు చేస్తుంది

బీర్ లో మినిరల్స్ , విటమిన్స్ , పోషకాలు అధికంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

పద్దతి:

మిక్సీలో, అరటిముక్కలు, గుడ్డుపచ్చసొన, తేనె, అరకప్పు బీర్ వేయాలి

మిక్సీ పట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి

రెండు గంటల తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి.

ఈ పద్దతిని వారానికొకసారి ఫాలో అయితే స్ట్రాంగ్ అండ్ షైనీ హెయిర్ పొందుతారు.

గుడ్డు మరియు బీర్ - డల్ హెయిర్

గుడ్డు మరియు బీర్ - డల్ హెయిర్

గుడ్డులో మినిరల్స్, ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బీర్ లో ప్రోటీన్స్ ఎక్కువ , జుట్టుకు పోషణను అందిస్తుంది, ప్రోటీన్లు జుట్టును బలోపేతం చేస్తుంది, హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది.

పద్దతి:

ఒక బౌల్లో బీర్ వేసి 24 గంటలు అలాగే ఉంచాలి.

తర్వాత అందులో ఒక టీస్పూన్ అవొకాడో ఆయిల్, పచ్చి గుడ్డు వేయాలి

రెండు బాగా కలిపి తలకు అప్లై చేయాలి

అరగంట తర్వాత తలస్నానం చేయాలిజ

నార్మల్ వాటర్ తో తలస్నానం చేయాలి.

వారంలో రెండు సార్లు ఈ పద్దతి ఫాలో అవ్వొచ్చు.

బీర్ , ఉల్లిపాయ, కొబ్బరి నూనె --జుట్టు పెరుగుదలకు:

బీర్ , ఉల్లిపాయ, కొబ్బరి నూనె --జుట్టు పెరుగుదలకు:

ఉల్లిపాయలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువ, ఇవి జుట్టు పెరుగుదలను క్రమబద్దం చేస్తాయి

కొబ్బరి నూనెలో విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతాయి.

పద్దతి:

ఉల్లిపాయను మెత్తగా పేస్ట్ చేయాలి.ః

తర్వాత అందులో అరగ్లాసు బీర్ కలిపి తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి

అరగంట పాటు అలాగే ఉంచాలి.

తర్వాత తలస్నానం చేయాలి.

ఈ పద్దతిని వారంకు ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ అండ్ బీర్ మాస్క్---జుట్టు వాల్యుమ్ మరియు షైనింగ్ కోసం

యాపిల్ సైడర్ వెనిగర్ అండ్ బీర్ మాస్క్---జుట్టు వాల్యుమ్ మరియు షైనింగ్ కోసం

యాపిల్ సైడర్ వెనిగర్ లో హెయిర్ ఫాలీ సెల్స్, తలలో చర్మాన్ని క్లీన్ చేస్తుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టును, హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ చేస్గుంది

బీర్ మరియు యాపిల్ సైడర్ వెనిగర్ కాంబినేషన్ జుట్టుకు మంచి షైనింగ్ ఇస్తుంది

పద్దతి:

బౌల్లో బీర్, యాపిల్ సైడర్ వెనిగర్ సమంగా తీసుకోవాలి

రెండూ మిక్స్ చేసి, తలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి.

10 నిముషాలు అలాగే ఉంచాలి

తర్వాత నార్మల్ వాటర్ తో తలస్నానం చేయాలి

బీర్ తో స్నానం ---జుట్టు మెరుస్తుంది

బీర్ తో స్నానం ---జుట్టు మెరుస్తుంది

బీర్ జుట్టుకు తగిన షైనింగ్ ఇస్తుంది. డల్ నెస్ తగ్గిస్తుంది. బీర్ వల్ల ఇది ఒక అద్భు ప్రయోజనం

పద్దతి:

మెదటమీకు నచ్చిన షాంపుతో తలస్నానం చేయాలి.

తర్వాత బీర్ ను తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి

15 నిముషాల తర్వాత నార్మల్ వాటర్ తో తలస్నానం చేయాలి

బీర్ షాంపు - జుట్టు పెరుగుదలకు

బీర్ షాంపు - జుట్టు పెరుగుదలకు

బీర్ షాంపు తలలో మురికి తొలగిస్తుంది. మీ జుట్టును మంచి షైనీగా మార్చుతుంది

బీర్ జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది

పద్దతి:

ఒక కప్పు బీర్ ను 20 నిముషాల వేడి చేయాలి. ఇది మండుతుందని భయపడకండి

బీర్ చల్లబడే వరకూ ఉండాలి

ఇప్పుడు ఒక కప్పు బీర్ కు షాంపు కలపాలి

ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి.

మసాజ్ చేయాలి

నార్మల్ వాటర్ తో తలస్నానం చేయాలి

వారంలో ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి, బీర్ మాస్క్-----జుట్టు పెరుగుదల మరియు చుండ్రు

వెల్లుల్లి, బీర్ మాస్క్-----జుట్టు పెరుగుదల మరియు చుండ్రు

వెల్లుల్లిలో కాపర్, జింక్, ఐరన్ మెగ్నీషియం, సెలీనియం ఉంటాయి. ఇవి జుట్టుకు మంచి షైనింగ్ ఇస్తాయి. వీటిలో ఉండే ఫైటో కెమికల్స్, బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడి చుండ్రు తగ్గిస్తాయి

పద్దతి:

ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రసం, గుడ్డు పచ్చసొన, ఒక టేబుల్ స్పూన్ ఆముదం నూనె, బీర్ కలపాలి

తర్వాత అన్ని పదార్థాలు మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని తలకు , జుట్టు పొడవును అప్లై చేసి, మసాజ్ చేయాలి.

20 నిముషాలు అలాగే ఉంచాలి

తర్వాత నార్మల్ వాటర్, షాంపుతో తలస్నానం చేయాలి.

సూచన:

సూచన:

బీర్ ఉపయోగించే ముందు గుర్తించుకోవల్సిన విషయాలు

ఫ్లాట్ బీర్ వాడాలి

బీర్ తలకు వారంకు ఒక్కసారి ఉపయోగించాలి. లేదంటే జుట్టు డ్రైగా మారుతుంది. నార్మల్ ఆయిల్స్ తొలగిస్తుంది

ఇది పూర్తీగా న్యాచురల్ రెమెడీ. టాక్సిన్స్ ఉండవు. తేలికగా తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టును సిల్కీగా, స్మూత్ గా ఉంచుతుంది. మరి.. బట్టతల, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవాళ్లకు ఉపయోగపడే.. పర్ఫెక్ట్ రెమెడీ ఏంటో తెలుసుకుందామా..

English summary

DIY Hair Care Treatment Using Beer: 10 Easiest Home Remedies.

Ingredients in beer are malt and hops - protein that strengthens the hair cuticles. Proteins help in repairing the damaged hair caused by blow drying, straightening, colouring, curling, etc. Proteins also help in making your hair smooth and shiny. Check out the other amazing hair care remedies that you could try with beer.
Story first published:Monday, January 1, 2018, 17:23 [IST]
Desktop Bottom Promotion