For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టును వేగంగా రెండు రెట్లు ఒత్తుగా, పొడవుగా పెంచే జింజర్ హెయిర్ మాస్క్..!!

అల్లం సాధారణంగా.. ఆహారలకు స్పైన్ ని అందించి..అమోఘమైన రుచిని ఇస్తుంది. అలాగే జుట్టు కూడా త్వరగా పెరగడానికి సహాయపడుతుంది. అయితే.. జుట్టుకి, అల్లంకి సంబంధం ఏంటని సందేహం మీకు కలగవచ్చు.

|

అల్లం ప్రకృతి ప్రసాధించిన నిజమైన అద్భుతాలలో ఒకటి. ఆహార పదార్థాల తయారీలలో మసాలాగా వాడే అల్లంలోని ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రకరకాల వ్యాధులను, ఇన్ఫెక్షన్స్ ని నివారించడంలో అల్లం అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. వికారం మరియు హృదయ సంబంధిత వ్యాధులను తగ్గించటమేకాకుండా, జుట్టుకు కూడా అనేక రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది.

Ginger Hair Mask Recipe To Fasten Your Hair Growth!

అల్లం సాధారణంగా.. ఆహారలకు స్పైన్ ని అందించి..అమోఘమైన రుచిని ఇస్తుంది. అలాగే జుట్టు కూడా త్వరగా పెరగడానికి సహాయపడుతుంది. అయితే.. జుట్టుకి, అల్లంకి సంబంధం ఏంటని సందేహం మీకు కలగవచ్చు. అల్లంలో మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం మరియు విటమిన్ వంటి పోషకాలను సమృద్దిగా కలిగి ఉండే అల్లం వేరు వెంట్రుకలను బలంగా, ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. హెయిర్ ఫాలీ సెల్స్ న్యూట్రీషియన్స్ పొందేలా చేసి, స్ట్రాంగ్ గా మార్చుతుంది. దాంతో జుట్టు వేగంగా పెరుగుతుంది.

అలాగే అల్లంలో ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల జుట్టు కుదుళ్లను బలంగా మార్చి.. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. ఇంకా అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల.. స్కాల్ప్ లో ఉండే దుమ్ముని తొలగించి.. క్లెన్స్ చేస్తుంది. డాండ్రఫ్ ని తగ్గిస్తుంది. తలలో, జుట్టు కోల్పోయిన హెయిర్ పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది. దాంతో జుట్టు సూపర్ గ్లాసీగా మెరిసిపోతుంటుంది. కావున, ఏ విధంగా అల్లం మన జుట్టును ఆరోగ్యంగా మారుస్తుంది?

అల్లంతో జుట్టును అందంగా...ఆరోగ్యంగా మార్చుకోవాలంటే అల్లం మాస్క్ కు ఇతర నేచురల్ పదార్థాలైన అవొకాడో ఆయిల్, లెమన్ జ్యూస్ తులసి ఆకులను కూడా జోడించి హెయిర్ మాస్క్ తయారుచేసుకోవాలి.వీటి కాంబినేషన్ వల్ల జుట్టు సిల్కీగా మారుతుంది. నిమ్మరసం తలను శుభ్రం చేస్తుంది. కొత్తగా హెయిర్ ఫోలిసెల్స్ ను ప్రోత్సహిస్తుంది. కొబ్బరి నూనె తలకు కావల్సిన పోషణను అందించి జుట్టును స్మూత్ గా మార్చుతుంది. మరి అల్లం హెయిర్ మాస్క్ ఎలా తయారుచేసుకోవాలి. ఏవిధంగా వేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మనం ఇప్పుడు తెలుసుకుందాం...

స్టెప్ : 1

స్టెప్ : 1

మొదట అల్లం తీసుకుని, పొట్టు తీయ్యాలి. పొట్టు తీసి శుభ్రంగా కడిగి, ముక్కలు చేసి, గ్రైండర్ లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను స్ట్రెయినర్ లో వేసి, పిండి రసాన్ని వేరుచేసి, పక్కన పెట్టుకోవాలి.

స్టెప్ : 2

స్టెప్ : 2

ఇప్పుడు అవొకాడో ఆయిల్ ను ఒక టేబుల్ స్పూన్ జింజర్ జ్యూస్ లో మిక్స్ చేయాలి. అవొకాడో ఆయిల్లో విటమిన్ బి కాంప్లెక్స్, అమినో యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి హెయిర్ ఫాలీ సెల్స్ ను స్మూత్ గా మార్చుతాయి.

స్టెప్ : 3

స్టెప్ : 3

తర్వాత అరకప్పు కోకనట్ మిల్క్ ను పై మిశ్రమంలో మిక్స్ చేయాలి. కోకనట్ మిల్క్ లో ఉండే లూరిక్ యాసిడ్ డ్యామేజ్ అయిన, రఫ్ హెయిర్ ను రిపేర్ చేస్తుంది. తలను శుభ్రం చేసి, జుట్టుకు కావల్సిన పోషణను అందిస్తుంది.

స్టెప్ : 4

స్టెప్ : 4

తర్వాత 10 చుక్కల నిమ్మరసాన్ని వేసి మిక్స్ చేయాలి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి తలను శుభ్రం చేస్తుంది. కెమికల్స్ ఏర్పకుండా నివారిస్తుంది. ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

స్టెప్ : 5

స్టెప్ : 5

తర్వాత దువ్వెనతో జుట్టు చిక్కు లేకుండా దువ్వాలి. హెయిర్ మాస్క్ ముందు ఇలా చేయడం వల్ల హెయిర్ బ్రేకేజ్ అవ్వకుండా ఉంటుంది.

స్టెప్ : 6

స్టెప్ : 6

ఇప్పుడు జింజర్ మాస్క్ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి, ఫింగర్ టిప్స్ తో 10 నిముషాలు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తలలోపలికి మాస్క్ బాగా షోషింపబడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది.

స్టెప్ : 7

స్టెప్ : 7

ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో , మైల్డ్ షాంపుతో తలస్నానం చేయాలి.

స్టెప్ : 8

స్టెప్ : 8

తర్వాత కాటన్ టవల్ తో తేమను పూర్తిగా నేచురల్ గా ఆర్పుకోవాలి. ఎక్కువ మర్ధన చేయకూడుద. హెయిర్ డ్రయ్యర్స్ ఉపయోగించకూడదు.

English summary

Ginger Hair Mask Recipe To Fasten Your Hair Growth!

Make your hair grow twice as faster, with this ginger hair mask.
Desktop Bottom Promotion